OTT Movie : యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీస్ అంటే చెవి కోసుకునే అభిమానులు చాలా మంది ఉంటారు. ఈ సినిమాలు యూత్ ని బాగా ఎంటర్టైన్ చేస్తాయి. రొమాంటిక్ ఎంటర్టైనర్ తో పాటు హర్రర్ ని జోడిస్తే ఆ మూవీ ఎలా ఉంటుందో ఆలోచించండి. హర్రర్ ని మిక్స్ చేసిన ఒక రొమాంటిక్ మూవీ ఓటిటిలో స్ట్రిమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రిమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ మీడియా
ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ పేరు “ది డెడ్ వాంట్ ఉమెన్” (The Dead Want Women). ఈ మూవీలో రోసి సినిమాలు చేస్తూ మంచినీటిగా గుర్తింపు పొందాలనుకుంటుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలు ఊహకు అందని విధంగా ఉంటాయి. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ మీడియా (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
రోసి సినిమాలలో హీరోయిన్ గా చేస్తూ ఉంటుంది. ఒకరోజు రోసి తన ఇంట్లో ప్రముఖులకు మందు పార్టీ ఇస్తుంది. ఆ పార్టీకి చాలామంది అతిధులు వస్తారు. అయితే ఆరోజు హీరోయిన్ దగ్గరికి ప్రొడ్యూసర్ గా చేసే వ్యక్తి, మరో ఇద్దరు మాట్లాడాలని వస్తారు. ఆ ఇంటి నుంచి ఒక సొరంగ మార్గం ఉంటుంది. ఆ సొరంగ మార్గం ద్వారా ఒక చిన్న ఇంట్లో అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తూ ఉంటారు కొంతమంది ప్రముఖులు. డబ్బున్న కొంతమంది వ్యక్తులు ఏకాంతంగా గడపడానికి అక్కడికి అమ్మాయిలను తెచ్చుకుంటారు. వారితో హీరోయిన్ కూడా పార్టిసిపేట్ చేస్తుంది. ఆరోజు వాళ్ళంతా కలిసి ఎంజాయ్ చేస్తూ ఉండగా, మధ్యలో ఒక వ్యక్తి ఒక అమ్మాయి గొంతు కోసి చంపేస్తాడు. ఇది చూసి రోసి షాక్ అవుతుంది. ఇంతలో అక్కడికి రోసి మేనేజర్ వస్తాడు. అతనిని కూడా చంపడానికి ఆ వ్యక్తి గన్ తీస్తాడు. అయితే రోసి అడ్డుపడి అతడిని చంపొద్దని బతిమాలుతుంది. అలా అంటుండగానే ఆ వ్యక్తి ఏ ఫీలింగ్స్ లేకుండా రోసిపై బలవంతం చేయబోతూ ఉంటాడు. అతని మీద కోపంతో ఆ గన్ తీసుకొని అక్కడ ఉన్న వాళ్ళందరిని రోసి చంపేసి తను కూడా గొంతు కోసుకొని చచ్చిపోతుంది.
ఈ స్టోరీ అంతా ఫ్లాష్ బ్యాక్ లో జరిగి ఉంటుంది. ప్రజెంట్ స్టోరీలో ఆ ఇంటిని ఇద్దరు అమ్మాయిలు కొంటారు. వాళ్లకు ఆ ఇల్లు బాగా నచ్చుతుంది. రాత్రి అవడంతో ఆ ఇంట్లో ఆత్మల రూపంలో చనిపోయిన వ్యక్తులు తిరుగుతూ ఉంటారు. ఆ అమ్మాయిని ఆత్మలు ఏకాంతంగా గడపమని రెచ్చగొడుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఆ ఆత్మలు వాళ్లతో ఏకాంతంగా గడుపుతాయా? ఆత్మల వల్ల ఈ అమ్మాయిలు ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? చివరికి వీళ్లు ఆ ఇంట్లో నుంచి బయట పడగలిగారా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ హారర్ మూవీ ని తప్పకుండా చూడండి. ఫ్యామిలీతో చూసే విధంగా ఈ మూవీ ఉండదు. ఒంటరిగానే ఈ మూవీ చూసి ఎంజాయ్ చేయండి.