BigTV English

OTT Movie : చిన్న పిల్లల్ని చంపి తినే సైకో… ఓటిటిని షేక్ చేస్తున్న సైకో కిల్లర్ మూవీ

OTT Movie : చిన్న పిల్లల్ని చంపి తినే సైకో… ఓటిటిని షేక్ చేస్తున్న సైకో కిల్లర్ మూవీ

OTT Movie : ఓటీటీలకు క్రేజ్ పెరగడంతో, మూవీ లవర్స్ ను మరింతగా ఆకర్షించేందుకు వివిధ జానర్‌ల సినిమాల రాక కూడా పెరిగింది. చాలా మందికి క్రైమ్, సైకో థ్రిల్లర్ చిత్రాలంటే ఇష్టం. ముఖ్యంగా సైకో కిల్లర్ సినిమాలు ఎంత ఎంగేజింగ్ గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులోని కథ హృదయాన్ని హత్తుకునే సన్నివేశాలతో క్షణం క్షణం చూసే వాళ్లను భయపెడుతుంది. ఇలాంటి సినిమాలను ఇష్టపడే వాళ్ళ కోసమే ఇటీవల విడుదలైన సైకో క్రైమ్ థ్రిల్లర్ గురించి ఈ రోజు మూవీ సజెషన్ లో చెప్పుకుందాం. IMDbలో అత్యధిక రేటింగ్ పొందిన ఈ సినిమా పేరేంటి? ఏ ఓటీటీలో ఉందో ఒక లుక్కేద్దాం పదండి.


రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన మూవీ 

2006లో ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దేశాన్ని కుదిపేసిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ మూవీ రీసెంట్ గా ఓటీటీలోకి అడుగు పెట్టింది. ఈ భయంకరమైన సంఘటనను ‘నిఠారీ’ సంఘటన అని కూడా పిలుస్తారు. ఈ చిత్రంలో విక్రాంత్ మాస్సే, దీపక్ టోబ్రియల్, దర్శన్ జరివాలా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి “సెక్టార్ 36” అనే టైటిల్ పెట్టారు. చిన్న చిన్న అబ్బాయిలు, అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుని చంపే సైకో కిల్లర్ కథ ఇది. నటుడు విక్రాంత్ మాస్సే ఈ చిత్రంలో ప్రేమ్ సింగ్ అనే సైకో కిల్లర్‌గా కనిపించాడు. ఇటీవలే దిగ్గజ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో విడుదలైన ఈ చిత్రం భారతదేశంలోని టాప్ 10 ట్రెండింగ్ చిత్రాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. దీనికి IMDbలో 10కి 7.4 రేటింగ్ కూడా ఉంది. సెక్టార్ 36కి ఆదిత్య నింబాల్కర్ దర్శకత్వం వహించారు. సైకో అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఒకవేళ ఇంకా ఈ సినిమాను చూడకపోతే వెంటనే ఒక లుక్కేయండి.


Watch Sector 36 | Netflix Official Site

స్టోరీ లోకి వెళ్తే.. 

ప్రేమ్ సింగ్ ఒక ధనిక వ్యాపారవేత్త భవనంలో సేవకుడు. ఈ వ్యాపారి ఎక్కువగా విదేశాల్లో తిరుగుతూ ఉంటాడు. ఆ సమయంలో ఆ ఇంట్లో ప్రేమ్ సింగ్ మాత్రమే ఉంటాడు. ఒంటరిగా ఉండే ఈ ప్రేమ్ జుక్కీ అనే మురికివాడకు చెందిన పిల్లలను రాత్రికి కిడ్నాప్ చేసి మాన్షన్‌కి తీసుకువస్తాడు. ఆపై వారిని చంపి, శరీర భాగాలను సమీపంలోని కాలువలోకి విసిరివేస్తారు. తప్పిపోతున్న చిన్నారుల సంఖ్య రోజురోజుకూ పెరుగుపోతుంటే, తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తారు. ఈ క్రమంలో ఇ న్‌స్పెక్టర్‌ రామ్ చరణ్ పాండే కుమార్తెను కూడా ప్రేమ్ సింగ్ కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ ప్లాన్ ఫలించదు. ఈ సంఘటన తర్వాత రామ్ చరణ్ పాండే హంతకుడిని కనుగొనడానికి దర్యాప్తు ప్రారంభిస్తాడు. అప్పుడు బయట పడే షాకింగ్ నిజాలు దిగ్భ్రాంతికి గురి చేస్తాయి. అసలు ప్రేమ్ సింగ్ ఆ పిల్లలను ఎందుకు చంపుతున్నాడు? ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు ? చివరకు ఏమైంది? అనే విషయాలు తెలియాలంటే సెక్టార్ 36 చూడాల్సిందే.

 

 

Tags

Related News

Friday Ott Release Movies: ఓటీటీల్లో సినిమాల జాతర.. ఇవాళ ఒక్కరోజే 15 సినిమాలు..

Mothevari Love story: స్ట్రీమింగ్ కి సిద్ధమైన మోతెవరి లవ్ స్టోరీ.. తెలంగాణ గ్రామీణ ప్రేమకథగా!

OTT Movie : ఆ 19వ ఫ్లోర్ నరకం… యాక్సిడెంట్ తో వర్చువల్ రియాలిటీ గేమ్ ఉచ్చులో… ఓడితే కోమాలోకి

OTT Movie : అయ్య బాబోయ్ టీచర్ కు అబ్బాయిల మోజు… పోలీస్ తోనే వైరల్ వయ్యారి రాసలీలలు

OTT Movie : అందమైన అమ్మాయిపై కన్నేసే మాఫియా డాన్… 365 రోజులు బందీగా ఉంచి అదే పని… అన్నీ అవే సీన్లు

OTT Movie : భార్య ప్రైవేట్ ఫొటోలు బయటకు…. భర్త ఉండగానే దారుణం… బ్లాక్‌మెయిలర్

Big Stories

×