E-Paper
Advertisement

OTT Movie : కన్న కూతురినే వేధించే తండ్రి… బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఆమె వేసిన ప్లాన్ తెలిస్తే బుర్ర కరాబ్

OTT Movie : కన్న కూతురినే వేధించే తండ్రి… బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఆమె వేసిన ప్లాన్ తెలిస్తే బుర్ర కరాబ్

OTT Movie : కొన్ని సినిమాలను థియేటర్లలో చూసినప్పుడు ఎందుకు వచ్చాం రా దేవుడా ఈ సినిమాకు ? అనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ అదే సినిమా ఓటిటిలో వస్తే మాత్రం ఒక్కసారైనా హ్యాపీగా చూసేయగలుగుతారు.  అలాగే కొన్ని సినిమాలు డిజిటల్ గా రిలీజ్ అయ్యాక థియేటర్ల లాగా డిజాస్టర్ రెస్పాన్స్ కాకుండా కాస్త డిఫరెంట్ రెస్పాన్స్ వస్తుంది. అందుకే బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన సినిమాలు అట్లీస్ట్ డిజిటల్ గా స్ట్రీమింగ్ అయినప్పుడు అయినా మంచి రెస్పాన్స్ వస్తుందేమో అని కొంతమంది మేకర్స్ ఎదురు చూస్తారు. కానీ మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న మూవీకి మాత్రం థియేటర్లలోనే కాదు డిజిటల్ స్ట్రీమింగ్ విషయంలో కూడా గట్టి దెబ్బ తగిలింది. దీంతో మేకర్స్ ఏకంగా ఈ సినిమాను ఫ్రీగా స్ట్రీమింగ్ చేయడానికి రెడీ అయ్యారు. మరి ఆ మూవీ ఏంటి? ఏ ఓటీటీలో ఉంది? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

ఈ బో*ల్డ్ మూవీ ఫ్రీ స్ట్రీమింగ్…

ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న బాలీవుడ్ సినిమా 45 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కగా, ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ కిడ్ అర్జున్ కపూర్ హీరోగా నటించాడు. భూమి ఫెడ్నేకర్  హీరోయిన్ గా కనిపించింది. నవంబర్లో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా టాక్ తెచ్చుకొని దారుణమైన కలెక్షన్లను రాబట్టింది. దీంతో ఈ మూవీకి డిజిటల్ స్ట్రీమింగ్ విషయంలో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. నిజానికి ఈ మూవీ రైట్స్ డీల్ ముందుగానే నెట్ ఫ్లిక్స్ తో కుదిరింది. కానీ సినిమా డిజాస్టర్ కావడంతో ఈ మూవీని నెట్ ఫ్లిక్స్ పక్కన పెట్టేసింది. అటు ఈ సినిమాను ఏ ఓటీటీ కొనకపోవడం, ఇటువైపు ఏమో ముందుగా మూవీని కొనడానికి సిద్ధమైన నెట్ ఫ్లిక్స్  పట్టించుకోకపోవడంతో సినిమాను ఏం చేయాలో తెలియక డైరెక్టర్ డైరెక్ట్ గా యూట్యూబ్లో ఫ్రీగా రిలీజ్ చేసి పారేశారు. ఇంకేముంది ఇప్పుడు ఈ మూవీని ఫ్రీగా చూడొచ్చు. అయితే మూవీలో స్టోరీ బాగానే ఉన్నప్పటికీ ఎందుకు ఇంత దారుణమైన రెస్పాన్స్ దక్కించుకుందో తెలుసుకోవడానికి అయినా ఈ మూవీని ఒకసారి చూసేయండి.

కథలోకి వెళ్తే…

ఈ సినిమా పేరు ‘ది లేడీ కిల్లర్’. టైటిల్ కు తగ్గట్టుగానే ఇందులో హీరోయిన్ హీరో సపోర్ట్ తో హత్యలు చేస్తూ ఉంటుంది. హీరో నైనిటాల్లో ఉన్న ఒక కెమిస్ట్ షాప్ ను నడుపుతాడు. అయితే డయాగ్నొస్టిక్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని కలలు కంటారు. కానీ డిఫాల్టర్ అనే కారణంతో అతనికి ఏ బ్యాంకు లోన్ ఇవ్వదు. ఇదిలా ఉంటే హీరో మరో పెళ్లయిన అమ్మాయితో ఎఫైర్ పెట్టుకుంటాడు. ఈ నేపథ్యంలోనే ఓ రోజు ఫ్రెండ్ ఇచ్చిన సలహా మేరకు విక్రమ్ అనే వ్యక్తిని తన బిజినెస్ కోసం కలవడానికి వెళ్తాడు. అక్కడ అతని కూతురైన హీరోయిన్ ని చూసి ఇష్టపడతాడు. కానీ ఆ వ్యక్తి కూతురినే వేధిస్తున్నాడు అనే విషయం తెలుసుకొని కోపంతో రగిలిపోతాడు. ఇక హీరోయిన్ ఇదే అదనుగా హీరోతో కలిసి అతన్ని చంపడానికి రెడీ అవుతారు. మరి హీరోయిన్ ను తండ్రి వేధించడం అనేది నిజమేనా? ఇద్దరూ కలిసి నిజంగానే తండ్రిని లేపేసారా? అనే విషయాలు తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే.

Tags

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×