BigTV English

Allu Arjun : అల్లు అర్జున్ ఫస్ట్ మూవీకి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

Allu Arjun : అల్లు అర్జున్ ఫస్ట్ మూవీకి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

Allu Arjun : టాలీవుడ్ స్టార్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇది ఒకప్పటిమాట.. పుష్ప మూవీతో నేషనల్ వైడ్ టాక్ ను అందుకొని ఐకాన్ స్టార్ అయ్యాడు. ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈయనకు క్రేజ్ ఏర్పడింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా పుష్ప 2 మూవీ కూడా విడుదల అయింది. 1000 కోట్ల టార్గెట్ తో థియేటర్లలోకి వచ్చేసిన ఈ మూవీ ప్రస్తుతం రికార్డుల మోత మోగిస్తుంది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. మూడు రోజుల్లో దాదాపు 500 కోట్లు రాబట్టి సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది. కోట్లు రాబడుతున్న సినిమాలను చేస్తున్న బన్నీ మొదటి రెమ్యూనరేషన్ ఎంత అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అసలు బన్నీ మొదటి సంపాదన ఎంత అని ఫ్యాన్స్ తెలుసుకొనేందుకు గుగూల్ లో తెగ వెతికేస్తున్నారు. ఇక ఆలస్యం ఎందుకు ఏ సినిమాకు ఎంత తీసుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..


బన్నీ తన సినిమా కెరీర్ ఆరంభంలో ముందుగా డాడీ మూవీలో మెగాస్టార్ తో నటించారు. ఒక సీన్‌లో అల్లు అర్జున్ డ్యాన్స్ బాగా చేస్తే చిరంజీవి అభినందిస్తారు. అదే కాదు చిరంజీవి నటించిన పలు సినిమాల్లో కనిపించాడు బన్నీ.. ఈయన హీరోగా చేసిన మొదటి సినిమా గంగోత్రి.. దర్శక దిగ్గజం కె. రాఘవేందర్ రావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అశ్వనీదత్ నిర్మించారు. అయితే ఈ మూవీ షూటింగ్‌కు ముందు బన్నీ ఒక రోజు మెగా స్టార్ ఇంట్లో నిర్వహించిన ఓ పార్టీ సందర్భంగా అద్భుతంగా డ్యాన్స్ చేశారట. ఆ సమయంలో రాఘవేంద్ర రావు అక్కడే ఉన్నారు. ఆ సందర్భంగా ఆయన బన్నీ డ్యాన్స్ చూసి ముగ్దడయ్యడు. దాంతో బన్నితో సినిమా చెయ్యాలని ఫిక్స్ అయ్యాడట. మొదటి సినిమాను ప్రకటించాడు.

ఇక బన్నీని గంగోత్రి సినిమాకు హీరోగా అనౌన్స్ చేస్తూ.. ఆయనకు రాఘవేంద్ర రావు రూ.100 రెమ్యునరేషన్ ఇచ్చారట . అలా మొదటి సినిమాకు బన్నీ వంద రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఆ తరువాత సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ప్రస్తుతం ఒక్క మూవీకి రూ.45 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. పుష్ప మొదటి పార్ట్‌కు ఈయన రూ.30 కోట్లు తీసుకున్నారని టాక్‌. ఇప్పుడు పుష్ప 2 కు ఈయన రూ.300 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి బన్నీ ఇప్పుడు పాన్ ఇండియా హీరో అయ్యాడు. ఇక తర్వాత సినిమాకు రెమ్యూనరేషన్ పెంచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇక ముందు బన్నీతో సినిమా అంటే కోట్లు రెడీ చేసుకోవాలని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తన తదుపరి మూవీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయబోతున్నాడు. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే బ్లాక్ బాస్టర్ సినిమాలు ఉన్నాయి. రాబోతున్న సినిమా పై కూడా భారీగానే అంచనాలు ఉన్నాయి. త్వరలోనే ఆ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరగనుంది..


Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×