BigTV English

Amoy Kumar: త్వరలోనే అమోయ్ కుమార్ అరెస్ట్? డీజీపీ జితేందర్‌కు అందిన రిపోర్ట్? బిగుస్తున్న ఉచ్చు

Amoy Kumar: త్వరలోనే అమోయ్ కుమార్ అరెస్ట్? డీజీపీ జితేందర్‌కు అందిన రిపోర్ట్? బిగుస్తున్న ఉచ్చు

పాపం పండింది..!
త్వరలోనే అమోయ్ కుమార్ అరెస్ట్?


⦿ భూదాన్ భూముల వ్యవహారంలో అమోయ్‌కు బిగుసుకున్న ఉచ్చు
⦿ ఎఫ్ఐఆర్ నమోదుకు ఈడీ రిఫర్
⦿ డీజీపీ జితేందర్‌కు అందిన రిపోర్ట్
⦿ ఆర్డీవో వెంకటాచారి, తహసీల్దార్ జ్యోతిపైనా చర్యలు
⦿ ఫిర్యాదులపై కేసులు నమోదు చేయాలని స్పష్టమైన ఆదేశాలు

స్వేచ్ఛ క్రైంబ్యూరో: Amoy Kumar: నాగారం భూదాన్ భూముల వ్యవహారంలో ఈడీ ఎంటర్ అయ్యాక ఐఏఎస్ అమోయ్ కుమార్ లీలలన్నీ బయటకొచ్చాయి. బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదులు చేశారు. బీఆర్ఎస్ హయాంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఉన్న సమయంలో అమోయ్ సాగించిన దందాలపై ఈడీ అధికారులు విచారణ జరిపి రాష్ట్ర పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. దీంతో అమోయ్ అరెస్ట్ ఖాయమనే చర్చ జరుగుతోంది.


డీజీపీకి అందిన ఈడీ రిపోర్ట్
భూదాన్ ల్యాండ్ వ్యవహారానికి సంబంధించి డీజీపీ జితేందర్‌కు ఈడీ రిపోర్ట్ అందించింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పని చేసిన అమోయ్ కుమార్‌పై కేసు నమోదుకు సిఫార్సు చేసింది. ఆయనతోపాటు ఎమ్మార్వో జ్యోతి, ఆర్డీఓ వెంకటాచారి పైనా కేసులు పెట్టాలని రిపోర్ట్ అందించింది ఈడీ. భూ బదలాయింపులో చోటు చేసుకున్న లావాదేవీలలో అనేక ఆక్రమాలు ఉన్నట్లు గుర్తించిన ఈడీ, గతంలో పోలీసులు కేసులు నమోదు చేయలేదని తెలిపింది. కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి అమోయ్ కుమార్‌తో పాటు మిగతా అధికారులపైనా కేసులు పెట్టాలని చెప్పింది.

అమోయ్‌పై చాలా మంది బాధితులు ఈడీకి ఫిర్యాదులు చేశారు. పోలీసులు పట్టించుకోకపోవడం వల్లే ఈడీకి ఫిర్యాదులు చేశామని వారు చెప్పారు. ఈ విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకెళ్లింది ఈడీ. ఈ నేపథ్యంలో సైబరాబాద్, రాచకొండ కమిషనర్లకు గతంలో వచ్చిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి విచారణ జరపాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.

Also Read: Kishan Reddy: ఏదో ఒకటి మాట్లాడడం.. వార్తల్లో నిలవడం.. ఇదే కేటీఆర్ నైజమా? కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్

అమోయ్ లీలలు ఎన్నో!
రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పని చేసిన సమయంలో అమోయ్ కుమార్ లిటిగేషన్ భూముల్ని ప్రైవేట్ వ్యక్తులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ధారాదత్తం చేశారు. దీనికి సంబంధించి ఆయన భారీగా లబ్ధి పొందారని ‘స్వేచ్ఛ’ ఇన్వెస్టిగేషన్ టీం గతంలోనే పక్కా ఆధారాలతో కథనాలు ఇచ్చింది. ఓసారి ఆ వివరాలను మరోసారి పరిశీలిద్దాం.

