OTT Movie : థియేటర్లలో వచ్చిన సినిమాలు కొద్ది రోజులలోనే ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో వచ్చిన సినిమాలు మూవీ లవర్స్ ని బాగా ఆకట్టుకుంటాయి. రీసెంట్ గా మలయాళంలో ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో వచ్చిన ఒక మూవీ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో
ఇప్పుడు మనం చెప్పుకోబోయే మలయాళ మూవీ పేరు “మైక్” (Mike) . ఈ మూవీలో హీరోయిన్ అమ్మాయి నుంచి అబ్బాయిగా మారడానికి లింగ మార్పిడి చికిత్స చేసుకోవాలనుకుంటుంది. ఈ మూవీ మంచి కంటెంట్ తో వచ్చి ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
సారా చాలా సరదాగా ఉండే అమ్మాయి. ఆమె అబ్బాయిలతో సమానంగా ఉండాలని అనుకుంటుంది. అన్ని లక్షణాలు అబ్బాయిలా ఉండి శరీరం అమ్మాయిలాగా ఉందని బాధపడుతూ ఉంటుంది. ఇంట్లో తన తల్లి వేరొకరితో రిలేషన్ పెంచుకోవడంతో సారా మనస్థాపానికి గురవుతుంది. అతను సారా తో కూడా మిస్ బిహేవ్ చేస్తుండటంతో, చివరికి శాస్త్ర చికిత్స చేసుకోవాలని మైసూర్ కి బయలుదేరుతుంది. బస్సులో ప్రయాణం చేస్తున్న ఈమెకు ఆంటోని అనే వ్యక్తి పరిచయం అవుతాడు. వీళ్ళిద్దరూ మాటలు కలుపుతూ ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు. అతని మాటలు సారాకి పాజిటివ్ గా అనిపిస్తాయి. జర్నీ లోమంచి ఫ్రెండ్స్ అయిన వీళ్ళు, బస్సు దిగగానే మళ్లీ కలుద్దామని ఎవరు దారిన వాళ్ళు వెళ్లిపోతారు. ఆంటోనీ తాగుడుకు బానిసై ఉంటాడు. ఎందుకంటే ఆంటోనీ చేసిన ఒక ప్రమాదంలో తన తల్లి చనిపోతుంది. ఆ విషయం మీద బాధపడుతూ తాగుడుకు బానిసై ఉంటాడు. మరోవైపు హాస్పిటల్ కి వెళ్లిన సారా కి ఆపరేషన్ చేయాలంటే నీతో పాటు ఎవరైనా ఒకరు ఉండాలని డాక్టర్లు చెబుతారు.
అప్పుడు ఆమెకు తోడు ఎవరూ రాకపోవడంతో ఆంటోనీ సాయం కోరుతుంది సారా. ఆంటోనీ నేను నీకు సాయం చేస్తానని చెప్తాడు. అసలు ఎందుకు నువ్వు ఆపరేషన్ చేసుకోవాలనుకుంటున్నావని అడుగుతాడు. ఆమె తనకు చిన్నప్పటి నుంచి జరిగిన విషయాలను అతనితో పంచుకుంటుంది. ఆంటోనీ మందు ఎందుకు తాగుతున్నాడో తెలుసుకోవాలనుకుంటుంది. తన తల్లి ప్రమాదానికి కారణమైనందున ఇలా అయిపోయాడని తెలుసుకుంటుంది. చివరికి వీళ్లిద్దరు హాస్పిటల్ కి వెళ్తారు. ఒకసారి ఆపరేషన్ జరిగితే మళ్లీ మార్చడం కుదరదని డాక్టర్లు చెబుతారు. హాస్పిటల్ దగ్గర సారాని వదిలిన ఆంటోనీ నేను వచ్చిన పని అయిపోయిందని వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు సారాక అర్థమవుతుంది ఆంటోనీని తను ఎంతగా ఇష్టపడుతుందో. చివరికి సారా ఆపరేషన్ చేసుకుంటుందా? ఆంటోనీ కోసం అమ్మాయిగానే జీవితాన్ని కొనసాగిస్తుందా? ఆంటోనీ సారా ప్రేమని యాక్సెప్ట్ చేస్తాడా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మూవీని తప్పకుండా చూడండి.