E-Paper
Advertisement

OTT Movie : 16 ఏళ్ల పాపపై అఘాయిత్యం… ఆ పాప చేసే పనికి మైండ్ బ్లాక్

OTT Movie : 16 ఏళ్ల పాపపై అఘాయిత్యం… ఆ పాప చేసే పనికి మైండ్ బ్లాక్
Advertisement

OTT Movie : ఓటిటిలో ఎప్పటికప్పుడు డిఫరెంట్ కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ లు, సినిమాలు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అందులో ఎక్కువగా రొమాంటిక్, బోల్డ్, క్రైమ్ సస్పెన్స్, కామెడీ, హర్రర్ సినిమాలే ఉంటాయి. వాటితో పాటే అప్పుడప్పుడూ కొన్ని మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా ఉంటాయి. అతి తక్కువగా వచ్చే ఈ సినిమాలలో ప్రశంసలు అందుకునే సినిమాలను వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. ఇక నేటి సమాజంలో జరుగుతున్న కొన్ని భయంకరమైన సంఘటనలు, హత్యలు, హత్యాచారాల నేపథ్యంలో ఓటీటీలోకి వచ్చిన సినిమాలు, సిరీస్ లు చాలా వరకు ఓటీటీలోకి వచ్చేశాయి. అలా ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సినిమా కూడా ఇదే కేటగిరీకి చెందింది. ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది? స్టోరీ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే..

అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో 

Advertisement

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా కమర్షియల్ సక్సెస్ సాధించకపోయినప్పటికీ మంచి ప్రశంసలు అందుకుంది. హిందీ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన సినిమా ‘కూకి‘ ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును దక్కించుకుంది. 2023లో బివిఎఫ్ఎఫ్ లో ప్రదర్శించిన ఈ సినిమాను 2024 మేలో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా ప్రదర్శించారు. ఇలాంటి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ‘కూకీ’ సినిమాపై ప్రశంసల వర్షం కురిసింది. ప్రణబ్ జే దేఖా దర్శకత్వం వహించగా, నిరీ మీడియా ఓపిసి ప్రైవేట్ లిమిటెడ్ పై ఈ సినిమాను నిర్మించారు. ‘కూకి’ చిత్రంలో రితీషా ఖౌండ్, రాజేష్ తైలాంగ్, రినా రాణి, దీపన్నిత శర్మ, బోధిసత్వ శర్మ, దేవోలీనా భట్టాచార్జీ, రితూ శివపురి కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉన్న ఈ సినిమా 6.2 రేటింగ్ తో టాప్ లో దూసుకెళ్తోంది. అయితే ఈ సినిమా కేవలం హిందీ, ఇంగ్లీష్ భాషలోనే ఉండడం గమనార్హం.

స్టోరీ లోకి వెళ్తే…

Advertisement

సినిమా మొత్తం ‘కూకీ’ అనే అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఈ టీనేజ్ అమ్మాయి స్కూల్ కి వెళ్తూ ఫ్రెండ్స్ తో సరదాగా ఉంటుంది. టీనేజ్ కాబట్టి అట్రాక్షన్, స్కూల్, ఫ్రెండ్స్ ఇలా సాగుతుంది ప్రతి ఒక్కరి లైఫ్. అలాగే ఈ పాప లైఫ్ కూడా సాగుతుంది. ఈ నేపథ్యంలోనే సప్త ఋషి అనే అబ్బాయితో పరిచయం ఏర్పడుతుంది. అయితే టీనేజ్ కావడంతో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్టుగా అతనితో ప్రేమలో పడుతుంది. అతను కూడా కూకిని ఇష్టపడతాడు. కానీ ఇద్దరు సైలెంట్ గా ఉంటారు. ఒకరిపై ఒకరికి ఇష్టం ఉన్నప్పటికీ బయటకు చెప్పకుండా ఈ విషయాన్ని మనసులో దాచుకుంటారు. ఓ రోజు కూకి అత్యాచారానికి గురవుతుంది. అసలు ఆమెపై ఈ అఘాయిత్యం చేసిన వ్యక్తి ఎవరు? పోలీసులు ఆ నిందితుడిని పట్టుకున్నారా? వాళ్లకు ఎలాంటి శిక్ష పడింది? ఈ దారుణమైన ఘటనపై మైనర్ బాలిక ఎలా రియాక్ట్ అవుతుంది? అనే విషయాలు తెలియాలంటే కూకీ అనే ఈ సినిమాను చూడాల్సిందే. సినిమా మొత్తం ఆలోచనలను రేకెత్తించే విధంగా ఉంటుంది. ఇక ఈ సోషల్ మెసేజ్ ఉన్న సినిమాకు ఐఎండిబిలో 9.2 రేటింగ్ ఉండడం విశేషం.

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×