BigTV English

OTT Movie : అమ్మాయిపై వారం పాటు ఒకరి తరువాత ఒకరు అఘాయిత్యం… దమ్మున్న కోర్టు రూమ్ డ్రామా

OTT Movie : అమ్మాయిపై వారం పాటు ఒకరి తరువాత ఒకరు అఘాయిత్యం… దమ్మున్న కోర్టు రూమ్ డ్రామా

OTT Movie : సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలంటే ఎక్కువగా ఇష్టపడే మూవీ లవర్స్ కి ఓటిటి ప్లాట్ ఫామ్ ఒక అడ్డాగా మారింది.  ఓటీటీ ప్లాట్ ఫామ్ లో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు చాలానే స్ట్రీమింగ్ అవుతున్నాయి. అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఎదుర్కొనే స్టోరీలతో ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటిలో కొన్ని సినిమాలు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటాయి. అటువంటి మూవీ ఒకటి ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.


జి ఫైవ్ (Zee5)

ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ పేరు “సియా” (Siya). ఈ మూవీలో ఒక అమ్మాయి దారుణంగా అఘాయిత్యానికి గురై ఉంటుంది. ఆమె పోలీసులు, కోర్టుల ముందు ఎలా ఈ విషయాన్ని ధైర్యంగా ఎదుర్కొనిందో కళ్లకు కట్టినట్లు చూపిస్తారు. ఈ మూవీ ప్రస్తుతం ఓటిటి ప్లాట్ ఫామ్ ‘జి ఫైవ్’ (Zee5) లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒక రియల్ స్టోరీ తో ఈ మూవీని తెరమీదకి తీసుకువచ్చారు మేకర్స్.


స్టోరీ లోకి వెళితే

సియా ఒక సాధారణ అమ్మాయి. చిన్నచిన్న పనులు చేసుకుంటూ తన కుటుంబానికి సాయంగా ఉంటుంది. తన తమ్ముడికి చదువు చెప్పిస్తూ జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. ఈమె ఢిల్లీకి వెళ్లి అక్కడున్న బంధువుల దగ్గర ఏదైనా ఉద్యోగం చేసి కుటుంబానికి సాయంగా ఉండాలని అనుకుంటుంది. ఈ విషయాన్ని తన మామయ్యకు చెప్తుంది. ఢిల్లీలో అమ్మాయిలు ఒంటరిగా బతకడం కష్టమని ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. అయితే కష్టాలలో ఉన్న సియా ఢిల్లీకి వెళ్లాలనుకుని బయలుదే రుతుంది. మార్గమధ్యంలో ఆకతాయిల గుంపు ఆమె ను కిడ్నాప్ చేస్తుంది. ఆమెను ఒక గదిలో బంధించి వారం రోజులపాటు అత్యంత దారుణంగా, ఒకరి తర్వాత ఒకరు అఘాయిత్యం చేస్తూ ఉంటారు. సియా కనపడకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తారు. ఇన్స్పెక్టర్ వీళ్ళ కంప్లైంట్ ని తేలిగ్గా తీసుకుంటాడు. మీ అమ్మాయి ఎవరినైనా ప్రేమించి అతడితో వెళ్ళిపోయిందని సమాధానం చెప్తాడు.

సియా మామయ్య సోషల్ మీడియాలో ఈ విషయం గురించి మాట్లాడుతాడు. ఆ తర్వాత ఈ కేసుకు బలం పెరగడంతో కిడ్నాపర్స్ సియాను వదిలేస్తారు. ఆ వ్యక్తులు ఎవరో కాదు రాజకీయ పలుకుబడి ఉన్న ఒక బడా నేత మనుషులు. ఈ ఘటనలో ఆ బడా నేత కొడుకు కూడా ఉండడంతో ఇన్స్పెక్టర్ ఈ కేసును వాపస్ తీసుకుంటాడు. అందుకు సియా ఒప్పుకోకపోవడంతో, ఆమె తండ్రిపై కొన్ని దొంగ కేసులు పెట్టి చిత్రహింసలు చేస్తాడు. ఈ క్రమంలో సియా తనకు జరిగిన అన్యాయాన్ని ధైర్యంగా ఎదుర్కొంటుందా? సియా తండ్రి పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వస్తాడా? చివరికి అఘాయిత్యం చేసిన వాళ్ళకి జైలు శిక్ష పడుతుందా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్  జీ ఫైవ్ (Zee5) లో స్ట్రీమింగ్ అవుతున్న సియా (Siya) మూవీని తప్పకుండా చూడండి.

Tags

Related News

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Big Stories

×