1. శేరిలింగంపల్లి మండలం గుట్టల బేగంపేట్‌ సర్వే నెంబర్ 63లో ప్రభుత్వానికి 42 ఎకరాల భూమి ఉండేది. బహిరంగ మార్కెట్‌లో దీని విలువ సుమారు రూ.2,100 కోట్లు. సెత్వార్ రికార్డులను పరిశీలిస్తే ఇప్పటికీ ఈ భూమి ప్రభుత్వ ల్యాండ్‌గానే ఉంది. దీనిపై కోర్టులో కేసు నడుస్తోంది. ఈ పంచాయితీ ఉండగానే అమోయ్ 2022 డిసెంబర్‌లో పట్టాలిచ్చేశారు.
2. గోపన్ పల్లిలోని సర్వే నెంబర్ 124/10, 11లలో ప్రభుత్వానికి 50 ఎకరాల భూమి ఉంది. దీని విలువ బహిరంగ మార్కెట్‌ల రూ.2 వేల కోట్ల వరకూ ఉంటుంది. అమోయ్ దీన్ని పట్టా భూమిగా మార్చేసి లబ్ధి పొందారు.
3. శేరిలింగంపల్లి సర్వే నెంబర్ 90, 91 టు 102లోని 110 ఎకరాల భూమిని గతంలో ప్రభుత్వం అలూమిని కంపెనీకి కేటాయించింది. బహిరంగ మార్కెట్‌లో ప్రస్తుతం ఎకరం రూ.50 కోట్లు పలుకుతోంది. దీనిపై సుప్రీంలో కేసులు ఉండగానే, అమోయ్ కుమార్ ఓ పార్టీకి అనుకూలంగా చక్రం తిప్పారు.
4. మాదాపూర్‌లో సర్వే నెంబర్ 68లో సుమారు 5 ఎకరాల ప్రభుత్వ భూమిని పట్టాగా మార్చారు. దీని విలువ బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.300 కోట్లు.
5. హఫీజ్ పేట్‌లోని సర్వే నెంబర్ 80లోని ప్రభుత్వ భూమిపై కోర్టులో కేసు నడుస్తోంది. ఈ భూమితో పాటు కొండాపూర్ గ్రామ శివారులోని సర్వే నెంబర్ 87, 88ల్లోని భూమి కలుపుకొని పట్టాలు మంజూరు చేశారు. ఈ భూముల విలువ రూ.500 కోట్ల దాకా ఉంటుంది.
6. మోకిల – కొండాపూర్ మధ్య 150 ఎకరాల భూమి వివాదాస్పదంగా ఉంది. దీనిపై హక్కు రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది. కానీ, ఈ విషయాన్ని అస్సలు పట్టించుకోకుండా అమోయ్ కుమార్ ఓ ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టారు.
7. వట్టినాగులపల్లి సర్వే నెంబర్స్ 186, 187లలో 20 ఎకరాల భూదాన్ భూములను, అమోయ్ కుమార్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, హరీష్ రావు అనుయాయులకు కట్టబెట్టారు. ఈ నిర్ణయం వల్ల సుమారు రూ.600 కోట్ల స్కాం జరిగినట్లు ఆరోపణలున్నాయి.
8. ఖానాపూర్‌లోని 150 ఎకరాల బిల్లా దాఖలు భూమి ఉంది. దీని విలువ బహిరంగ మార్కెట్లో రూ.6,000 కోట్లుంటుంది. 65 అనే సర్వే నెంబర్‌ను క్రియేట్ చేసి ప్రతాప్ జంగలే, ఇతరులకు పట్టా చేశారు.
9. మియాపూర్ సర్వే నెంబర్ 69లో 27 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, బహిరంగ మార్కెట్‌లో ఎకరం రూ.50 కోట్లు పలుకుతోంది. ఇంతటి విలువైన సర్కారీ భూమిలో బిల్డింగ్స్ కట్టుకునేందుకు అప్పటి కలెక్టర్ అమోయ్ కుమార్ అనుమతులు ఇచ్చేశారు.
10. గచ్చిబౌలిలోని సర్వే నెంబర్స్ 38, 54 ల్యాండ్స్ సీలింగ్ సర్ప్లస్ భూములు. మొత్తం 76 ఎకరాల వరకు ఉంటుంది. ఈ భూమి విలువ రూ.3,800 కోట్ల వరకు ఉంటుంది. ఇంతటి విలువైన ప్రభుత్వ భూమిలో ఇప్పటికే ఫినిక్స్, అయోధ్య రామిరెడ్డి, శిల్పా నాగిరెడ్డి, మినాక్షి సంస్థలు తిష్ట వేశాయి.
11. గోపన్ పల్లి సర్వే నెంబర్స్ 36, 37లోని భూములు పూర్తిగా ప్రభుత్వానివే. ఈ రెండు సర్వే నెంబర్స్‌లో కలిపి సుమారు 600 ఎకరాల వరకు భూమి ఉంటుంది. నర్సింగరావు అతని బ్రదర్స్‌కు రెవెన్యూ అధికారులు 90 ఎకరాల భూమిని స్వాధీనంలోకి తీసుకునేందుకు అప్పగించారు. సర్వే నెంబర్ 36లో మరికొంత ల్యాండ్‌ను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేశారు.
12. మహేశ్వరం – తుమ్మలూరు మధ్య ప్రభుత్వానికి 70 ఎకరాల భూమి ఉండగా, బహిరంగ మార్కెట్‌లో రూ.210 కోట్ల వరకూ ఉంటుంది. దీన్ని అమోయ్ కుమార్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనుయాయులకు కట్టబెట్టే యత్నం చేశారు.
13. తిమ్మాపూర్‌లోని భూదాన్ భూముల్లో ప్రహరీ నిర్మాణం జరిగింది. రూ.200 కోట్ల విలువైన 39.18 ఎకరాల భూమికి రెక్కలొచ్చాయి. దీనికి కారణం కూడా అమోయ్. ధరణిలో లొసుగులతో రికార్డుల్లో పట్టా భూములుగా మార్చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే అమోయ్ లీలలు అన్నీ ఇన్నీకావు. వీటిపై ఫోకస్ చేసిన ఈడీ, బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ప్రస్తుతానికి కేసుల నమోదుకు రాష్ట్ర పోలీసులకు ఆదేశాలిచ్చింది. డీజీపీ కూడా విచారణకు ఆదేశించారు. దీంతో అమోయ్ పాపం పండిందని బాధితులు అంటున్నారు.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×