BigTV English

OTT Movie : భర్తను బయటకు చెప్పుకోలేని విధంగా కొట్టే భార్య… క్రేజీ మలయాళ కామెడీ ఎంటర్టైనర్

OTT Movie : భర్తను బయటకు చెప్పుకోలేని విధంగా కొట్టే భార్య… క్రేజీ మలయాళ కామెడీ ఎంటర్టైనర్

OTT Movie : డిజిటల్ ప్లాట్ ఫామ్ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న మలయాళం మూవీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ సినిమాలను చూసే మూవీ లవర్స్ ఎక్కువగానే ఉన్నారు. మంచి కథలతో పాన్ ఇండియా మూవీలు తీసే స్థాయికి ఈ ఇండస్ట్రీ వచ్చింది. ఒక మంచి ఫ్యామిలీ స్టోరీతో కామెడీ ఎంటర్టైనర్ గా  ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఒక మలయాళం మూవీ గురించి తెలుసుకుందాం పదండి.


హాట్ స్టార్ లో

ఈ మూవీ పేరు “జయ జయ జయ జయహే” (jaya jaya jaya jaya hey). బాసిల్ జోసెఫ్ హీరోగా, దర్శనా రాజేంద్రన్ హీరోయిన్ గా నటించగా విపిన్ దాస్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఒక కుటుంబ కథా చిత్రం. ఈ సినిమాలో సన్నివేశాలు చాలా సరదాగా ఉంటాయి. ఈ మూవీ చూస్తున్నంత సేపు ఒక మంచి మూవీ చూశామన్న ఫీలింగ్ కలుగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ హాట్ స్టార్ (hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

విజయన్ అనే వ్యక్తికి ఒక అమ్మాయి పుడుతుంది. కుటుంబ సభ్యులంతా అమ్మాయి పుట్టింది కాబట్టి జాగ్రత్తగా పెంచాలి అని విజయన్ కు చెప్తారు. అలా చిన్నప్పటి నుంచి ఆమె మాటలకు విలువ ఇవ్వకుండా పెద్దలు చెప్పినట్టు నడుచుకోవాలని ఆమెకు చెప్తారు. కాలేజ్ చదువుల కోసం ఎమ్మెస్సీ చేస్తానని చెప్పడంతో, చదివించడం ఇష్టం లేని ఆమె తండ్రి బిఏలో  చేర్పిస్తాడు. ఆ కాలేజ్ లో ఒక టీచర్ అమ్మాయిల హక్కుల కోసం పోరాడుతూ ఉంటాడు. అతనిని హీరోయిన్ ఇష్టపడగా, అతను కూడా ఈమెను కట్టడి చేసే విధంగా వ్యవహరిస్తాడు. ఒకసారి హీరోయిన్ పై చేయి కూడా చేసుకుంటాడు. ఈ విషయం ఇంట్లో తెలియడంతో  హీరోయిన్ తండ్రి రాజేష్ అనే వ్యక్తితో వివాహం జరిపిస్తాడు. ప్రతిదానికి కోప్పడే రాజేష్ తన కోపాన్ని భార్యపై చూపిస్తూ కొన్నిసార్లు చేయి చేసుకుంటాడు.

ఆ తర్వాత హీరోయిన్ ఒక్కసారిగా హీరోని తిరిగి కొడుతుంది. ఈమె ఎవరికీ తెలియకుండా కరాటే నేర్చుకుంటుంది. దెబ్బలు తిన్న ఈమె భర్త బయట ఎవరికి చెప్పుకోలేక తనలోనే బాధపడుతూ ఉంటాడు. ఇంట్లో ఆమె భర్తను తన్నేటప్పుడు కుర్చీలు విరిగిపోవడంతో, మళ్లీ నీ భార్యని కొట్టావా అంటూ ఇతడిని అతని తల్లి తిడుతుంది. అలాగే హీరో కొన్ని సమస్యలలో చిక్కుకుంటాడు. ఆ సమస్యల నుంచి హీరో బయటపడ్డాడా? చివరికి హీరో తన భార్య నుంచి తనను ఎలా కాపాడుకోగలిగాడు? భర్తను భార్య చివరి వరకు ఇలా కొడుతూనే ఉంటుందా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఈ మలయాళ మూవీ “జయ జయ జయ జయహే” (Jaya Jaya Jaya Jaya he)ని తప్పకుండా చూడండి. ఈ మూవీని చూస్తున్నంత సేపు ఒక రిలాక్సబుల్ మూవీని చూశామన్న ఫీలింగ్ కలుగుతుంది. కుటుంబంతో కలిసి ఈ మూవీ ని చూసి బాగా ఎంజాయ్ చేయండి.

Related News

Junior Movie: ఓటీటీలోకి జూనియర్ మూవీ..ఆ రోజే స్ట్రీమింగ్!

OTT Movie : టెర్రరిస్టులకే టెర్రర్ పుట్టించే ఆడపులి… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్… నరాలు కట్ అయ్యే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : షార్క్‌లను దేవతలుగా భావించే సైకో… ఆడవాళ్లను బలిచ్చి దిక్కుమాలిన పని… గ్రిప్పింగ్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్

OTT Movie : తల్లీకూతుర్లు ఇద్దరితో ఒక్కడే… ఐఎమ్‌డీబీలో రేటింగ్ 9.1… తెలుగు మూవీనే మావా

OTT Movie : రోబోని కూడా వదలకుండా ఆటగాడి అరాచకం… అదిచ్చే షాక్ కు మైండ్ బ్లాంక్

OTT Movie : మనుషులకు తెలియకుండా మాయదారి పనులు… ఫ్యూచర్లో ఏఐ ఇంత డేంజర్ స్టంట్స్ చేస్తుందా మావా ?

OTT Movie : బాడీ బిల్డర్ తో ఆ పాడు పని… ఈ నలుగురు ఆడవాళ్ళూ అరాచకం మావా… సింగిల్ గా చూడాల్సిన మూవీ

OTT Movie : రియల్ కల్ట్ క్రైమ్‌… మతం పేరుతో మతిపోగోట్టే పనులు… మర్డర్ మిస్టరీతో ఊహించని టర్న్

Big Stories

×