BigTV English

OTT Movie : ప్రియుడి ముందే ప్రియురాలికి ప్రపోజ్ చేసే అబ్బాయి…. అమ్మాయి చేసేపనికి షాక్ అవాల్సిందే

OTT Movie : ప్రియుడి ముందే ప్రియురాలికి ప్రపోజ్ చేసే అబ్బాయి…. అమ్మాయి చేసేపనికి షాక్ అవాల్సిందే

OTT Movie : రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ సినిమాలు మూవీ లవర్స్ ను ఎంతగా ఎంటర్టైన్ చేస్తాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలు కామెడీ ఎంటర్టైనర్ తోపాటు, రొమాంటిక్ సన్నివేశాలతో తెరకెక్కుతాయి. యూత్ ని ఎంటర్టైన్ చేసే అటువంటి మూవీ ఒకటి ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియో

ఇప్పుడు మనం చెప్పుకోబోయే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ పేరు “ఐ లవ్ యూ బెత్ కూపర్” (I love you Beth Cooper). ఈ మూవీలో గ్రాడ్యుయేట్ చదువుతున్న ఒక యువకుడు ఒక అమ్మాయిని ఆమెకు తెలియకుండానే ప్రేమిస్తూ ఉండేవాడు. ఈ విషయం గ్రాడ్యుయేషన్ డే రోజు అందరిముందు చెప్తాడు. ఈ మూవీ స్టోరీ హీరో తో పాటు, అతని ఫ్రెండ్స్ చుట్టూ తిరుగుతుంది. ఈ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime Video) లో స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీ లోకి వెళితే

డెన్నిస్ అని యువకుడు ఒక కాలేజీలో చదువుతూ ఉంటాడు. చదువు పూర్తయిన తర్వాత గ్రాడ్యుయేషన్ డే రోజు అందరికీ ఒక స్పీచ్ ఇస్తాడు. ఆ స్పీచ్ లో తనని ఎవరు ఇబ్బంది పెట్టారో వాళ్ల గురించి చెప్తాడు. ఆ తర్వాత అతను ఎవరిని ప్రేమిండో ఆమె గురించి కూడా చెప్తాడు. అయితే అతని మాటలకు ఫ్రెండ్స్ నొచ్చుకుంటారు. డెన్నిస్ ప్రేమించిన బెత్ కూపర్ అనే అమ్మాయి మాత్రం షాక్ అవుతుంది. ఎందుకంటే అతడు తనని ప్రేమించే విషయం ఇప్పటివరకు తనకు తెలియదు. అతనిని ఆమె సరిగ్గా చూసి కూడా ఉండదు. అతని మాటలు అక్కడే ఉన్న బెత్ కూపర్ బాయ్ ఫ్రెండ్ కు కోపం తెప్పిస్తాయి. ఆ మరుసటిరోజు   ఇంట్లో పార్టీ ఉందంటూ బెత్ ని ఆహ్వానిస్తాడు డెన్నిస్.

బెత్ అతని ఇంటికి వచ్చి పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉంటే, బెత్ బాయ్ ఫ్రెండ్ కెవిన్ అక్కడికి వచ్చి హీరోని తనదైన స్టైల్ లో కొడుతూ ఉంటాడు. డెన్నిస్ అక్కడి నుంచి అందరిని తీసుకొని కారులో వేరొక చోటికి పారిపోతాడు. కార్ డ్రైవింగ్ తెలియని బెత్ తన డ్రైవింగ్ తో అందరినీ హడాలు కొడుతుంది. ఒకచోట మధ్యలో ఆపి వీరంతా బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత బెత్ డెన్నిస్ కు అట్రాక్ట్ అవుతుంది. అతనితో సరదాగా ఉంటున్న టైంలో కెవిన్ మళ్లీ వచ్చి డెన్నిస్ ను కొడుతూ ఉంటాడు. అక్కడే ఉన్న డెన్నిస్ ఫ్రెండ్ అతనిని అతని గ్యాంగ్ ను, తనకొచ్చిన విద్యతో  చితగ్గొడతాడు. చివరికి డెన్నిస్నీ ,బెత్ లవ్ చేస్తుందా? కెవిన్, డెన్నిస్ ల గొడవ కి ఫుల్ స్టాప్ పడుతుందా? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime Video) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీని తప్పకుండా చూడండి.

Related News

OTT Movie : మంత్రగత్తె పెట్టే శాపం … ఊహించని ట్విస్టులు, తట్టుకోలేని భయాలు … క్లైమాక్స్ కూడా మరో లెవల్ సామీ

OTT Movie : స్టోరీ అంతా రాణీగారి డైమెండ్ చుట్టూనే … దిమ్మతిరిగే ట్విస్ట్లు, కన్నింగ్ ఐడియాలతో ఓటీటీ షేక్

OTT Movie : కొండక్కి కంగారు పెట్టే దెయ్యాలు … చలి, జ్వరం వచ్చే సీన్స్ … అమ్మాయిలను దారుణంగా …

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

Big Stories

×