BigTV English

Jayam Ravi: నన్ను ఇంట్లో నుంచి గెంటేసింది.. భార్య పై పోలీస్ కేసు పెట్టిన స్టార్ హీరో?

Jayam Ravi: నన్ను ఇంట్లో నుంచి గెంటేసింది.. భార్య పై పోలీస్ కేసు పెట్టిన స్టార్ హీరో?

Jayam Ravi : సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య పెళ్లిళ్లు, విడాకులు కామన్ అయ్యాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలే మనస్పర్థలు కారణంగా కోర్టు మెట్లేకుతున్నారు. ఇప్పటికే చాలా మంది జంటలు విడాకులు తీసుకున్నారు ఇప్పుడు మరో స్టార్ కపుల్ విడాకులు తీసుకుబోతున్నారు. ఈ జంట విడాకుల గురించి గతంలో చాలా వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు అధికారికంగా వీరిద్దరూ విడాకులు తీసుకోనున్నట్లు ప్రకటించారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక తాజాగా వీరిద్దరి గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతుంది. జయం రవి తన భార్య పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది.


గత కొన్ని రోజులుగా వీరిద్దరి విడాకుల వార్తలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. తన భార్య ఆర్తికి విడాకులు ఇస్తున్నట్లు నటుడు జయం రవి ప్రకటించారన్న సంగతి తెలిసిందే . అయితే ఈ విషయంలో ఆర్తి తనకు సంబంధం లేకుండానే జయం రవి ప్రకటించారని వెల్లడించింది.. ఇక విడాకుల గురించి జయం రవి ప్రకటించినప్పుడు, ఇద్దరూ పరస్పరం చర్చించుకుని ఈ నిర్ణయం తీసుకుంటారని చాలా మంది అనుకున్నారు. అయితే ముఖ్యంగా వీరి విడాకులకు గాయని కెనిషా ఫ్రాన్సిస్ కారణం అనే చర్చ జరుగుతోంది. వీరిద్దరి ప్రేమ వ్యవహారం వార్తల్లో హైలెట్ అవుతుంది.

Jayam Ravi filed a case that his wife was not allowed to enter the house
Jayam Ravi filed a case that his wife was not allowed to enter the house

ఇదిలా ఉండగా తాజాగా జయం రవి తన భార్య ఆర్తి పై చెన్నై అడయార్ పోలీస్ స్టేషన్‌ లో ఫిర్యాదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.. ఆమె తనను ఇంటి నుంచి గెంటివేసినట్టు పేర్కొన్నట్లు తెలుస్తోంది. అలాగే, జయం రవి తన ఫిర్యాదు లో చెన్నైలోని ఈసీఆర్ రోడ్‌లోని ఆర్తి ఇంటి నుండి తన వస్తువులను తిరిగి ఇవ్వాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక తమిళ ఇండస్ట్రీలో ఇలాంటివి కామన్ అయ్యాయి.. మొన్న ఐశ్వర్య, ధనుష్ కూడా అంతే సడెన్ గా విడి పోతున్నాం అని ప్రకటించారు. జయం రవి 2009 లో ఆర్తిని పెళ్లి చేసుకున్నాడు. జయం రవి ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి భార్య, ఫ్యామిలీ ఫొటోలు డిలీట్‌ చేయడంతో విడాకుల వార్తలకు బలం చేకూరినట్లయ్యింది. అలాగే, ఆర్తి సైతం ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ నుంచి ఫొటోలు డిలీట్‌ చేసింది. అప్పటినుండి ఈ చర్చ జరుగుతూనే ఉంది. అనుకున్నట్లుగానే ఆ గాసిప్స్ ను నిజం చేస్తూ జయం రవి సోషల్ మీడియా ద్వారా విడిపోయాం అని చెప్పాడు. తన భార్యకు కూడా చెప్పకుండా ఎలా అనే భావన అందరికోసం సందేహం వచ్చేలా చేస్తుంది. ఇప్పుడు ఇంట్లోకి రానివ్వలేదు అని.. ఏది ఏమైనా ఈ వార్త తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది. మరి ఈ కేసు ఎక్కడివరకు వెళ్తుందో చూడాలి.. జయం రవి ఒక సింగర్ తో రిలేషన్ లో ఉన్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×