BigTV English

OTT Movie : కూతురుకు తండ్రినంటూ ఒంటరి మహిళకు సైకో టార్చర్… క్రేజీ సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : కూతురుకు తండ్రినంటూ ఒంటరి మహిళకు సైకో టార్చర్… క్రేజీ సస్పెన్స్ థ్రిల్లర్

ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. పైగా రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన సినిమాలు అయితే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఓటీటీలోకి వచ్చేసింది. మరి ఈ మూవీ పేరేంటి ? కథ ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


5 నెలలు ఆలస్యంగా ఓటీటీలోకి..
థియేటర్లలోకి వచ్చిన 40 రోజుల్లోపే కొత్త సినిమాలన్నీ ఓటీటీలోకి వచ్చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే మూవీ మాత్రం బిగ్ స్క్రీన్ పై రిలీజ్ అయిన 5 నెలల తరువాత ఓటీటీలోకి అడుగు పెట్టింది. ఇందులో విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించగా, పాన్ ఇండియా సినిమాగా రిలీజైంది ‘శబరి’. ఎట్ట‌కేల‌కు అన్నిఅడ్డంకులు దాటుకొని ఐదు నెల‌ల త‌ర్వాత ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. పలువురు దిగ్గజ డైరెక్టర్ ల దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన అనిల్ కాట్జ్ ఈ సినిమాతో దర్శకుడిగా అడుగు పెట్టారు.మహా మూవీస్ బ్యానర్ పై మహేంద్రనాథ్ కూండ్ల ఈ సినిమాను నిర్మించగా… గ‌ణేశ్ వెంక‌ట్రామ‌న్‌, శశాంక్, మైమ్ గోపి, బ‌ధునంద‌న్ ప్రధాన పాత్ర‌ల్లో న‌టించారు. గోపీ సుంద‌ర్ ఈ మూవీకి సంగీతం అందించారు. కాగా ‘శబరి’ మూవీ వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్ళికి ముందే రిలీజ్ అయిన సినిమా. ‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది. పైగా పక్కా లేడి ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. కానీ కమర్షియర్ గా సినిమా హిట్ కాకపోవడం గమనార్హం. అయితే ఇప్పుడు మనం చూస్తున్నది ఓటీటీలో కాబట్టి సరదాగా ఈ సినిమాపై ఒక లుక్ వేయవచ్చు.

కథ లోకి వెళ్తే…
సంజ‌న అర‌వింద్ ను ప్రేమించి లవ్ మ్యారేజ్ చేసుకుంటుంది. వీళ్ళు ముంబైలో కాపురం ఉంటారు. కొన్నాళ్ల‌కు అత‌ను మోసం చేశాడని తెలుసుకుని సంజ‌న త‌న కూతురు రియాను తీసుకొని ముంబ‌యి నుంచి వైజాగ్‌కు సెటిల్ అవ్వడానికి వస్తుంది. ఒక ఫ్రెండ్ సాయంతో ఓ కంపెనీలో జుంబా ట్రైన‌ర్‌గా చేరి జీవితాన్ని వెళ్ల‌దీస్తుంది. ఓ రోజు స‌డెన్‌గా సూర్యం అనే ఒక సైకో రియా తన కూతురు, త‌న‌కు అప్ప‌గించాలంటూ సంజ‌న కు చుక్కలు చూపస్తాడు. మ‌రోవైపు అర‌వింద్ త‌న కూతుర్ని త‌న‌కు అప్ప‌గించాలంటూ కోర్లో కేసు వేస్తాడు.మ‌రి ఈ క్ర‌మంలో కూతుర్ని కాపాడుకునేందుకు సంజ‌న ఏం చేయాల్సి వచ్చింది? రియా అసలు ఎవరి కూతురు? సైకో సూర్యం ఎవరు? అనే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌క‌థ‌నాల‌తో సాగే ఈ సినిమాను ఈ వీకెండ్ చూసి ఎంజాయ్ చేయండి. కూతుర్ని కాపాడుకోవ‌డం కోసం త‌ల్లి చేసిన పోరాటం ఇతివృత్తంగా రూపొందిన ఈ సైక‌లాజిక‌ల్ సస్పెన్స్‌ థ్రిల్ల‌ర్‌గా మూవీ ద‌స‌రా సంద‌ర్భంగా ఆక్టోబ‌ర్ 11 నుంచి స‌న్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.


Related News

OTT Movie : శవాలని తవ్వి తినే సైకో.. ఒక్కో ట్విస్ట్ మెంటల్ మాస్ భయ్యా… రాత్రిపూట ఒంటరిగా చూడాల్సిన మూవీ

OTT Movie : ఆఫీస్ పేరుతో చిన్నింటి యవ్వారం… ఆ స్మెల్ లోనే సంతోషం వెతుక్కునే భార్య… లాస్ట్ కి ఫ్యూజులు అవుటయ్యే ట్విస్ట్

OTT Movie : అర్ధరాత్రి అరుపులు… లేని పెళ్ళాం మిస్సింగ్ అంటూ కేసు… కేక పెట్టించే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : 16 ఏళ్ల అమ్మాయిపై భక్తి పేరుతో బాబా దారుణం… IMDbలో రేటింగ్ 8.0… మస్ట్ వాచ్ కోర్టు రూమ్ డ్రామా

OTT Movie : ముసలి భర్త పక్కనుండగా కుర్రాడితో… మెంటలెక్కించే ట్విస్టులు, సర్ప్రైజింగ్ క్లైమాక్స్… ఆ సీన్లు కూడా

OTT Movie : స్టార్ హీరోలెవ్వరూ చేయని సాహసాలు… హర్రర్ నుంచి సస్పెన్స్ దాకా మమ్ముట్టి కెరీర్ బెస్ట్ మూవీస్ ఇవే

Big Stories

×