OTT Movie : హాలీవుడ్ రొమాంటిక్ సినిమాలు చూడటానికి క్రేజీగా ఉంటాయి. ఈ సినిమాలను మూవీ లవర్స్ ఎక్కువగా ఇష్టపడతారు. అందులోనూ వార్, లవ్ స్టోరీల కాన్సెప్ట్ తో వచ్చే సినిమాలు ఒక రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తాయి. అటువంటి స్టోరీతో ఒక మూవీ థియేటర్లలో ఘన విజయం సాధించి, ప్రస్తుతం ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం.
అమెజాన్ ప్రైమ్ వీడియో
ఈ హాలీవుడ్ రొమాంటిక్ మూవీ పేరు ‘ది ఎక్సెంప్షన్‘ (The Exception). ఈ మూవీకి డేవిడ్ లెవెక్స్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జరుగుతుంది. హిట్లర్ ని గద్దె దింపే ప్రయత్నంలో బ్రిటన్ ఒక సీక్రెట్ ఏజెంట్ ను నియమిస్తుంది. ఆ ఏజెంట్ చుట్టూ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ ఓటిటి ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
జర్మన్ అధినేత అయిన విలియమ్స్ వల్ల ఆ దేశం ఆర్థికంగా బాగా వెనుకబడిపోతుంది. ఈ విషయం అతని ఒక్కడి మీదే నింద వేసి అతనిని అధ్యక్షుని పదవి నుండి దింపుతారు. ఆ తర్వాత కొంతకాలానికి హిట్లర్ జర్మనీని పరిపాలిస్తాడు. విలియమ్స్ జర్మనీని వదిలి నెదర్లాండ్స్ కి వెళ్ళిపోతాడు. బ్రిటన్ జర్మనీని ఓడించడానికి శతవిధాల ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే బ్రిటన్ ఒక ఏజెంట్ని నెదర్లాండ్స్ లో నిఘా పెట్టిందని, జర్మన్ తెలుసుకుంటుంది. ఆ విషయం మీద స్టీఫెన్ అనే ఒక గూఢచారిని అక్కడికి పంపిస్తుంది. స్టీఫెన్ యుద్ధ సైనికుడిగా ఉండేవాడు. అక్కడ జరుగుతున్న మరణకాండను చూసి జీవితం మీద విరక్తి చెందుతాడు. తనకు ఎవరూ లేకపోవడంతో, స్టీఫెన్ బతకడానికి ఒక కారణం కూడా దొరకదు. యుద్ధంలోనే చనిపోవాలని ఆఫీసర్స్ కి చెప్తాడు. అయితే అతని శరీరం యుద్ధంలో డ్యామేజ్ అయి ఉంటుంది. మునుపుటి కంటే స్టీఫెన్ అంత స్ట్రాంగ్ గా ఉండడు. అయితే ఇతనిని సైనికుడిగా కాకుండా, గూఢచారిగా నెదర్లాండ్ కి పంపిస్తారు. అక్కడికి వెళ్లిన స్టీఫెన్ విలియమ్స్ ని కలవడానికి ప్రయత్నిస్తాడు.
డోర్ కొట్టగా అక్కడ ఒక మెకా అనే అమ్మాయి తలుపు తీస్తుంది. ఆమె చాలా అందంగా ఉంటుంది. విలియమ్స్ ప్యాలెస్ లో మెకా పనిమనిషిగా ఉంటుంది. లవ్ ఇస్ ఫస్ట్ సైట్ అయిపోతుంది స్టీఫెన్ కి. విలియమ్స్ తో మాట్లాడిన తర్వాత ఆమెను అదే పనిగా చూస్తూ ఉంటాడు. డైరెక్ట్ గానే డ్రెస్ తీసేయమని చెప్తాడు. ఆమె కూడా ఇతనికి పడిపోతుంది. ఇదే అవకాశం అనుకొని ఇద్దరూ ఏకాంతంగా గడుపుతారు. ఆమెతో గడిపిన క్షణాలు హీరో మర్చిపోలేక పోతాడు. ఇంతకీ రహస్యం ఏమిటంటే మెకా ఒక బ్రిటన్ సీక్రెట్ ఏజెంట్. చివరికి వీళ్ళిద్దరూ గూఢచారులని తెలుస్తుందా. సీక్రెట్ ఏజెంట్ అని తెలియడంతో ఒకరిని ఒకరు ఏమైనా చేసుకుంటారా? ప్రభుత్వం అప్పజెప్పిన మిషన్స్ వీరిలో ఎవరిది సక్సెస్ అవుతుంది? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ రొమాంటిక్ వార్ మూవీని చూడాల్సిందే.