BigTV English

OTT Movie : కళ్ళులేని అమ్మాయిపై కామాంధుడి కన్ను…. ట్విస్ట్ లతో అదరగొట్టే సినిమా

OTT Movie : కళ్ళులేని అమ్మాయిపై కామాంధుడి కన్ను…. ట్విస్ట్ లతో అదరగొట్టే సినిమా

OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లో మలయాళం సినిమాలకు రోజురోజుకీ క్రేజ్ పెరిగిపోతోంది. చిన్న సినిమాల నుంచి పాన్ ఇండియా సినిమాలు చేసే స్థాయికి మలయాళం ఇండస్ట్రీ ఎదిగింది. సస్పెన్స్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మలయాళం ఇండస్ట్రీ రూపుదిద్దుకుంటుంది. మోహన్ లాల్ నటించిన ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ థియేటర్లలో మంచి విజయాన్ని నమోదు చేసుకొని ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆమూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.


డిస్నీ ప్లస్ హాట్ స్టార్

ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ పేరు “నీరు” (Neru). ఈ మూవీలో ఒక అంధురాలని అఘాయిత్యం చేసిన వ్యక్తికి జైలు శిక్ష పడాలని హీరోతో పాటు అంధురాలు చేసే ప్రయత్నాలు చాలా గొప్పగా ఉంటాయి. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney Plus hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

సారా అనే అమ్మాయి ఒక అంధురాలు. ఈమె ఇంట్లో ఒకరోజు ఒంటరిగా ఉండటంతో, ఒక అగంతుకుడు ఇంట్లోకి చొరబడి సారాని ఆఘాయిత్యం చేస్తాడు. ఈ విషయం పోలీసుల దాకా వెళ్లడంతో, పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తారు. సారా ఇంటి పక్కన ఉన్న బ్యాచిలర్స్ పై పోలీసులకు అనుమానం వస్తుంది. వాళ్లని విచారించి సిటీ నుంచి మైఖేల్ అనే వ్యక్తి వచ్చినట్టు సమాచారం తెలుసుకుంటారు. సారా స్కల్చర్ అనే ఆర్ట్ ని నేర్చుకుని ఉంటుంది. ఎవరి ఆకారాలనైన తయారు చేయగలిగే ఆర్ట్ ఆమెకు తెలిసి ఉంటుంది. మైఖేల్ తనని ఆఘాయిత్యం చేసేటప్పుడు, ఆమె అతని మొహాన్ని చేతులతో తడుముకొని ఊహించుకొని ఉంటుంది. పోలీసులు మైఖేల్ ని పోలీస్ స్టేషన్ కి తీసుకొస్తారు. అతనిని సారా చేతులతో తడిమి గుర్తించడంతో  ఈ కేసు కోర్టుకు వెళుతుంది. అయితే మైఖేల్ తండ్రి బాగా రిచ్ కావడంతో రాజశేఖర్ అనే మంచి లాయర్ ని పెట్టుకుంటాడు. సారా తరఫున వాదించడానికి వచ్చే లాయర్లని మైఖేల్ తండ్రి కొనేస్తాడని తెలుసుకున్న ఇన్స్పెక్టర్, తనకు తెలిసిన ఒక లాయర్ ని ఏర్పాటు చేస్తాడు. అయితే రాజశేఖర్ ముందు ఆ లాయర్ చాతుర్యం అంతగా పనిచేయదు.

చివరికి విజయ్ మోహన్ అనే వ్యక్తి ఈ కేసుని వాదించడానికి ముందుకు వస్తాడు. విజయ్ మోహన్ టాలెంట్ ఉన్న న్యాయవాది. ఒకప్పుడు రాజశేఖర్ కి అసిస్టెంట్ గా వచ్చి అతని కూతుర్ని ప్రేమించటాన్ని రాజశేఖర్ కి కోపం తెప్పిస్తుంది. అందుకుగాను తన క్రిమినల్ బ్రెయిన్ వాడి విజయ్ మోహన్ ని ఐదు సంవత్సరాలు సస్పెండ్ అయ్యేవిధంగా చేస్తాడు. సారా కారణంగా మళ్లీ కోర్టుకు వచ్చి ఈ కేసును వాదిస్తాడు. వాదోపవాదాలు చాలా గట్టిగా జరుగుతాయి. చివరికి విజయ్ మోహన్ తన ప్రతిభతో ఈ కేసును గెలిపించడానికి ప్రయత్నిస్తాడు. అయితే రాజశేఖర్ ఈ కేసును గెలవనీయకుండా చేయడానికి తన కుట్రలను ప్రయోగిస్తాడు. చివరికి సారా పై అఘాయిత్యం చేసిన మైఖేల్ కి శిక్ష పడుతుందా? విజయ్ మోహన్ ఈ కేసును గెలవగలుగుతాడా? రాజశేఖర్ కుట్రలను వీళ్ళు ఎదుర్కొంటారా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తప్పకుండా చూడండి.

Related News

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి…

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

OTT Movie : పక్కింటోడి చేతిలో పాపలు బలి … రివేంజ్ కోసం భూమి మీదకి వచ్చే ఆత్మ … గూస్ బంప్స్ తెప్పించే హారర్ సినిమా

OTT Movie : వందమంది అమ్మాయిలతో ఒక్కమగాడు … యవ్వారం అంతా చీకట్లోనే …

OTT Movie : ప్రెగ్నెంట్ లేడీపై ప్రేతాత్మ కన్ను … బ్రేస్లెట్ చుట్టూ తిరిగే స్టోరీ … చెమటలు పట్టించే సీన్స్

OTT Movie : భర్తపై భార్య అరాచకం … కూతురు అంతకు మించి … ఆత్మని కూడా వదలకుండా …

Big Stories

×