OTT Movie : థ్రిల్లర్, హారర్ జానర్ సినిమాలు అంటే మూవీ లవర్స్ కి ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. అయితే అందులోను ఇటీవల కాలంలో కొరియన్ థ్రిల్లర్ సినిమాలకి మంచి ఆదరణ పెరుగుతుంది. ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ ఒక టైం ట్రావెల్ కొరియన్ మూవీ. మరి ఈ మూవీ కథ ఏంటి? ఏ ఓటిటిలో మూవీ అందుబాటులో ఉంది? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.
ప్రైమ్ వీడియోలో అందుబాటులో…
సాధారణంగా థ్రిల్లర్ సినిమాలు అనగానే నెక్స్ట్ సీన్లో ఏం జరగబోతోంది అనేది ఉత్కంఠ భరితంగా ఉంటుంది. కొన్ని సినిమాల్లో అయితే ఆ విషయాన్ని ఇట్టే పసిగట్టగలుగుతాము. మరికొన్ని సినిమాలు మాత్రం ఎంత ట్రై చేసినా నెక్స్ట్ జరగబోయే ట్విస్ట్ ఏంటో గెస్ చేయలేము. అందులో ఊహించినది అస్సలు జరగదు. ఈరోజు మనం చెప్పుకోబోయే మూవీ కూడా అలాంటిదే. ఈ మూవీ పేరు ‘హౌస్ ఆఫ్ ది డిసప్పియర్డ్‘ (House of the Disappeared). ఈ మూవీ ప్రీ క్లైమాక్స్ కు చేరుకునే వరకు ఇదొక టైం ట్రావెల్ మూవీ అన్న విషయాన్ని కనిపెట్టలేరు. అప్పటిదాకా హర్రర్ సినిమా గానే కనిపిస్తుంది.
కథలోకి వెళ్తే…
స్టోరీ 1992లో మొదలవుతుంది. ఓ మహిళ దెబ్బలతో ఆ ఇంటి బేస్మెంట్లో పడుకుంటుంది. కళ్ళు తెరిచి చూసేసరికి తన కొడుకును కాపాడుకోవడానికి ప్రయత్నించే డోర్ ఓపెన్ అయ్యి అంతలోనే ఓ శక్తి ఆ పిల్లాడిని బేస్మెంట్ లోకి లాక్కెళ్ళిపోతుంది. కానీ ఆ తర్వాత ఆమె భర్తను చంపింది అని కారణంతో, తన కొడుకులు కనిపించకుండా పోయినందుకు ఆమెను అదుపులోకి తీసుకుంటారు పోలీసులు. కానీ పాతికేళ్ల తర్వాత ఆవిడకి గొంతు క్యాన్సర్ ఉందని తెలియడంతో జైలు నుంచి రిలీజ్ చేసి అదే ఇంట్లో వదిలేస్తారు. కాకపోతే పోలీసులు ఆమెకు సెక్యూరిటీ గా ఉంటారు. అలాంటి టైంలో ఓ ఫాదర్ ఆమెను కలవడానికి అక్కడికి వెళ్ళగా పాతిక సంవత్సరాల క్రితం ఏం జరిగింది అనే విషయాన్ని ఆమె ఫాదర్ కి వివరిస్తుంది. విషయం ఏంటంటే ఈమె పేరు మీహూ. ఆవిడకి ఇద్దరు కొడుకులు ఉంటారు.
అయితే ఆమె మొదటి భర్త చనిపోతాడు. ఆమె రెండవ భర్తకు దూరంగా పిల్లలతో కలిసి ఉంటుంది. కానీ ఓ రోజు పెద్ద కొడుకు చేసిన తప్పు వల్ల చిన్న కొడుకు చనిపోతాడు. కానీ మీహూ భర్త మాత్రం తన సొంత కొడుకు చనిపోయాడని కోపంతో మీహో మొదటి కొడుకును చంపడానికి ట్రై చేస్తాడు. కానీ ఈ క్రమంలో అతనే చనిపోతాడు. అయితే ఆ తర్వాత తన కొడుకు ఆ బేస్మెంట్ లోకి వెళ్లిపోయాడు అంటూ ఆ ఫాదర్ తో స్టోరీ మొత్తం చెబుతుంది. దీంతో ఫాదర్ అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు. అయితే ఈ క్రమంలోనే అతడికి చాలా సంవత్సరాల క్రితం అదే ఇంట్లో ఇలాంటి స్టోరీనే జరిగినట్టుగా తెలుస్తుంది. అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతోంది? ఆమె చివరికి తన కొడుకును కాపాడుకోగలిగిందా? ఫాదర్ తెలుసుకున్న సీక్రెట్ ఏంటి? అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.