BigTV English

OTT Movie : భర్తకు ప్రియుడితో అడ్డంగా దొరికిపోయే భార్య… దిమ్మ తిరిగే ట్విస్ట్ లున్న బో*ల్డ్ మూవీ

OTT Movie : భర్తకు ప్రియుడితో అడ్డంగా దొరికిపోయే భార్య… దిమ్మ తిరిగే ట్విస్ట్ లున్న బో*ల్డ్ మూవీ

OTT Movie : ఓటిటిలో ఎన్నో సినిమాలు అందుబాటులో ఉన్నప్పటికీ అందులో కొన్ని సినిమాలు చూసినప్పుడు మాత్రమే ట్విస్ట్ ల మీద ట్వీస్ట్ లతో ఏముందిరా సామీ సినిమా అని అనిపిస్తుంది. అందులోనూ క్లైమాక్స్ అదిరిపోయే రేంజ్ లో ఉంటే ఆ కిక్కు వేరే లెవెల్ లో ఉంటుంది. కొన్నిసార్లు సినిమా మొత్తం ఎలా ఉన్నా సరే క్లైమాక్స్ తో పక్కా బ్లాక్ బస్టర్ అని అనిపించుకుంటాయి సినిమాలు. అలా వారెవ్వా అనే ఫీలింగ్ కలిగే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమానే ఈరోజు మన మూవీ సజెషన్. మరి ఈ మూవీ ఏ ఓటీటీ లో అందుబాటులో ఉంది? సినిమా కథ ఏంటి? అనే విషయాలపై ఒక లుక్కేద్డామ్  పదండి.


జియో సినిమాలో స్ట్రీమింగ్

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమాలో ఏకంగా ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి కోసం కొట్టుకుంటారు. బయట కూడా ఇలాంటివి సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. కానీ సినిమాలో మాత్రం అదిరిపోయే ట్విస్ట్ ఉంటుంది. ఇద్దరు అబ్బాయిలతో హీరోయిన్ కు ఉండే రిలేషన్ షాకింగ్ గా అనిపిస్తుంది. ఒకవేళ మీరు గనక ఈ సినిమాను ఇప్పటిదాకా చూడకపోయి ఉంటే ఓ మంచి మిస్టరీ సినిమాను మిస్ అయినట్టే. ఈ క్రేజీ మిస్టరీ సినిమా ప్రస్తుతం జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతుంది.


కథలోకి వెళ్తే…

ఒక రీసార్ట్ లో ఇద్దరు కపుల్స్ కనిపిస్తారు. అయితే ఓ రిచ్ వ్యక్తి వీళ్ళిద్దరిని ఫాలో అవుతూ కనిపిస్తాడు. వాళ్లు లేని టైం చూసుకుని రూమ్ లోకి వెళ్లి ఏదో వెతుకుతాడు. అంతలోనే ఆ రూమ్ లోకి ఒక అమ్మాయి అడుగుపెట్టడంతో సినిమా షాకింగ్ మలుపు తిరుగుతుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు ఇతని భార్యనే. ఇక విషయం ఏమిటంటే పెళ్లయిన ఈ మహిళ తన భర్తకు తెలియకుండానే ప్రియుడుతో కలిసి ఎంజాయ్ చేయడానికి రీసార్ట్ కి వెళ్తుంది. అలా మరో వ్యక్తితో భార్యకు ఎఫైర్ ఉందని తెలుసుకున్న భర్త ఆమెను అక్కడికక్కడే కోపంతో కాల్చి చంపేస్తాడు. అయితే ఏదో పట్టరాని కోపంలో చేసిన ఆ తప్పును తెలుసుకొని హత్య నింద తన మీద పడద్దని సాక్ష్యాలను తారుమారు చేడానికి ప్రయత్నాలు చేస్తాడు. ఇక ఆ తర్వాత చనిపోయిన అమ్మాయి ప్రియుడు ఎవరో తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది. అతను ఒక పోలీస్ ఆఫీసర్. చనిపోయింది ఎవరో తెలియకుండానే తన ప్రియురాలి కేసును ఇన్వెస్టిగేట్ చేస్తాడు. ఆ తర్వాత తన గర్ల్ ఫ్రెండ్ చనిపోయింది అన్న విషయాన్ని తెలుసుకొని ఆమె భర్తపై దాడి చేస్తాడు. అంతేకాకుండా హీరోయిన్ బ్రతికే ఉందని తెలుసుకుని ఆమెను ఇద్దరు కలిసి హాస్పిటల్ కు పంపుతారు. ఈ క్రమంలోనే మరోవైపు భర్తను అరెస్ట్ చేస్తారు. ఇక ఇప్పుడు సినిమా మలుపు తిప్పే మరో ఎంట్రీ ఉంటుంది. ఈ కేసును హ్యాండిల్ చేయడానికి హీరో ప్రయత్నిస్తాడు. అసలు అమ్మాయి బ్రతికే ఉందా? తప్పు ఎవరిదన్న విషయాన్ని హీరో ఎలా తేల్చాడు? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఫ్రాక్చర్ అనే ఈ సినిమాపై ఒక లుక్కెయ్యండి.

Related News

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

OTT Movie : పక్కింటోడి చేతిలో పాపలు బలి … రివేంజ్ కోసం భూమి మీదకి వచ్చే ఆత్మ … గూస్ బంప్స్ తెప్పించే హారర్ సినిమా

OTT Movie : వందమంది అమ్మాయిలతో ఒక్కమగాడు … యవ్వారం అంతా చీకట్లోనే …

OTT Movie : ప్రెగ్నెంట్ లేడీపై ప్రేతాత్మ కన్ను … బ్రేస్లెట్ చుట్టూ తిరిగే స్టోరీ … చెమటలు పట్టించే సీన్స్

OTT Movie : భర్తపై భార్య అరాచకం … కూతురు అంతకు మించి … ఆత్మని కూడా వదలకుండా …

OTT Movie : మంత్రగత్తె పెట్టే శాపం … ఊహించని ట్విస్టులు, తట్టుకోలేని భయాలు … క్లైమాక్స్ కూడా మరో లెవల్ సామీ

Big Stories

×