BigTV English

Constable Rape: పోలీసులకే భద్రత లేదు.. మహిళా కానిస్టేబుల్‌పై అత్యాచారం..

Constable Rape: పోలీసులకే భద్రత లేదు.. మహిళా కానిస్టేబుల్‌పై అత్యాచారం..

Constable Rape| మహిళలకు ఎక్కడా భద్రత లేకుండా పోతోంది. సామాన్యులకు రక్షణ కల్పించే పోలీసులను సైతం కీచకులు వదలడం లేదు. ఒక మహిళా కానిస్టేబుల్ డ్యూటీలో ఉండగా తోటి పురుష కానిస్టేబుల్ ఆమెపై దాడి చేశాడు. ఆమెపై అత్యాచారం చేసేందుకు రాక్షసంగా ప్రయత్నించాడు.ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. హిమాచల్ ప్రదేశ్ రాజధాని షిమ్లాలో ఢలీ పోలీస్ స్టేషన్ లో డ్యూటీ చేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ ను గత కొంతకాలంగా అదే పోలీస్ స్టేషన్ లో పనిచేసే రాజీవ్ అనే మరో కానిస్టేబుల్ వేధించేవాడు. అయినా ఆమె ఓర్పుగా ఉండేది. అయితే అక్టోబర్ 25, 2024న రాత్రివేళ ఆ మహిళా కానిస్టేబుల్ క్వార్టర్ గార్డ్ డ్యూటీ చేస్తున్న సమయంలో రాజీవ్ ఆమె వద్దకు వచ్చి అశ్లీలంగా మాట్లాడాడు. ఆమెను తన శృంగార వాంఛలు తీర్చమని అడిగాడు. ఇందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో బలవంతం చేశాడు.

ఈ క్రమంలో ఇద్దరిపై ఘర్షణ జరిగింది. అయినా రాజీవ్ ఆమెను లొంగదీసుకోబోయాడు.. కానీ ఆమె అతడిని పక్కకు నెట్టేసి అక్కడి నుంచి పరుగులు తీసింది. ఆ సమయంలో చుట్టు పక్కల ఎవరూ లేరు. ఆమె పరుగులు తీస్తూ.. పోలీస్ వాచ్ టవర్ ఎక్కింది. అయినా అతడు వదల్లేదు. ఆమె వెంట వాచ్ టవర్ ఎక్కాడు. ఆమె గట్టిగా అరుపులు వేయడంతో అందరికీ కనిపిస్తుందని భయపడి అతను వెనుదిరిగాడు. ఆ రాత్రి అంతా ఆమె ఆ వాచ్ టవర్ లో చలి వాతావరణంలోనే గడిపింది. మరుసటి రోజు ఉదయం పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ రాజీవ్ పై అత్యాచార యత్నం చేసినందుకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. రాజీవ్ పై చర్యలు తీసుకోవాలని తన సీనియర్ అధికారులకు డిమాండ్ చేసింది. ప్రస్తుతం కానిస్టేబుల్ రాజీవ్ ను అధికారులు ససెండ్ చేసి దర్యాప్తుకు ఆదేశించారు.


Also Read: కలెక్టర్ బంగ్లా పక్కన బిజినెస్‌మ్యాన్ భార్య శవం లభ్యం.. 4 నెలల క్రితం హత్య!

ఇలాంటిదే మరో ఘటన రెండు వారాల క్రితం ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్‌లో జరిగింది. కర్వా చౌత్ (భర్తల క్షేమం కోసం భార్యలు చేసే వ్రతం) సందర్భంగా ఒక మహిళా కానిస్టేబుల్ సెలవుపై తన స్వగ్రామానికి తిరిగి వస్తుండగా.. ఆమె బస్సు దిగి గ్రామానికి నడుచుకుంటూ వస్తున్న సమయంలో ఆమెకు పరిచయమున్న ఓ రైతు ఆమెను ఇంటి వరకు లిఫ్ట్ ఇస్తానని బైక్ పై కూర్చోబెట్టుకున్నాడు. కానీ దారి మధ్యలో ఆమెను నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ సమయంలో ఆమె ఉపవాస స్థితిలో ఉంది. అయినా ఆమెపై ఆ రైతు కనికరం చూపలేదు.

అత్యాచారం తరువాత ఆమె ఈ విషయం బయటికి చెబుతుందని భయపడి ఆమెన హత్య కూడా చేయబోయాడు. అయితే ఆమె అతడిని పక్కకు తోసి అక్కడి నుంచి తప్పించుకుంది. పరుగులు తీస్తూ పోలీస్ స్టేషన్ చేరుకొని సాయం కోసం అర్థించింది. దీంతో పోలీసులు ఆ రైతును అరెస్ట్ చేశారు. అతనిపై అత్యాచారం, హత్యా యత్నం కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Related News

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Big Stories

×