BigTV English
Advertisement

OTT Movie : ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో భార్య… మెంటల్ మాస్ షాక్ ఇచ్చే భర్త… వీడు మగాడ్రా బుజ్జి

OTT Movie : ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో భార్య… మెంటల్ మాస్ షాక్ ఇచ్చే భర్త… వీడు మగాడ్రా బుజ్జి

OTT Movie : ఎంటర్టైన్మెంట్ కోసం ఓటీటీ వైపే చూస్తున్నారు ప్రేక్షకులు. అందులోనూ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ లను మరింత ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఇన్వెస్టిగేటింగ్ క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో వచ్చింది. ఈ కథ ఒక డాక్టర్ తన భార్యను, ఆమె పాస్ట్ నుంచి వచ్చిన బ్లాక్‌మెయిల్ థ్రెట్ నుంచి సేవ్ చేయడానికి ట్రై చేయడం చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలో వచ్చే సస్పెన్స్ ట్విస్టులు ఆడియన్స్ ని అలరించాయి. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే

‘గార్డియన్’ (Guardian) సతీష్ పాల్ డైరెక్ట్ చేసిన మలయాళం ఇన్వెస్టిగేటింగ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. ఇందులో సైజు కురుప్ (డాక్టర్ అరుణ్‌గా), మియా జార్జ్ (ASP మీరా మోహన్‌దాస్‌గా), నయన ఎల్జా (శ్రుతిగా), సిజోయ్ వర్గీస్ (SSP నందకుమార్‌గా), షియాస్ కరీమ్ (కిరణ్‌గా) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2021 జనవరి 1 నుంచి ప్రైమ్ రీల్స్ అనే ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లో రిలీజ్ అయింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో, మనోరమ మాక్స్ లో కూడా అందుబాటులో ఉంది. 2 గంటల 9 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా IMDbలో 6.0/10 రేటింగ్ పొందింది.

స్టోరీలోకి వెళ్తే

ఈ కథ తిరువనంతపురంలో జరుగుతుంది. ఇక్కడ శ్రుతి అనే యువతి ఒక ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె. ఆమె ప్రేమలో విఫలమై ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంది. ఆమెను రక్షించిన డాక్టర్ అరుణ్ ఆమెకు స్నేహితుడిగా మారి, ఆ తర్వాత ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటారు. సంతోషంగా సాగుతున్న వీళ్ళ జీవితంలో ఒక బ్లాక్‌మెయిలర్ ఎంట్రీ ఇస్తాడు. శ్రుతి సన్నిహిత ఫోటోలతో ఆమెను బెదిరిస్తాడు. ఈ బెదిరింపు వెనుక శ్రుతి మాజీ ప్రియుడు కిరణ్ ఉన్నాడని తెలుస్తుంది. అతను ఆమె జీవితాన్ని నాశనం చేయాలని చూస్తాడు. ఈ రహస్యం శ్రుతిని మానసికంగా కుంగదీస్తుంది.


మరోవైపు శ్రుతి మారిన ప్రవర్తనను గమనించిన అరుణ్, బ్లాక్‌మెయిల్ గురించి తెలుసుకుంటాడు. అతన్ని కనిపెట్టి సమస్యను ముగించాలనుకుంటాడు. కోపంతో కిరణ్‌ను అతని ఇంటిలోనే చంపేస్తాడు. ఈ హత్య తర్వాత అరుణ్ ఆధారాలను నాశనం చేయడానికి తెలివిగా ప్రయత్నిస్తాడు. కానీ పోలీసులు కేసును ఛేదించడానికి దగ్గరవుతారు. కథలో సస్పెన్స్ పెరుగుతుంది. అరుణ్ చర్యలు, శ్రుతి భయాలు ఒక ఉత్కంఠభరితమైన డ్రామాగా మారతాయి. పోలీసులు కిరణ్ హత్య కేసును దర్యాప్తు చేస్తూ, అరుణ్, శ్రుతిని చుట్టుముడతారు. అరుణ్ తన హత్య ఆధారాలను దాచడానికి చేసే ప్రయత్నాలు కథను ఒక రేస్‌లా మారుస్తాయి. క్లైమాక్స్‌లో ఒక షాకింగ్ ట్విస్ట్‌తో కథ ముగుస్తుంది. ఈ ట్విస్ట్ ఏమిటి ? కిరణ్ ను పోలీసులు అరెస్ట్ చేస్తారా ? శ్రుతి గత లవ్ స్టోరీ ఎలా బ్రేక్ అయింది ? అనే విషయాలను ఈ సినిమాని చూసి తెలుసుకోండి.

Read Also : 40 ఏళ్ల క్రితం మిస్సైన అమ్మాయి కోసం వేట… టాటూతో ఊహించని ట్విస్ట్… పిచ్చెక్కించే సస్పెన్స్ థ్రిల్లర్

Related News

The Great Pre Wedding Show OTT : చిన్న సినిమాగా వచ్చి చితగ్గొడుతున్న ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’… క్రేజీ ఓటీటీ డీల్

OTT Movie : 20 ఏళ్ల అబ్బాయితో 40 ఏళ్ల ఆంటీ… పాటలతో వలపు వల… ఆ సీన్లైతే అరాచకం భయ్యా

OTT Movies : ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ సినిమాలు.. ఆ నాల్గింటిని మిస్ అవ్వకండి..

OTT Movie : పూలమ్మే పిల్ల జీవితంలోకి మాజీ ప్రియుడు… ఖతర్నాక్ క్లైమాక్స్ మావా

OTT Movie : కుర్రాడి నుంచి పండు ముసలిదాకా ఎవ్వర్నీ వదలని అమ్మాయి… ఇదెక్కడి తేడా యవ్వారంరా సామీ ?

OTT Movie : ప్రియుడిని వదిలేసి మరొకడితో… కళ్ళు తెరిచినా మూసినా అవే సీన్లు… క్లైమాక్స్ కెవ్వు కేక

OTT Movie : చేతబడులతో చచ్చి బతికే కుటుంబం… ‘విరూపాక్ష’ను మించిన బ్లాక్ మ్యాజిక్ మరాఠీ మూవీ తెలుగులో

OTT Movie : తాత వల్ల నలిగిపోయే కూతురు, మనవడు… గుండెను పిండేసే రాశి ఫ్యామిలీ ఎంటర్టైనర్

Big Stories

×