Navigation Apps: తాజాగా ఉత్తరప్రదేశ్ లో గూగుల్ మ్యాప్ ను నమ్ముకుని ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. గూగుల్ మ్యాప్ ను గుడ్డిగా నమ్ముతూ వెళ్లి నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి మీది నుంచి నదిలో పడి చనిపోయారు. ఈ వ్యవహారంపై సీరియస్ అయిన పోలీసులు గూగుల్ మ్యాప్ మీద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో భారత్ లో అందుబాటులో ఉన్న రెండు ప్రధాన గో టు నావిగేషన్ యాప్స్ గురించి తెలుసుకుందాం..
Google Maps vs Mappls MapMyIndia
భారత్ లో ఎక్కువగా Google Maps, Mappls MapMyIndia అనే గో-టు నావిగేషన్ యాప్స్ ఉపయోగిస్తారు. Google Maps ఆఫీసు నావిగేషన్, కొత్త కేఫేల వివరాలు, సుదూర ప్రయాణాలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ యాప్ ప్రపంచ వ్యాప్తంగా తన సేవలను అందిసున్నది. Mappls MapMyIndia అనేది భారత్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంది. మారుమూల ప్రాంతాల్లో మెరుగైన వివరాలను అందిస్తుంది.
Google Maps, Mappls MapMyIndia Google Play Store నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిల్ ఫోన్లలో Google Maps ముందే ఇన్ స్టాల్ చేసి ఉంటుంది. Mappls MapMyIndiaని ఆండ్రాయిడ్, ఐవోఎస్ స్మార్ట్ ఫోన్లలో మ్యాన్యువల్ గా ఇన్ స్టాల్ చేయాల్సి ఉంటుంది. MapMyIndia భారత్ లోని పలు కార్లలో అందుబాటులో ఉంటుంది. ఇండియన్ ఆటో మోబైల్ కంపెనీలు నావిగేషన్‌ను అందించడానికి దీనిని ఉపయోగిస్తారు. ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కార్లలో Google Mapsని ఉపయోగించవచ్చు.
ఏ యాప్ లో కవరేజీ ఎక్కువ?
Google Maps అనేది మారుమూల ప్రాంతాలను మినహాయించి, ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉంటుంది. MapMyIndia భారత్ మీద ఎక్కువగా కాన్సంట్రేషన్ పెట్టింది. భారత్ లోని మారుమూల ప్రాంతాలకు సంబంధించిన వివరాలను అందిస్తున్నది. రూరల్ ప్రాంతాల్లో Google Maps కంటే మెరుగ్గా తన సేవలను అందిస్తున్నది. Google Maps మెట్రోపాలిటన్ ప్రాంతాలలో కచ్చితమైన సమాచారాన్ని అందిస్తుంది.
రూరల్ లో Mappls MapMyIndia, అర్బన్ లో Google Maps
Google Mapsతో కలిగే లాభం ఏంటంటే? ట్రాఫిక్ రద్దీని గుర్తిస్తుంది. వినియోగదారులకు ట్రాఫిక్ గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్ ఇస్తుంది. దీని ద్వారా సమయాన్ని ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. MapMyIndia కూడా ట్రాఫిక్ డేటాను అందిస్తున్నప్పటికీ.. Google Maps అంత పక్కాగా ఇవ్వలేదు. ఇక రెండు యాప్ లలో Google Maps మెరుగైన డిజైన్ ను కలిగి ఉంటుంది. నావిగేషన్ స్పీడ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. స్ట్రీట్ వ్యూ, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, అడవులలో కార్చిచ్చు లాంటి విషయాలను పక్కాగా చూపిస్తుంది. Mappls MapMyIndia ISRO సాయంతో స్థానిక వృక్షసంపద, వాతావరణ సూచనలు, నీటి ప్రవాహాలు, మంచు వివరాలను మెరుగ్గా సూచిస్తుంది. మొత్తంగా రూరల్ ప్రాంతాల్లో Mappls MapMyIndia, అర్బన్ ఏరియా Google Maps బాగా ఉపయోగపడుతాయి.
Read Also: రూ.1.5 లక్షలు గెలుచుకొనే అవకాశం.. వెంటనే ఇలా చెయ్యండి!