BigTV English

OTT Movie : భర్త పట్టించుకోవట్లేదని పనివాడితో అలాంటి పని… క్లైమాక్స్ మిస్ అవ్వకుండా చూడాల్సిన మూవీ

OTT Movie : భర్త పట్టించుకోవట్లేదని పనివాడితో అలాంటి పని… క్లైమాక్స్ మిస్ అవ్వకుండా చూడాల్సిన మూవీ

OTT Movie : యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ చిత్రాలను తరికెక్కించడంలో హాలీవుడ్ మేకర్స్ ఒక అడుగు ముందే ఉంటారు. అటువంటి మూవీస్ ను చూస్తూ మూవీ లవర్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక మంచి యూత్ ఫుల్ ఎంటర్టైన్ స్టోరీ వెండితెరపై హల్ చల్ చేసి, ప్రస్తుతం ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ యూత్ ఫుల్ ఎంటర్టైన్ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియో

ఇది ఒక హాలీవుడ్ మూవీ. భర్త భార్యను పట్టించుకోకుండా తన పనిలో బిజీగా వుండటంతో, హీరోయిన్ తన భర్తను కాకుండా పనివాడిని ఇష్టపడటంతో ఈ మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీని లవ్, సస్పెన్స్ థ్రిల్లర్ తో అద్భుతంగా తెరకెక్కించారు మేకర్స్. ఈ మూవీ పేరు “ప్రైవేట్ ప్రాపర్టీ” (Private property). ప్రస్తుతం ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీ లోకి వెళితే

కేథరిన్ సినిమాలలో హీరోయిన్ గా ట్రై చేస్తూ ఉంటుంది. ఆమె భర్త అప్పటికే ఒక స్టార్ హీరోగా సినిమాలు చేస్తూ ఉంటాడు. అయితే భర్త ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండటంతో భార్యను ఎక్కువగా పట్టించుకోడు. హీరోయిన్ అప్పుడప్పుడే సినిమాలలో ఎంట్రీ ఇస్తుండటంతో  తనకోసం ఒక స్క్రిప్ట్ రాసుకొని ఉంటుంది.  దానిని ఒకరోజు తన భర్తకు చెప్పడానికి వెళ్ళగా, ఆమె రాసిన స్క్రిప్ట్ చదవకుండానే వెళ్ళిపోతాడు. ఆ తరువాత ఈ విషయం పై ఆమె చాలా బాధపడుతూ ఉంటుంది. మరోవైపు ఆమె దగ్గర పనిచేసే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయడంతో, ఆ ఇంట్లో పనిచేయడానికి ఒక కొత్త పనివాడు వస్తాడు. అతని పేరు బెన్. అతను ఆమెకు పనివాడిగా ఉంటూ దగ్గర అవడానికి ట్రై చేస్తాడు. ఆమె చేసే ప్రతి పనికి సాయం చేస్తూ ఉంటాడు. హీరోయిన్ రాసిన స్క్రిప్ట్ ని చదివి బాగుందని చెప్తాడు.

పాత పనివాడిని పోలీసులు అరెస్ట్ చేసేవిధంగా ప్లాన్ చేసి హీరోయిన్ ఇంట్లోకి వస్తాడు బెన్. ఆమెతో మంచిగా ఉంటూనే అతని ఫ్రెండ్ సాయం తీసుకుని ఇంట్లోని వస్తువులు దొంగతనం చేసి తీసుకొని వెళ్లాలని మొదట అనుకుంటాడు. అయితే ఆమెను తన వశం చేసుకోవడం కూడా అతని టార్గెట్ లో భాగమని, ఆమెను తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తాడు. భర్త సరిగ్గా పట్టించుకొకపోవడంతో, ఆమె కూడా ఆ పనివాడి మాయలో పడిపోతుంది. అతనితో ఏకాంతంగా గడిపే స్తాయికి వెళ్ళిపోతుంది. బెన్ పన్నిన కుట్రను తెలుసుకోలేక అతడు మంచివాడాని నమ్ముతుంది.ఈ క్రమంలో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి. హీరోయిన్ అతని మోసాన్ని కనిపెట్టగలిగిందా? వీరిద్దరి విషయం హీరోకి తెలుస్తుందా? చివరికి అతని చేతిలో హీరోయిన్ ఏమవుతుంది? అనే విషయాలను తీసుకోవాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ప్రైవేట్ ప్రాపర్టీ (Private property) మూవీని తప్పకుండా చూడండి.

Related News

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

OTT Movie : పక్కింటోడి చేతిలో పాపలు బలి … రివేంజ్ కోసం భూమి మీదకి వచ్చే ఆత్మ … గూస్ బంప్స్ తెప్పించే హారర్ సినిమా

OTT Movie : వందమంది అమ్మాయిలతో ఒక్కమగాడు … యవ్వారం అంతా చీకట్లోనే …

OTT Movie : ప్రెగ్నెంట్ లేడీపై ప్రేతాత్మ కన్ను … బ్రేస్లెట్ చుట్టూ తిరిగే స్టోరీ … చెమటలు పట్టించే సీన్స్

OTT Movie : భర్తపై భార్య అరాచకం … కూతురు అంతకు మించి … ఆత్మని కూడా వదలకుండా …

OTT Movie : మంత్రగత్తె పెట్టే శాపం … ఊహించని ట్విస్టులు, తట్టుకోలేని భయాలు … క్లైమాక్స్ కూడా మరో లెవల్ సామీ

Big Stories

×