BigTV English

OTT Movie : దయ్యాలు ఉన్నాయని తెలీక ఇంటిని కొన్న యజమానికి చుక్కలు చూపించే దయ్యాలు

OTT Movie : దయ్యాలు ఉన్నాయని తెలీక ఇంటిని కొన్న యజమానికి చుక్కలు చూపించే దయ్యాలు

OTT Movie : మలయాళం సినిమాలకు ఇప్పుడు మార్కెట్లో మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమాలను మంచి కంటెంట్ తో తెరమీద ప్రజెంట్ చేస్తున్నారు మలయాళం దర్శకులు. థియేటర్లలో హర్రర్ కంటెంట్ తో రిలీజ్ అయిన ఒక మూవీ మంచి విజయం సాధించి, ప్రస్తుతం ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియో

ఇప్పుడు మనం చెప్పుకోబోయే మలయాళం మూవీ పేరు ‘ఫినిక్స్‘ (Phoenix). ఈ మూవీలో సన్నివేశాలు మొదటి నుంచి చివరిదాకా చాలా ట్విస్ట్ లు ఉంటాయి. ఒక సస్పెన్స్ హర్రర్ మూవీ చూడాలనుకునే మూవీ లవర్స్ కు ఈ మూవీ బెస్ట్ సజెషన్. ఈ హారర్ థ్రిల్లర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

జాన్ ఒక లాయర్ గా తన వృత్తిని కొనసాగిస్తూ ఉంటాడు. ఇతను ఒక ఇంటిని కొనాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. చాలా ఇళ్లను  చూసిన తర్వాత ఊరికి దూరంగా ఉండే ఒక ఇళ్ళు జానకి నచ్చుతుంది. ఆ ఇంటిని కొని అందులోనే, ఇతనికి భార్య ఇద్దరు పిల్లలు నివాసం ఉంటారు. ఆ తర్వాత అదే ఊరిలో ఒక సీనియర్ లాయర్ దగ్గర అసిస్టెంట్ గా ఉద్యోగం చేస్తూ ఉంటాడు. అన్ని సరిగ్గా ఉన్న క్రమంలో ఇతనికి ఆ ఇంట్లో కొన్ని లెటర్స్ వస్తూ ఉంటాయి. ఆ లెటర్స్ లో ఇతని పర్సనల్ లైఫ్ లో జరిగిన విషయాలతో పాటు, జరగబోయే కొన్ని విషయాలను కూడా రాసి ఉంటుంది. జాన్ పోస్ట్ మాన్ దగ్గరికి వెళ్లి ఈ లెటర్లు మావి కావని చెప్తాడు. అయితే ఈ లెటర్ లను నేను పంపలేదని పోస్ట్ మాన్ బదులు ఇస్తాడు. జాన్ ఇంట్లో కొన్ని వింత ఆకారాలు చప్పుడు చేస్తూ ఉంటాయి. లెటర్ లో రాసి ఉన్న కొన్ని విషయాలు జరుగుతూ ఉండటంతో, జాన్ లో కొంత భయం మొదలవుతుంది. ఫ్రెడ్డీ అనే అతనికి, ఈ లెటర్లు రోసి అనే అమ్మాయి రాసినట్టుగా ఉంటుంది.

అయితే కొంతమందిని విచారించగా వాళ్ళు చెప్పే  విషయం తెలుసుకుని షాక్ కు గురవుతాడు జాన్. కొన్ని సంవత్సరాల క్రితం ఫ్రెడ్డి ఒక పేద ఇంటి అమ్మాయిని ప్రేమించి, పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంటాడు. అయితే వీళ్ళిద్దరూ ఒక హోటల్ ని నడుపుతూ ఉంటారు. హోటల్ సరిగ్గా నడవకపోవడంతో, పేదరికం అనుభవిస్తారు. ప్రెడ్డి పేదరికాన్ని అనుభవించలేక, తన తండ్రి కుదిర్చిన పెళ్లి సంబంధానికి ఓకే చెప్తాడు. ఈ క్రమంలో ఆ ఊరిలో ఒక వింత వ్యాధి ప్రబలుతుంది. ఈ వ్యాధిన పడి చాలామంది చనిపోతూ ఉంటారు. హీరోయిన్ ఆ మహమ్మారి బారిన పడిందని కొంతమంది చంపడానికి ప్రయత్నిస్తారు? చివరికి రోసి చనిపోతుందా? ఈ లెటర్స్ రాస్తున్నది ఎవరు? ఫ్రెడ్డీ చివరకు ఏమవుతాడు? జాన్ ఇంట్లో ఉన్న ఆత్మ ఎవరిది? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని తప్పకుండా చూడండి.

Related News

OTT Movie : భర్తే భార్యను వేరొకడితో … కుంభకోణాల ట్విస్ట్‌ లు, సీట్ ఎడ్జ్‌ థ్రిల్లర్ లు … ఒక్కసారి చూశారంటే

OTT Movie : డ్రగ్ ట్రాఫికింగ్ చుట్టూ తిరిగే బెంగాలీ సిరీస్ … తల్లీకూతుర్లదే అసలు స్టోరీ … IMDBలో కూడా మంచి రేటింగ్

OTT Movie : ఆటకోసం అబ్బాయిగా మారే అమ్మాయి … ట్రయాంగిల్ లవ్ స్టోరీతో అదిరిపోయే థ్రిల్లింగ్

OTT Movie : అడవిలో ఒంటరి అమ్మాయి … రాత్రీపగలూ అతడితోనే … క్లైమాక్స్ వరకూ రచ్చే

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి…

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

Big Stories

×