BigTV English

Bigg Boss 8 Telugu : అసలు నిఖిల్ కు ఏమైంది?.. ఇంత మార్పేంటి..? కన్నీళ్లు పెట్టించిన లవ్ స్టోరీ..

Bigg Boss 8 Telugu : అసలు నిఖిల్ కు ఏమైంది?.. ఇంత మార్పేంటి..? కన్నీళ్లు పెట్టించిన లవ్ స్టోరీ..

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 కథ కంచికి చేరినట్లు తెలుస్తుంది. హౌస్ లో 10 వారాలు ప్రేక్షకులను వింత టాస్క్ లతో అలరించింది. 11 వారాలు అంటే ఈ సీజన్ ఇక పూర్తి అయినట్లు లెక్క.. మిగిలిన నాలుగు వారాలు హౌస్ లో ఏదో పేరుకే ఆటలు ఆడిస్తారు. ఇక హౌస్ లో ఎవరు స్ట్రాంగ్ అని తెలుసుకోవాలని మిగిలిన వారిని ఎలా ఎలిమినేట్ చేస్తారన్నది ఆసక్తిగా మారింది. ఈ వారం హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారు అనేది ఈరోజు ఎపిసోడ్ లో తెలియనుంది.. ఇక శనివారం ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..


ప్రతి వారం వీకెండ్ వస్తే ఇక బిగ్ బాస్ ఆడియన్స్ కు పండగే.. శని, ఆదివారం నాగార్జున చేసే సందడి కోసం ప్రేక్షకులకు బిగ్ బాస్ ను వీక్షిస్తారు.అందులో హౌస్‌మేట్స్ అందరూ తమ ఫస్ట్ లవ్ గురించి చెప్పుకొచ్చారు. ఒక్కొక్కరూ తమ స్టోరీ గురించి తమ మాటల్లో చెప్పారు. అయితే నిఖిల్ స్టోరీ మాత్రం విన్నవాళ్లందరికీ కన్నీళ్లు తెప్పించేసింది. అసలు అక్కడున్న హౌస్‌మేట్స్ కూడా నిఖిల్ లవర్ మళ్లీ తన దగ్గరికి రావాలంటూ కోరుకున్నారు.. నిఖిల్ చెప్పిన మాటలు ప్రేక్షకులను సైతం కన్నీళ్లు పెట్టుకొనేలా చేసింది.

నిఖిల్ మాట్లాడుతూ.. హౌస్ లో తనకు అన్ని తానే.. నాకు ఫస్ట్, సెకండ్, థర్డ్ లవ్ అన్నీ మర్చిపోయేలా చేసిన లవ్ దొరికింది. తనకి కళ్లు ఒకటి మైనస్ 7, మరొకటి మైనస్ 6 ఉండేది అప్పుడు.. లైట్ కలర్ టాప్, బ్లాక్ కలర్ ప్యాంట్, స్పెట్స్, పోనీ టైల్ వేసుకుంది ఫస్ట్ టైమ్.. లైట్‌గా చెప్తా.. ఈ నవంబర్ 22కి తనతో లవ్ ఆరేళ్లు అవుతుంది.. విడిపోయారా విడిపోలేదా అని నన్ను అడిగితే నేను నా ఎమోషన్ నా బాండ్‌తో విడిపోలేను. నా జీవితానికి ఇక అన్ని తానే.. మా అమ్మతో సమానం.. ఇద్దరు అమ్మలున్నారు అని నిఖిల్ ఎమోషనల్ అవుతాడు.


మధ్య అవినాష్ మాట్లాడుతూ.. అమ్మతో సమానం అన్నావుగా మరి ఎందుకు ఇన్ని రోజులు దూరం పెట్టావు అని అడుగుతాడు. దానికి నేను ఇప్పుడు కూడా వదిలే లేదు.. ఈ షో తర్వాత నా ప్రయత్నం నేను చేస్తా.. నేను ఖచ్చితంగా వస్తా నాకు తెలుసు నువ్వు మళ్లా కోపపడతావు.. మళ్లా ఏదో ఏడుస్తావ్.. మాళ్లా నేను వెళ్తా మళ్లా వస్తా అలా ఎంతవరకూ జరిగితే అంత జరగని.. కోపపడితే పడు.. తిడితే తిట్టు.. కొట్టించుకోవడం కూడా జరిగింది.. కొట్టించుకుంటా ఇంకా.. ఒక్కటైతే పిచ్చి లేస్తే లేపుకెళ్తా.. ఐయామ్ సో సారీ.. నేను వస్తా.. అని కావ్య పై తనకున్న ప్రేమను బయటపెడతాడు. ఇక యష్మీ కూడా ఎమోషనల్ అవుతుంది. ఇక అతని స్టోరీ విన్న ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఎపిసోడ్ కు ఇదే హైలెట్.. ఇక ఇదంతా బిగ్ బాస్ ప్లాన్ లాగే ఉంది. ఫైనల్ ఎపిసోడ్ అప్పుడు కావ్య రాబోతుందని నాగార్జున హింట్ ఇచ్చేసాడు.. ఇక రేపటి ఎపిసోడ్ లో ఎవరు సందడి చేస్తారో చూడాలి..

Tags

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×