E-Paper
Advertisement

OTT Movie : ఇక్కడికి ట్రిప్ కి వెళ్తే తిరిగిరాని లోకాలకు వెళ్ళినట్టే… వెన్నులో వణుకు పుట్టించే సస్పెన్స్ థ్రిల్లర్ 

OTT Movie : ఇక్కడికి ట్రిప్ కి వెళ్తే తిరిగిరాని లోకాలకు వెళ్ళినట్టే… వెన్నులో వణుకు పుట్టించే సస్పెన్స్ థ్రిల్లర్ 
Advertisement

OTT Movie :  కొన్ని క్రేజీ సినిమాలు మన రియల్ లైఫ్ కి సింక్ అవ్వడమే కాదు ఊహించడానికే భయంకరంగా ఉంటాయి కూడా. అందులో ట్రిప్స్ కు వెళ్లి తిరిగిరాని లోకాలకి వెళ్తే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడానికి భయంకరంగా ఉంటుంది. అలా ఫ్యామిలీతో కలిసి సరదాగా ఎంజాయ్ చేద్దాం అని వెళ్ళిన ఒక ఫ్యామిలీకి పీడకల లాంటి ఒక భయంకరమైన సంఘటన ఎదురవుతుంది. మరి ఈ ఆసక్తికరమైన సినిమా ఏ ఓటీటీలో ఉంది? కథ ఏంటి? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

Advertisement

ఓ పెద్ద ఫ్యామిలీ అంతా కలిసి ట్రిప్ ప్లాన్ చేస్తారు. అందులో నెలల పిల్లోడి నుంచి ముసలి వాళ్ళ దాకా మొత్తం కుటుంబ సభ్యులు అంతా ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే దాదాపు నాలుగు తరాల ఫ్యామిలీ అన్న మాట. మొత్తంగా ఏడు మంది ఉంటారు. అందరూ కలిసి ఒక ఇల్లు లాంటి ఫెసిలిటీ ఉన్న కంటైనర్ ను కార్ కి యాడ్ చేసుకుని, అందులో అన్ని సౌకర్యాలు ఉండేలా చూసుకుంటారు. ఇక దీన్నే ట్రిప్ కోసం తీసుకెళ్తారు. ఆ ట్రిప్ లో భాగంగా ఓ ఏరియాలో పెట్రోల్ కొట్టించుకోవడానికి ఆగుతారు. కానీ అక్కడ ఒక్క పెట్రోల్ బంక్ తప్ప ఎవ్వరూ ఉండరు. ఇక సడన్ గా ఈ ఫ్యామిలీలో ఉండే రెండు కుక్కల్లో ఒక కుక్క మొరుగుతూ ఆ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న షాప్ లోకి పరిగెడుతుంది. దాన్ని పట్టుకోడానికి హీరోయిన్ అక్కడికి వెళుతుంది. లోపలికి వెళ్తే అంతా వింతగా కనిపిస్తుంది. అక్కడ ఓ హ్యాండ్ బ్యాగ్, అందులో బంగారం లాంటి నగలు విలువైన వస్తువులు కనిపిస్తాయి. ఏదో అనుమానాస్పదంగా అనిపిస్తుంది అని ఆలోచించే లోపే సడన్ గా  షాప్ ఓనర్ కనిపించి షాక్ ఇస్తాడు. ఒక్కసారిగా భయపడిపోయిన హీరోయిన్ అక్కడి నుంచి కుక్క కోసం వచ్చానంటూ దాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది.

అయితే ఆ షాప్ ఓనర్ బయటకు వచ్చి ఈ రోడ్డులో వెళ్తే రోడ్డు బాగోదు, కానీ దాదాపు రెండు గంటలు సేవ్ చేసుకోవచ్చు అని చెప్తాడు. దీంతో ఎడారి ప్రాంతంలోని ఓ దారిలో ప్రయాణం మొదలుపెడతారు. కానీ సడన్ గా టైర్ పంక్చర్ కావడంతో యాక్సిడెంట్ అవుతుంది. అందులో ఉన్న కుటుంబ సభ్యులు ఎవ్వరూ గాయపడరు. ఇక చేసేదేం లేక అక్కడే స్టే చేద్దామని నిర్ణయించుకుంటారు. ఫ్యామిలీలోని అబ్బాయిలు ఒక్కొక్కరు ఒక్కో దిశగా ఎవరినైనా హెల్ప్ అడుగుదామని వెళ్తారు. అందులో ఓ చిన్న పిల్లోడు తన కుక్క కోసం వెళ్లి ఎవరో దాడి చేయడంతో స్పృహ తప్పి పడిపోతాడు. మరోవైపు ఈ ఫ్యామిలీ అంతా స్టే చేయడానికి ట్రై చేస్తున్న టైంలోనే కొంతమంది వింత మనుషులు అక్కడికి వస్తారు. చిన్నపిల్లాడ్ని ఎత్తుకెళ్లడమే కాకుండా అక్కడ ఉన్న అమ్మాయిపై అఘాయిత్యం చేస్తారు. ఈ నేపథ్యంలోనే ఆ నెలల పిల్లాడి తల్లి, ముసలావిడ వాళ్లను కాపాడే క్రమంలో ప్రాణాలు కోల్పోతారు. మరోవైపు ముసలాడిని చెట్టుకు కట్టేసి బ్రతికుండగానే కాల్చేస్తారు. దీంతో ఆ ఫ్యామిలీలో ముగ్గురు మాత్రమే మిగులుతారు. ఇక ఆ చిన్న బాబు తండ్రి తన కొడుకుని తెచ్చుకోవడానికి అక్కడి నుంచి ప్రమాదకరమైన ప్రాంతానికి వెళ్తాడు. మరి అతను తన బాబుతో తిరిగి వచ్చాడా? ఇద్దరు టీనేజర్స్ ఆ భయంకరమైన వ్యక్తుల నుంచి ఎలా తప్పించుకున్నారు? అనే విషయాలు తెలియాలంటే హాట్ స్టార్ లో అందుబాటులో ఉన్న ‘ది హిల్స్ హావ్ ఐస్‘ అనే సినిమాలో చూడాల్సిందే.

Related News

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

Big Stories

Advertisement
×