BirthKamal Haasan : టాలీవుడ్, కొలీవుడ్ ఇండస్ట్రీలో హీరో చేసి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న విలక్షణ నటుడు కమల్ హాసన్ ( Kamal Haasa) . తమిళ హీరోనే అయిన తెలుగులో మంచి సినిమాలు చేశారు. హీరోగానే కాదు.. తనలోని దసవతారాలను చూపించి ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. వందల సినిమాల్లో నటించిన ఈయన, నటుడుగా అతి తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ ను అందుకున్నాడు. ఎటువంటి పాత్రలోనైనా ఒదిగిపోయి నటిస్తాడు. అందుకే ఆయన సినిమాలు అన్ని సూపర్ హిట్ అయ్యాయి. ఈయన చివరగా ఇండియన్ 2 సినిమాలో నటించాడు. అది బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ మధ్య వచ్చిన కల్కి సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించి మెప్పించాడు. ఇక హీరోగా సినిమాలు చెయ్యడం మాత్రమే కాదు. పలు సినిమాలను సొంతంగా నిర్మించారు. ఆయన నిర్మించిన బ్లాక్ బాస్టర్ సినిమాలు ఏవో ఒకసారి తెలుసుకుందాం..
కమల్ హాసన్ నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించారు. ఆయన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌లో ఇటీవల నిర్మించిన అమరన్ సినిమా థియేటర్లలో సక్సెస్ టాక్ తో దూసుకుపోతుంది.
కమల్ హాసన్ నిర్మించిన 5 హిట్ మూవీస్ ఇవే..
ప్రముఖ డైరెక్టర్ శ్రీనివాసరావు దర్శకత్వంలో 1989 లో రిలీజైన చిత్రం ‘అపూర్వ సహోదరులు’ . ఈ కమల్ హాసన్ మూడు విభిన్న పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని కూడా కమలే నిర్మించారు. కమల్ కెరీర్‌లో ఒక మైలురాయిగా ఈ చిత్రం నిలిచింది.. ఈ సినిమాకు ఇప్పటికి అదే క్రేజ్ ఉండటం విశేషం..
ఇక కమల్ హాసన్ నటించి, నిర్మించడమే కాకుండా కథ, మాటలు కూడా రాసిన సినిమా ‘తేవర్ మగన్’. ఈ చిత్రానికి జాతీయ అవార్డు కూడా లభించింది. ఈ సినిమా దీపావళి కానుకగా రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది..
అలాగే కమల్ హాసన్ నిర్మాణంలో 2004లో రిలీజ్ అయి సినిమా విరుమాండి. ఈ మూవీకి కమలే దర్శకత్వం వహించి, హీరోగా కూడా నటించారు. ఈ మూవీలో పల్లెటూరు గెటప్ లో మాస్ లుక్ కనిపించి ఆకట్టుకున్నాడు.. అప్పటిలో ఈ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.
అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన చిత్రం అంటే అది కమల్ విశ్వరూపమే. ఈ మూవీ 2013లో విడుదలైంది. ఈ చిత్రాన్ని మొదట నేరుగా టీవీలో విడుదల చేయాలని కమల్ హాసన్ అనుకున్నారు.
ఇక విక్రమ్ సినిమా.. 4 సంవత్సరాలు సినిమాల్లో నటించకుండా ఉన్న కమల్ హాసన్ విక్రమ్ చిత్రం ద్వారా అద్భుతమైన కమ్ బ్యాక్ ఇచ్చారు. ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించారు. ఇక రీసెంట్ గా శివ కార్తికేయన్ అమరన్ మూవీ.. ఇవన్నీ కూడా కమల్ తన సొంత బ్యానర్ పై నిర్మించారు. ఇకపోతే ఈయన నటించిన ఇండియన్ 3 మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది.. అలాగే బ్లాక్ బాస్టర్ మూవీ కల్కి లో ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఆ సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న కల్కి 2 లో నటిస్తున్నాడు.