BigTV English

OTT Movie : అద్దంలో కనిపించి భయపెట్టే అబ్బాయి… ఒంటరిగా చూడకూడని హారర్ మూవీ

OTT Movie : అద్దంలో కనిపించి భయపెట్టే అబ్బాయి… ఒంటరిగా చూడకూడని హారర్ మూవీ

OTT Movie : ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న హర్రర్ మూవీస్ లలో కామన్ పాయింట్ ప్రేక్షకులను భయపెట్టడం. కొన్ని సినిమాలు సరదాగా హాస్యంతో కలిపి ఉంటాయి. అయితే మరికొన్ని సినిమాలు వెన్నులో వణుకు పుట్టిస్తాయి. గుండె ఆగిపోతుందేమో అన్నంతగా కొన్ని సీన్స్ ఉంటాయి. వీటికి తోడు సౌండ్ ఎఫెక్ట్స్ ఉండటంతో థియేటర్లలో ఈ మూవీని చూసేవాళ్ళు వణికి పోతారు. అటువంటి ఒక మూవీ ఈరోజు మన మూవీ సజెషన్. ఈ మూవీ పేరేమిటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం.


అమెజాన్ ప్రైమ్ వీడియో

ఈ మూవీలో హర్రర్ సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఇద్దరు కవల పిల్లలలో ఒకరు చిన్నప్పుడే చనిపోతాడు. బతికున్న అమ్మాయికి అతడు కనబడుతూ భయపెడుతూ ఉంటాడు. ఆ బతికున్న అమ్మాయి చుట్టూ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ పేరు “ది అన్ బార్న్” (The unborn). ప్రస్తుతం ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

హీరోయిన్ ఒకరోజు మార్నింగ్ వాక్ కి వెళ్తుండగా ఆమెకు ఒక చిన్న పిల్లవాడు ఎదురుగా కనపడి వెంటనే అదృశ్యమైతాడు. హీరోయిన్ అక్కడికి వెళ్లి చూడగా ఒక చిన్న బేబీ శవం కనబడుతుంది. ఆ బేబీ శవాన్ని చూస్తూ ఉండగా సడన్ గా ఆ బేబీ కళ్ళు తెరుస్తుంది. ఇదంతా ఆమె కలకంటూ చాలా టెన్షన్ పడుతుంది. హీరోయిన్ ఒక ఇంట్లో నాలుగు సంవత్సరాలుగా బేబీ సిట్టర్ గా పని చేస్తూ ఉంటుంది. ఈమెకు ఈ కల వచ్చిన తర్వాత ఆ ఇంట్లో ఉన్న ఒక చిన్న బేబీ చనిపోతుంది. అప్పటినుంచి ఆ  బాలుడు ఈమెకు అద్దంలో కనబడుతూ భయపెడుతూ ఉంటాడు. ఒకరోజు హీరోయిన్ కి ఒక పురుగు కుడుతుంది. ఆ వెంటనే ఆమెకు కళ్ళు రంగు మారుతాయి. హీరోయిన్ ఆమె బాయ్ ఫ్రెండ్ తో కలసి డాక్టర్ని సంప్రదించగా, ట్విన్స్ కు మాత్రమే ఇలా జరుగుతుందని డాక్టర్ చెప్తాడు. ఆమెకు తన జీవితం గురించి తెలుసుకోవాలని తన తండ్రిని ఈ విషయం అడుగుతుంది.

మీరు పుట్టెటప్పుడు ఇద్దరు పుట్టారు,అందులో ఒకరు చనిపోయాడని ఆమెకు తండ్రి చెప్తాడు. నీతల్లి కూడా మానసికంగా బాధపడుతూ ఆత్మహత్య చేసుకుందని చెప్తాడు. హీరోయిన్ కు అప్పుడు అనుమానం వస్తుంది. చనిపోయిన తన తమ్ముడు నా చుట్టూ తిరుగుతున్నాడని అనుకుంటుంది. ఎక్కువగా అద్దంలోనే కనిపిస్తూ హీరోయిన్ ను భయపెడుతూ ఉంటాడు. ఈమెకు అలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ సమస్య నుంచి ఆమె బయట పడుతుందా? ఎందుకు ఆ అబ్బాయి హీరోయిన్ వెంట పడుతున్నాడు? ఈమె తల్లి నిజంగానే ఆత్మహత్య చేసుకుందా? అనే  విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ హర్రర్ థ్రిల్లర్ ” ది అన్ బార్న్” మూవీని తప్పకుండా చూడండి. ధైర్యం ఉంటేనే ఈ హర్రర్ థ్రిల్లర్ మూవీ ని చూడండి.

Related News

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

OTT Movie : మనిషి మాంసాన్ని ఎగబడి తినే గ్రామం… ఈ భార్యాభర్తల యాపారం తెలిస్తే గుండె గుభేల్

Big Stories

×