BigTV English
Advertisement

Rashmika Mandanna : అడ్డంగా ఇరుక్కున్న రష్మీక మందన్న.. ఆ రోజు జరిగిన తప్పేనా..?

Rashmika Mandanna : అడ్డంగా ఇరుక్కున్న రష్మీక మందన్న.. ఆ రోజు జరిగిన తప్పేనా..?

Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న పేరు వినగానే ఈ మధ్య కుర్రాళ్లకు ఫీలింగ్స్ వస్తున్నాయని చెబుతున్నారు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ స్టేటస్ ను అందుకుంది. ఈ మధ్య ఈ అమ్మడు నటిస్తున్న ప్రతి సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంటుంది. దాంతో అమ్మడు క్రేజ్ బాగా పెరిగిపోయింది. గత ఏడాది వచ్చిన యానిమల్ మూవీతో అక్కడ వరుస ఆఫర్స్ వస్తున్నాయి. రష్మిక ఉంటే కలెక్షన్ల వర్షం గ్యారెంటీ అంటూ లక్కీ హ్యాండ్ అనిపించుకుంటున్నారు. అందాల ఆరబోతే కాదు.. నటనలోనూ తనకు తిరుగులేదని నిరూపించారు. తద్వారా ఇప్పుడు బాలీవుడ్ భామలను మించిన క్రేజ్‌తో ఇండియాలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా నిలిచారు రష్మిక మందన్న.. అయితే తాజాగా రష్మిక పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి లాగా మారింది. ఆమె చేసిన ఆ తప్పే ఇప్పుడు ట్రోల్స్ వేయించుకుంటుంది.. అసలేం జరిగింది..?


రష్మిక మందన్న రీసెంట్ గా పుష్ప 2 మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది. కాని ప్రస్తుతం విమర్శలు కూడా అందుకుంది. అందుకు కారణం పుష్ప 2 ప్రీమియర్ షో లో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందడం.. డిసెంబర్ 4 న ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర గల సంధ్య థియేటర్ లో ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వకపోయినా అల్లు అర్జున్, రష్మిక మందన్న అక్కడకు రావడమే కారణం.. థియేటర్ లోపల సెక్యూరిటీ తక్కువ ఉంది మీరు సడెన్ గా వస్తే చూడటానికి జనం ఎగబడ్డారు. దాంతో అక్కడ తొక్కిసలాట జరిగి ఒక నిండు ప్రాణం పోయింది. దీనికి కారణం హీరో ఎంట్రీ అని పోలీసులు కూడా చెబుతున్నారు.. దానిపై ఇప్పటికే పోలీసులు vs అల్లు అర్జున్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే..

అయితే ఇందులో అల్లు అర్జున్ మాత్రమే కాదు రష్మిక మందన్న కూడా ఇరుక్కుంది. ఆ రోజు అక్కడ రావొద్దని అన్నా ఈమె వెళ్ళింది. అలాగే అక్కడ ప్రాణం పోయింది అన్నా కూడా అక్కడ నుంచి బయటకు రాలేదు. అల్లు అర్జున్ చేసిన తప్పులో ఈమెకు భాగం ఉందని కొందరు విమర్శకులు అంటున్నారు. అల్లు అర్జున్ ను ఎలాగైతే టార్గెట్ చేశారు. ఈమెను కూడా అలానే చెయ్యాలి కదా అని కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.. ఈ వార్తలు నెట్టింట వైరల్ అవ్వడంతో ఆ వివాదం ఉచ్చు ఈమె మెడకు కూడా బిగించుకొనేలా కనిపిస్తుంది. పోలీసులు నెక్స్ట్ ఏం చేస్తారో అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ అమ్మడు సినిమాల విషయానికొస్తే.. పుష్ప 2లో హీరోనే డామినేట్ చేసే నటనతో ఆమె పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ప్రస్తుతం పాన్ ఇండియా ఫార్మాట్‌లో తెరకెక్కుతోన్న కుబేరతో పాటు హిందీలో చావా, సికిందర్, థమ, ది గర్ల్ ఫ్రెండ్ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో రష్మిక మందన్న నటిస్తున్నారు.. అలాగే పుష్ప 3 లో కూడా నటిస్తుంది.


Related News

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Big Stories

×