OTT Movie : హర్రర్ సినిమాలు చూస్తున్నప్పుడు వచ్చే ఫీలింగ్స్ మాటల్లో చెప్పలేం. ఈ సినిమాలలో అప్పుడప్పుడు వచ్చే భయంకరమైన సీన్స్ వెన్నులో వణుకు పుట్టిస్తాయి. అటువంటి సీన్స్ తో వచ్చిన ఒక కొరియన్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.
ఆపిల్ టీవీ (Apple TV)
ఈ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘కిల్లర్ టూన్‘ (Killer Toon). ఈ మూవీలో హీరోయిన్ కార్టూన్ బొమ్మలు వేస్తూ ఉంటుంది. ఆమె కామిక్ బొమ్మలు ఎవరికైతే పంపుతుందో వాళ్లు చనిపోతూ ఉంటారు. ఈ హారర్ థ్రిల్లర్ మూవీ ఆపిల్ టీవీ (Apple TV) లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీకి కిమ్ యోంగ్-గ్యున్ దర్శకత్వం వహించారు. 2013 లో వచ్చిన ఈ దక్షిణ కొరియన్ సైకలాజికల్ హర్రర్ మూవీలో లీసి యంగ్, ఉమ్ కి జూన్ నటించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా మంచి కలెక్షన్స్ సాధించింది.
స్టోరీ లోకి వెళితే
హీరోయిన్ కామిక్స్ బొమ్మలు వేస్తూ ఉంటుంది. ఆమె వేసే బొమ్మలతో కొంతమంది ప్రాణాలు పోతూ ఉంటాయి. ఆమె ఎలా బొమ్మలు చేస్తుందో అలానే ఆ వ్యక్తులు చనిపోతూ ఉంటారు. ఒకసారి పబ్లిష్ చేయడానికి ఒక కామిక్ స్టోరీ రెడీ చేసి పబ్లిషర్ కి పంపిస్తుంది. అయితే ఆ స్టోరీలో పబ్లిషర్ ఫ్యామిలీలో కొన్ని విషయాలు జరుగుతాయి. ఆ వెంటనే అందులో ఉన్నట్టు ఆ పబ్లిషర్ చనిపోతుంది. ఈ కేసును డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు. ఎంతలా చూసినా ఆమె ఆత్మహత్య చేసుకుందని అందరూ అనుకుంటారు. ఆ కామిక్ బొమ్మలు చూసి వాళ్లకు అనుమానం వస్తుంది. ఎందుకంటే ఆ బొమ్మలు ఎలా ఉంటాయో, ఆ వ్యక్తులు కూడా అలానే చనిపోయి ఉంటారు. మరోవైపు శవాలను ఎత్తుకెళ్లే వ్యక్తి కూడా ఇలానే చనిపోతాడు. డిటెక్టివ్ కి అనుమానం వచ్చి హీరోయిన్ ను ఇంటరాగేట్ చేస్తాడు. ఆమెకు ఎవరో వ్యక్తి ఇవన్నీ పంపిస్తున్నాడని, తనకు అసలు ఆ బొమ్మలు వేయడం రాదని చెప్తుంది.
మెయిల్ ద్వారా వచ్చే ఆ బొమ్మలు ఎక్కడి నుంచి వస్తున్నాయో కనుక్కోవాలని డిటెక్టివ్ బయలుదేరుతాడు. అయితే అక్కడ కొంతకాలం క్రితం మిస్ అయిన ఒక అమ్మాయి ఇల్లు ఉంటుంది. ఆ అమ్మాయి కొంత కాలం క్రితం చనిపోయి ఉంటుంది. హీరోయిన్ ఆ అమ్మాయితో కొద్ది రోజులు కలిసి ఉంటుంది. ఆ బొమ్మలు ఇదివరకు ఆ అమ్మాయి వేసి ఉంటుంది. ఆ అమ్మాయికి దయ్యాలు స్టోరీ చెప్పడంతో వాటిని వేస్తూ ఉండేది. వీటిని హీరోయిన్ పబ్లిష్ చేయడానికి ట్రై చేయగా వాటిని ఆ అమ్మాయి కాల్చి వేస్తుంది. హీరోయిన్ కూడా ఆ బొమ్మలను నేర్చుకుని ఉంటుంది. ఆ తర్వాత ఆ అమ్మాయి మిస్ అయిపోతుంది. చివరికి ఆ బొమ్మలు వేస్తున్నది ఎవరు? ఆ అమ్మాయి ఎలా మిస్ అయింది? డిటెక్టివ్ వెలుగులోకి తెచ్చే విషయాలు ఏమిటి? వీటి గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ హారర్ థ్రిల్లర్ మూవీని చూడాల్సిందే.