BigTV English
Advertisement

OTT Movie : ఎడారిలో ఒంటరి మహిళ… తప్పిపోయి వచ్చిన అబ్బాయితో వదలకుండా ఆ పని

OTT Movie : ఎడారిలో ఒంటరి మహిళ… తప్పిపోయి వచ్చిన అబ్బాయితో వదలకుండా ఆ పని

OTT Movie : అడ్వెంచర్ మూవీస్ చూస్తున్నంత సేపు రోమాలు నిక్కబడుచుకుంటాయి. నెక్స్ట్ ఏం జరుగుతుందని ఆత్రుతగా ఎదురు చూస్తారు మూవీ లవర్స్. కొన్ని సినిమాలు చూస్తున్నంత సేపు మనకు ఇలా జరగకూడదు అనుకుంటూనే మూవీని చూస్తాం. అంతలా అడ్వెంచర్ మూవీలో ఇమిడిపోతాం. అటువంటి అడ్వెంచర్ మూవీ గురించి ఈరోజు మన మూవీ సజెషన్ లో చెప్పుకుందాం. ఆ మూవీ పేరు ఏమిటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియో

ఈ మూవీ పేరు “ద సీడింగ్” (The seeding). ఒక ఫోటోగ్రాఫర్ నిర్మానుష్య ప్రదేశంలో కొన్ని సంవత్సరాల పాటు అనుకోకుండా చిక్కుకు పోతాడు. అతడు అక్కడి నుంచి బయటకి రావడానికి చేసే ప్రయత్నాలు చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయి. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

జాక్ అనే ఒక ఫోటోగ్రాఫర్ సూర్యగ్రహణాన్ని తన కెమెరాలో బంధించాలని ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి వెళ్లి ఫోటోలు తీయాలని బయలుదేరుతాడు. ఫోటోలు తీసిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్లడానికి వస్తుండగా అక్కడ ఒక చిన్న బాలుడు కనపడతాడు. ఈ ప్రదేశంలో బాలుడు ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. ఆ బాలుడిని నువ్వు ఎక్కడికి పోవాలి అంటూ కొంత దూరం అనుసరిస్తాడు. ఆ తర్వాత ఆ బాలుడు ఇతనికి దూరంగా వెళ్లిపోతాడు. వెనక్కి తిరిగి ఎంత వెతికినా జాక్ కి తన కారు జాడ కనపడదు. కారుని వెతికే  క్రమంలో చీకటి అవగా ఒక బండరాయి దగ్గర విశ్రాంతి తీసుకుంటాడు. అక్కడికి దగ్గర్లోనే కొన్ని శబ్దాలు రావడంతో అక్కడ ఒక నిచ్చెన ద్వారా లోయలోకి దిగుతాడు. అక్కడ ఒక మహిళ ఒంటరిగా ఉంటుంది. ఇతనిని చూసి భయపడకుండా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇతడు అడిగే ప్రశ్నలకు ఆమె సమాధానం ఏమీ చెప్పకుండా సైలెంట్ గా ఉంటుంది. జాక్ అక్కడే నిద్రపోయి తెల్లవారి చూసేసరికి ఆ ప్రాంతం లో ఆమె తప్ప ఎవరూ ఉండరు. పైకి వెళ్ళడానికి నిచ్చెన కూడా జాక్ కి కనబడదు.

ఆ ప్రాంతం నుంచి బయటపడడానికి చాలా ప్రయత్నిస్తాడు కాని అతని ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. ఆ లోయలోకి కొంతమంది పిల్లలు వీళ్ళకు కావాల్సిన వస్తువులు కొన్ని పైనుంచి విసిరేస్తా ఉంటారు. అక్కడ తినటానికి ఆహారం కోసం వ్యవసాయం కూడా చేస్తాడు జాక్. అలాగే కొంతకాలం గడిచిపోతుంది. లోయలేకి ఒకసారి వైన్ బాటిల్ కూడా విసురుతారు ఆ పిల్లలు. అది తాగిన జాక్ మత్తులో అక్కడున్న ఆమెతో ఇంటిమేట్ అవుతాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆమె గర్భవతి అవుతుంది. జాక్ కి ఆమె కొడుకు సహాయం చేయాలని చూడగా అక్కడ ఉన్న పిల్లలు అతనిని చంపేస్తారు. ఇందుకుగాను ఆమె ఇతనిని అక్కడే ఒక కేజ్ లో 9 నెలలు బంధిస్తుంది. ఆమెకు పురిటినొప్పులు రావడంతో ఇతని సహాయం ఆడగుతుంది. అప్పుడు బయటకు వెళ్లడానికి నిచ్చెన కూడా ఉంటుంది. జాక్ ఆమెకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాడు. ఆ తర్వాత ఆమె బిడ్డకు జన్మనిస్తుందా? ఆ లోయ నుంచి జాక్ తప్పించుకోగలుగుతాడా? ఇంతకీ లోయ పైన ఉన్న ఆ పిల్లలు ఎవరు? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ద సీడింగ్ థ్రిల్లర్ మూవీని తప్పకుండా చూడాల్సిందే.

Related News

OTT Movie : యాక్సిడెంట్ తరువాత కళ్ళు తెరిచి చూస్తే బంకర్‌లో… కన్నింగ్ గాడి ట్రాప్‌లో… స్పైన్ చిల్లింగ్ సర్వైవల్ థ్రిల్లర్

OTT Movie : పసికూనను తింటేగానీ తీరని ఆకలి… సూపర్ హీరోలను ఈకల్లా పీకి పారేసే మాన్స్టర్… ఫుల్ యాక్షన్ ధమాకా

Baramulla OTT : పట్టపగలే పిల్లలు అదృశ్యం… కుమార్తె రూమ్ లో కుక్క వాసన… ఇంటెన్స్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్

The Bengal Files: ఓటీటీకి వివాదస్పద చిత్రం.. ‘ది బెంగాల్‌ ఫైల్స్‌’, ఎక్కడ చూడాలంటే!

OTT Movie : కళ్ళతో చూస్తే ఆత్మహత్య… ప్రపంచాన్ని తుడిచి పెట్టే మిస్టీరియస్ శక్తి… గ్రిప్పింగ్ థ్రిల్లర్… ఊహించని ట్విస్టులు

OTT Movie : దసరా ఉత్సవాలపై 40 నిమిషాల మూవీ…. ‘ప్రొద్దుటూరు దసరా’ ఏ ఓటీటీలో ఉందో తెలుసా?

OTT Movie : స్నేహితుడిని ఇంటికి ఆహ్వానిస్తే… ఒక్కొక్కరిని మట్టుబెడుతూ పని కానిచ్చే సైకో… గూస్ బంప్స్ తెప్పించే థ్రిల్లర్

Avihitham: పితృస్వామ్య రాజ్యంలో బాధితులుగా కూతుర్లు.. ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం..!

Big Stories

×