BigTV English

Bigg Boss 8 Telugu: యష్మీ, గౌతమ్ మధ్య ‘ముద్దు’ సంభాషణ.. నామినేషన్స్‌లో ఏంటా మాటలు?

Bigg Boss 8 Telugu: యష్మీ, గౌతమ్ మధ్య ‘ముద్దు’ సంభాషణ.. నామినేషన్స్‌లో ఏంటా మాటలు?

Bigg Boss 8 Telugu Latest Episode Highlights: తాజాగా జరిగిన నామినేషన్స్‌లో కేవలం ఒక్క కంటెస్టెంట్‌ను మాత్రమే నామినేట్ చేయగలరని బిగ్ బాస్ తెలిపారు. అయితే ఈసారి ఎక్కువగా రివెంజ్ నామినేషన్స్ జరిగాయని స్పష్టంగా అర్థమవుతోంది. హరితేజ తనను నామినేట్ చేసిందని ప్రేరణ.. తనకు రివెంజ్ నామినేషన్ వేసింది. గౌతమ్ తనను నామినేట్ చేశాడని.. యష్మీ తనను తిరిగి నామినేట్ చేసింది. కానీ ఈసారి ఎక్కువ నామినేషన్స్ మాత్రం యష్మీకే పడ్డాయి. అయితే గౌతమ్, యష్మీ మధ్య సాగిన నామినేషన్స్ మాత్రం కాస్త ఇంట్రెస్టింగ్‌గా సాగాయి. అంతే కాకుండా మెగా చీఫ్ అవ్వడం వల్ల అవినాష్‌కు బిగ్ బాస్ ఒక స్పెషల్ పవర్ ఇచ్చారు. దాంతో తను నిఖిల్‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.


యష్మీకే ఎక్కువ నామినేషన్స్

ముందుగా గంగవ్వ వచ్చి యష్మీని నామినేట్ చేసింది. గౌతమ్ బాగా ఆడినా కూడా అనవసరంగా తనపై నిందలు వేసిందని, యాపిల్ టాస్క్‌లో చీటింగ్ చేసిందని, ఆటలో ఓడిపోతే తన ప్రవర్తన పూర్తిగా మారిపోతుందని కారణాలు చెప్పింది. గంగవ్వతో ఏమీ వాదించలేని యష్మీ.. సైలెంట్‌గా నామినేషన్‌ను యాక్సెప్ట్ చేసింది. ఆ తర్వాత వచ్చిన రోహిణి కూడా యష్మీనే నామినేట్ చేసింది. చివరికి గౌతమ్ వచ్చి కూడా యష్మీ పేరే చెప్పాడు. గతవారం యష్మీ, గౌతమ్ ఇద్దరూ కలిసి ఒకే టీమ్‌లో ఆడారు. ఆ సమయంలో యష్మీ చాలాసార్లు మాటలు మార్చిందని కారణం చెప్పాడు. అలా వారిద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. అంతే కాకుండా వీరి నామినేషన్స్ సమయంలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది.


Also Read: అప్పుడే మొదలెట్టేశారా?.. ఈ వారం ఆమె అవుట్..?

ముద్దు పెట్టుకోవాలా

గతవారం టాస్కుల సమయంలో గౌతమ్ సరిగ్గా ఆడలేదని యష్మీ ఫీలయ్యింది. అదే విషయాన్ని నామినేషన్స్ సమయంలో గౌతమ్‌కు గుర్తుచేసింది. బాగా ఆడలేదు కాబట్టే ఆడలేదు అన్నాను లేకపోతే వచ్చి ముద్దు పెట్టి బాగా ఆడావని చెప్పాలని అనుకుంటున్నావా అంటూ ప్రశ్నించింది యష్మీ. సీరియస్ సంభాషణలో ముద్దు గురించి మాట్లాడేసరికి గౌతమ్ సిగ్గుపడ్డాడు. సీరియస్‌గా జరిగే నామినేషన్స్ సమయంలో ఇలాంటి మాటలేంటి అని ఆడియన్స్‌కు అనిపించింది. ఇక యష్మీ కూడా వచ్చి గౌతమ్‌నే నామినేట్ చేసి తనను అక్క అని పిలవడం ఇష్టం లేదని తేల్చి చెప్పింది. అలా ఇద్దరి నామినేషన్ కాస్త సరదాగా, కాస్త సీరియస్‌గా సాగింది.

సేవ్ చేశాడు

విష్ణుప్రియా వచ్చి ప్రేరణనే నామినేట్ చేస్తూ తన కోపమే కారణమని చెప్పింది. నబీల్ వచ్చి గతవారంలో తనను నామినేట్ చేసినందుకు విష్ణుప్రియాను నామినేట్ చేశాడు. విష్ణుప్రియా కూడా తనదే తప్పు అని ఒప్పుకొని సైలెంట్ అయిపోయింది. టేస్టీ తేజ వచ్చి పృథ్విని నామినేట్ చేశాడు. గతవారం నామినేషన్స్ సమయంలో సీరియస్‌గా ఆలోచించకుండా సిగరెట్ తాగుతూ కూర్చున్నాడని కారణం చెప్పాడు. ఇక మెగా చీఫ్ అవ్వడం వల్ల అవినాష్‌కు ఒక సూపర్ పవర్ ఇచ్చారు బిగ్ బాస్. ఒక కంటెస్టెంట్‌ను సేవ్ చేసి, మరొక కంటెస్టెంట్‌ను నామినేట్ చేయమని చెప్పగా.. రోహిణిని సేవ్ చేసి, నిఖిల్‌ను నామినేట్ చేశాడు. నిఖిల్‌ను కోపం తగ్గించుకోమని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.

Related News

Bigg Boss 9 : బిగ్ బాస్ 9 అగ్నిపరీక్షలో అభిజీత్ రచ్చ రచ్చ.. వామ్మో, ఇంత జరుగుతోందా?

Big Boss: బిగ్ బాస్ హౌస్‌లోకి పహల్గాం ఉగ్రదాడి బాధితులు!

Bigg Boss 9 Telugu: డబుల్ హౌస్.. డబుల్ డోస్..బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్

Monal Gajjar : బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గుర్తుందా.? ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Big Stories

×