BigTV English

OTT Movie : ఎవరి జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం అంటూ…. హీరోకి ట్విస్ట్ ఇచ్చే బాటసారి

OTT Movie : ఎవరి జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం అంటూ…. హీరోకి ట్విస్ట్ ఇచ్చే బాటసారి

OTT Movie : డిజిటల్ మీడియా ఈరోజుల్లో ఎంతగా పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఎంటర్టైన్మెంట్ కోసం స్మార్ట్ ఫోన్ లో కూడా సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు మూవీ లవర్స్. ఎన్నో సినిమాలు ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే వాటిలో కొన్ని మాత్రమే మెసేజ్ ఇచ్చే మూవీలు ఉంటున్నాయి. జీవితంలో కొన్ని మూవీస్ ఎందుకు మిస్ అవ్వకూడదు అనేది స్టోరీ లోకి వెళితే మీకే తెలుస్తుంది. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియో

ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ పేరు ‘టేస్ట్ ఆఫ్ చెర్రీ‘ (Taste of cherry). ఈ మూవీలో హీరో ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. హీరో ఆత్మహత్య చేసుకున్న తర్వాత, దహన సంస్కారాలు చేయడానికి ఎవరినైనా హెల్ప్ అడుగుతూ ఉంటాడు. అతనిని వెతికే క్రమంలో మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీ లోకి వెళితే

హీరో తన కారులో ప్రయాణిస్తూ డబ్బులు ఎక్కువగా అవసరం ఎవరికి ఉన్నాయో, వాళ్లలో ఒకరిని తనతోపాటు తీసుకువెళ్లాలనుకుంటాడు. ఇందులో భాగంగా కొంతమందిని అడుగుతూ ఉంటాడు. ఒక గంట నాతోపాటు వస్తే ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇస్తానని చెప్తాడు. ఇతని ధోరణికి కొంతమంది కోప్పడుతూ ఉంటారు. ఆ తర్వాత ఒక అబ్బాయి నడుచుకుంటూ వెళ్తుండగా, డ్రాప్ చేస్తానని అతన్ని తన కారులో ఎక్కించుకుంటాడు. అతనితో మాట్లాడుతూ నాకు ఒక సహాయం చేస్తే రెండు లక్షల రూపాయలు ఇస్తానని చెప్తాడు. ఒక గంట పని మాత్రమే ఉంటుందని ఆ పిల్లవాడికి చెప్తాడు. అతనికి డబ్బు అవసరం ఉండటంతో మౌనంగా ఉండిపోతాడు. హీరో కారుని ఒక కొండమీదికి తీసుకువెళ్తాడు. అప్పుడు ఆ కుర్రవాడితో నేను నిద్ర మాత్రలు మింగి చనిపోవాలనుకుంటున్నాను. ఒకవేళ చనిపోతే ఒక గొయ్యి తీసి నన్ను పాతిపెట్టు బ్రతికి ఉంటే హాస్పిటల్ కి తీసుకెళ్లమని చెప్తాడు. చనిపోతే కారులో ఉన్న రెండు లక్షల రూపాయలు తీసుకోమని చెప్తాడు. అందుకు ఆ కుర్రవాడు నేను ఇలాంటి పని చేయనని అతనితో చెప్పి వెళ్ళిపోతాడు. మరొకరి కోసం వెతుకుతూ ఉండగా ఒక మత ప్రబోధకుడు ఇతనికి పరిచయం అవుతాడు. అతనితో కూడా ఆ కుర్రవాడితో చెప్పినట్టు చెప్తాడు. ఆత్మహత్య పాపమంటూ   అతడు కూడా వెళ్ళిపోతాడు. చివరికి ఒక వ్యక్తి అతని కారు ఎక్కుతాడు. అతనితో కూడా హీరో వాళ్ళకు చెప్పినట్టే  చెప్తాడు. అందుకు అతను మీకున్న ప్రాబ్లమ్స్ ఎవరితోనైనా పంచుకుంటే, మీరు ఆత్మహత్య చేసుకునే  చర్యను విరమించుకోవచ్చు అంటూ చెప్తాడు.

హీరో అతనితో మన వల్ల ఎవరికి ప్రయోజనం లేనప్పుడు, మనకు మనమే భారంగా ఉన్నప్పుడు, బతకడం అనవసరం అంటూ అతనితో చెప్పుకుంటాడు. అయితే అందుకు ఆ వ్యక్తి ఒకసారి నేను కూడా ఆత్మహత్య చేసుకోవాలని ఒక చెట్టు ఎక్కాను. ఆ చెట్టు కిందకి కొంతమంది పిల్లలు వచ్చి చెట్టుకు ఉన్న కాయలు కోసి ఇవ్వమని అడిగారు. ఆ తర్వాత ఆ పిల్లలు మీరు కూడా కొన్ని కాయలను ఇంటికి తీసుకువెళ్లండి అని చెప్పారు. నా భార్య ఈ కాయలను  తింటుందని వాటిని తీసుకొని నా భార్యకు ఇచ్చాను. అప్పుడు నా భార్య నా విషయంలో ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించమని అడిగింది. అప్పటినుంచి నా భార్య నన్ను ఒక్క మాట కూడా అనలేదు. ఎవరి జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం అంటూ తన స్టోరీని అతనికి చెప్తాడు. నేను నీకు సహాయం చేస్తాను, అయితే రేపు పొద్దున్నే నువ్వు బ్రతికి ఉంటావు, ఇద్దరం కలిసి కాఫీ తాగుతాం అంటూ ఆ వ్యక్తి వెళ్లిపోతాడు. చివరికి హీరో ఆత్మహత్య చేసుకుంటాడా? ఆ వ్యక్తి హీరోని కాపాడుతాడా? హీరోకి ఉన్న ప్రాబ్లంస్ ఏంటి? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఓటిటి ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ మీడియాలో స్టీమింగ్ అవుతున్న ఈ మూవీ ని తప్పకుండా చూడండి.

Related News

OTT Movie : భర్తే భార్యను వేరొకడితో … కుంభకోణాల ట్విస్ట్‌ లు, సీట్ ఎడ్జ్‌ థ్రిల్లర్ లు … ఒక్కసారి చూశారంటే

OTT Movie : డ్రగ్ ట్రాఫికింగ్ చుట్టూ తిరిగే బెంగాలీ సిరీస్ … తల్లీకూతుర్లదే అసలు స్టోరీ … IMDBలో కూడా మంచి రేటింగ్

OTT Movie : ఆటకోసం అబ్బాయిగా మారే అమ్మాయి … ట్రయాంగిల్ లవ్ స్టోరీతో అదిరిపోయే థ్రిల్లింగ్

OTT Movie : అడవిలో ఒంటరి అమ్మాయి … రాత్రీపగలూ అతడితోనే … క్లైమాక్స్ వరకూ రచ్చే

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి…

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

Big Stories

×