BigTV English

OTT Movie : అందాల వలవేసి కొడుకుని రెచ్చగొట్టాలి… పడుచు అమ్మాయితో ముసలాడి డీల్

OTT Movie : అందాల వలవేసి కొడుకుని రెచ్చగొట్టాలి… పడుచు అమ్మాయితో ముసలాడి డీల్

OTT Movie :  అసభ్యతకు తావు లేకుండా కుటుంబంతో కలిసి చూసే విధంగా ఈ హాలీవుడ్ మూవీ ఉంటుంది. రొమాంటిక్, కామెడీ కంటెంట్ తో ఈ మూవీని చిత్రీకరించారు మేకర్స్. ఒక ఫీల్ గుడ్ ఎంటర్టైన్మెంట్ మూవీని చూడాలనుకునే వాళ్ళకి ఈ మూవీ ఒక బెస్ట్ సజెషన్. టైటిల్ ని చూసి బోల్డ్ మూవీ అనుకున్నారేమో అస్సలు కాదు. ఈ మూవీ పేరు ఏమిటో, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియో

సరదాగా సాగిపోయే ఈ మూవీ పేరు మరేమిటో కాదు ‘ద స్టూడెంట్ అండ్ మిస్టర్ హెన్రీ‘. ఈ మూవీ ఇంటి ఓనర్ అయిన ఒక ముసలివాడు, అతని ఇంట్లో రెంట్ కు ఉంటున్న ఒక స్టూడెంట్ చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీని చూసే ప్రేక్షకులకు ఒక మంచి మూవీ చూసాం అన్న ఫీలింగ్ కలుగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

ఒక ఇంట్లో హెన్రీ అనే 80 సంవత్సరాల వృద్ధుడు ఉంటాడు. ఇతడు చాలా మొండివాడు. ఇతని భార్య చనిపోయి ఉంటుంది. ఈ వృద్ధుడికి పాల్ అనే కొడుకుతో పాటు వెరోనికా అనే కోడలు ఉంటుంది. వీరు ఉద్యోగరీత్యా సపరేట్ గా ఉండాల్సి రావడంతో, తండ్రిని ఒంటరిగా వదలలేక అందులో ఒక రూమ్ ని అద్దెకి ఇవ్వాలి అనుకుంటారు. ఆ రూమ్ ని తక్కువ ధరకే రెంటుకు ఇస్తామంటూ పేపర్లో యాడ్ కూడా ఇస్తారు. ఇది ఇలా ఉంటే మరోవైపు మియా అనే 20 సంవత్సరాల అమ్మాయి డిగ్రీ ఫెయిల్ అయ్యి తండ్రి చేత తిట్లు తింటుంది. ఈమెకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. కానీ ఈమె తండ్రి సప్పోర్ట్ చేయడు. ఈసారి డిగ్రీ ఫెయిల్ అయితే కూరగాయల కొట్టు చూసుకోవాలి అని తండ్రి మియాకి చెప్తాడు. ఈసారి ఎలాగైనా డిగ్రీ పాస్ అయి వస్తానని తండ్రితో ఛాలెంజ్ చేస్తుంది. ఈమె చదువుకోవటానికి ఆ ముసలివాడి ఇంట్లో అద్దెకు ఉంటానని ఆన్లైన్లో అప్లై చేస్తుంది. చాలామందిని చూసిన ముసలివాడు ఈ అమ్మాయిని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాడు.

ఆ అమ్మాయి ఆ ఇంట్లో అద్దెకు దిగిన తర్వాత అతను మూడు నెలల అద్దె అడ్వాన్సుగా ఇవ్వాలి అని చెప్తాడు. ఆమె దగ్గర ఒక నెలకు మాత్రమే అడ్వాన్స్ ఇవ్వటానికి డబ్బులు ఉంటాయి. ఆ ముసలివాడిని బ్రతిమాలడంతో ఆ అమ్మాయితో ఒక డీల్ కుదుర్చుకుంటాడు. ఆ డీల్ ఏంటో తెలియక ఈ ముసలి వయసులో ఏం అడుగుతాడో అని ఆలోచిస్తూ ఉండగా, అతడు చెప్పిన విషయానికి హీరోయిన్ షాక్ అవుతుంది. అదేమిటంటే తన కొడుకు కోడలిను విడగొట్టాలి అని, అందుకు నీ అందాన్ని ఎరగా వేయాలని చెప్తాడు. ఇతనికి పిచ్చి పట్టిందేమో అని అనుకుంటుంది. ఆమె దగ్గర డబ్బులు లేకపోవడంతో తప్పక ఒప్పుకుంటుంది. అన్నట్టుగానే తన అంద చందాలతో అతని కుమారున్ని రెచ్చగొడుతుంది. పాల్ మొదట కంగారుపడినా ఈమె అందానికి తలవంచుతాడు. మంచి బాలుడుగా ఉంటున్న పాల్ రొమాంటిక్ ఫెలోగా తయారవుతాడు. పాల్ మియా మాయలో పడిపోతాడు. ఈ విషయం పాల్ భార్యకు తెలుస్తుంది. ఇంతకీ ముసలివాడు కొడుకు కోడల్ని ఎందుకు విడగొట్టాలనుకుంటాడు? ఈ విషయం తెలిసిన పాల్ భార్య ఏమవుతుంది? ఇంతకీ హీరోయిన్ డిగ్రీ పాస్ అవుతుందా? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీని తప్పకుండా చూడాల్సిందే.

 

Related News

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Big Stories

×