trinayani serial today Episode: తిలొత్తమ్మ కోపంగా వల్లభను కొడుతుంటే అఖండ స్వామి ఆగమని చెప్తాడు. అవకాశం చేజారిపోయాక ఆవేశం పనికిరాదు అని చెప్తాడు. దీంతో వీడు చేసిన పనికి ఇవాళ పనైపోతుందని అనుకున్నాను కానీ ఇంత తింగరి పని చేస్తాడనుకోలేదు అంటుంది. తనకేం తెలుసని తిలొత్తమ్మ చేతి గుర్తు ఉందని తెలియగానే పట్టుకుని వచ్చాడు అని అఖండ స్వామి చెప్పగానే అవును స్వామి వాళ్లైనా ఆ ముద్రలు వేశాక ఎవరిది ఏదో వాళ్ల పేర్లు రాయోచ్చు కదా..? అంటాడు. వల్లభ తింగరి మాటలకు తిలొత్తమ్మ కోప్పడుతుంది.
దీంతో అయినా దసరా రోజు చేతి ముద్రలు హాసిని, నయని, సుమన వేసుకున్నారు కానీ గాయత్రి పెద్దమ్మ ఎలా వచ్చింది చేతి ముద్రలు వేసింది అని డౌటుగా అడగ్గానే అవును నిజమే కదా? తిలొత్తమ్మ అంటాడు అఖండస్వామి. మరి ఇప్పుడు ఏం చేద్దాం అని తిలొత్తమ్మ అడగ్గానే మరో దారిలో వెళదాం అని చెప్పి స్వామి వెళ్లిపోతాడు. నయని హాల్‌లో క్లీన్ చేస్తుంటే హాసిని వచ్చి చెల్లి నువ్వు నేత్రిగా ఉన్నప్పుడు విశాల్‌కు తప్పా.. గాయత్రికి గానవికి కూడా దగ్గరగా ఉండవు తెలుసా.. అంటుంది. అయ్యో ఎందుకు అక్కా అలా అంటూ నయని అడగ్గానే మాకేం తెలుసు అంటుంది హాసిని. ఇంతలో విశాల వచ్చి గాయత్రి పాపను అక్కడ దింపి పని చేసుకోవచ్చు కదా..? అంటాడు విశాల్.
ఇంతలో వల్లభ, అఖండస్వామి, తిలొత్తమ్మ అక్కడకు వస్తారు. నయనిని నమ్మలేదని చెప్తారు. విశాల్ కూడా మీరు ఇంకా నమ్మలేదా.. అన్నయ్యా అని అడిగితే నా పెళ్లి అయినప్పటి నుంచి వీళ్లు ఇలాగే ఉన్నారు కదండి బాబుగారు అంటుంది నయని. ఇంతలో తిలొత్తమ్మ, వల్లభ తీసుకొచ్చిన లాప్‌ట్యాప్ ఓపెన్ చేసి నయనిని యాక్సెస్ ఇవ్వమని అడుగుతుంది. ఇప్పుడు ఏం అవసరం ఉందని అడుగుతున్నారు బాబుగారు అని నయని అడుగుతుంది. అలా అంటే తప్పించుకోవడమే అవుతుంది అంటాడు అఖండస్వామి. దీంతో నయని భయంతో విశాలాక్షి తల్లి వేలి ముద్రలు సరిపోవు ఇప్పుడు నువ్వే కాపాడాలి తల్లి అని మనసులో అనుకుంటూ వెళ్లి మిషన్ మీద బొటనవేళు పెడుతుంది.
మిషన్ అథెంటికేషన్ ఫెయిల్ అని వస్తుంది. నయని భయపడుతుంది. ఇంతలో హాసిని రిలాక్స్ చెల్లి టెన్షన్ పడకు చూపుడు వేలు పెట్టు అని చెప్తుంది. ఏ వెలు పెట్టిన సరిపోదు అని అఖండ స్వామి అంటాడు. మీరు ఆగండి స్వామి ఏ వేలు పెట్టినా సరిపోతుంది. నయని నువ్వు చూపుడు వేలు పెట్టు అంటాడు విశాల్. నయని చూపుడు వేలు పెట్టగానే అప్పుడు కూడా ఫెయిల్ అని వస్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. మిషన్ లో లోపం ఉందేమో అని హాసిని అంటుంది. అయితే వేరే వాళ్లు వేలు పెట్టి చూడండి వాళ్లది కూడా ఫెయిల్ అయితే అప్పుడు మిషన్ ఫెయిల్ అయినట్టు అంటాడు అఖండస్వామి. దీంతో విశాల్ తన వేలు పెట్టగానే సక్సెస్ అవుతుంది.
అందరూ షాక్ అవుతారు. హాసిని పెట్టినా సక్సెస్ అవుతుంది. దీంతో విశాల్ ఆశ్చర్యంగా ఉంది. నయని నువ్వు మరోసారి ట్రై చేయి అని చెప్తాడు విశాల్. నయని అనుమానంగా వేలు పెట్టగానే మళ్లీ ఫెయిల్ అవుతుంది. దీంతో ఇప్పుడు చెప్పండి ఇంకా నయని అంటే నమ్ముతారా..? అని అఖండ స్వామి అడగ్గానే నేను నమ్ముతాను అంటాడు విశాల్. వాళ్లు నిరూపించిన తర్వాత కూడా మీరు ఎలా నమ్ముతారు అని సుమన అడుగుతుంది. ఇంతలో నయని లోపలికి వెళ్లిపోతుంది. విశాల్ దీర్ఘంగా ఆలోచిస్తుంటే.. సుమన వచ్చి ఇప్పుడేమంటారు బులి బావ గారు అని అడుగుతుంది. తను మా అక్క కాదని మీ అమ్మ వాళ్లు నిరూపించేశారు కదా..? అనగానే ఎలా నిరూపించారు అని విక్రాంత్ అడుగుతాడు. మీరు కూడా అక్కడ ఉన్నారు కదా మళ్లీ ఎలా అని అడుగుతారేంటి అని ప్రశ్నిస్తుంది. దీంతో కోపంగా విక్రాంత్ సుమనను తిట్టి.. నయని వదిన ప్రాణం పోయి ఆత్మగా ఇంటికి వచ్చిందని చెప్పగానే సుమన భయంతో వణికిపోతుంది. ఇంతటితో త్రినయని సీరియల్ నేటి ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?