Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. హీరోగా, సహాయ నటుడుగా వందల సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులు అభిమానాన్ని పొందారు. ఈయన చేసే ప్రతి పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అందుకే ఆయనకు తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేక స్థానం ఉంది. నటుడు రాజేంద్ర ప్రసాద్ తాజాగా ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. ఆ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ స్టార్ట్ అయ్యింది. దాని ప్రమోషన్స్ లో భాగంగా ఒక ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. అసలు ఆ వీడియోలో ఏముందో ఒకసారి తెలుసుకుందాం..
నటుడు రాజేంద్రప్రసాద్ చాలావరకు వివాదాలకు దూరంగా ఉంటారు. ప్రెస్ మీట్ ఏదైనా పాజిటివ్‌గా ఉంటాడు. అందరి గురించి పాజిటివ్‌గా మాట్లాడతాడు. అంతేకాదు బాగా ప్రశంసిస్తుంటాడు, కానీ ఆయన ఉన్నట్టుండి నోరు జారాడు. `పుష్ప 2` సినిమాపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో అల్లు అర్జున్ పుష్పరాజ్‌గా ఎర్రచందనం స్మగ్లర్‌గా నటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేసి అడ్డంగా ఇరుక్కున్నాడు. అందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈయన తాజాగా `హరికథ` అనే సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. మ్యాగీ దీనికి దర్శకత్వం వహించారు. రాజేంద్రప్రసాద్‌తో పాటు శ్రీరామ్, మౌనిక రెడ్డి, అర్జున్ అంబటి, రుచిర సాధినేని తదితరులు కీలక పాత్రల్లో నటించారు.. ఈ సిరీస్ 13 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ సంచలనంగా మారాడు.. ఇప్పుడు సినిమాల కథలు పూర్తిగా మారిపోయాయి.. వాడెవడో చందనం దొంగ వాడు హీరో అంటూ నోరు జారాడు రాజేంద్రప్రసాద్. కానీ ఆయన రెగ్యూలర్‌గానే మాట్లాడుతూ వెళ్లిపోయారు. అంతేకాదు తనపై తాను కూడా విమర్శలు చేసుకున్నారు. హీరోల్లో మీనింగ్‌లు మారిపోయాయని తెలిపారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరి దీని పై అల్లు అర్జున్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి…
ఈ ఈవెంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో దీనిపై కామెంట్స్ చేస్తున్నారు. ఇంత వయసు వచ్చింది. కానీ ఇలా ఒక హీరోను అనడం తప్పు. ఆయన సినిమాల గురించి తెలిసి ఇలా అనడం ముమ్మాటికీ తప్పు.. అంత పెద్ద స్టార్ హీరో మనోభావాలు దెబ్బ తినేలా చెయ్యడం అనేది ఆయనకే వదిలేస్తున్నాం అని బన్నీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ ఏమో కానీ రాజేంద్ర ప్రసాద్ ఘాటు వ్యాఖ్యలపై సినీ అభిమానులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇది ఎన్ని వివాదాలకు కేరాఫ్ గా మారుతుందో చూడాలి..
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">