BigTV English
Advertisement

OTT Movie : దయ్యాలు ఉన్నాయని తెలీక ఆ ఇంట్లోకి వెళ్ళిన పనిమనిషికి చుక్కలు చూపించే దయ్యాలు

OTT Movie : దయ్యాలు ఉన్నాయని తెలీక ఆ ఇంట్లోకి వెళ్ళిన పనిమనిషికి చుక్కలు చూపించే దయ్యాలు

OTT Movie : హర్రర్ థ్రిల్లర్ సినిమాలను చూడాలంటే మూవీ లవర్స్ ఉత్సాహం చూపిస్తారు. ఈ సినిమాలు మామూలుగానే భయంకరంగా ఉంటాయి. అందులో వచ్చే సౌండ్ ఎఫెక్ట్స్ తో కొన్ని సీన్స్ చూడాలంటే వెన్నులో వణుకు పుడుతుంది. అటువంటి హర్రర్ థ్రిల్లర్ మూవీ ఒకటి ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? వివరాల్లోకి వెళితే…


సోనీ లివ్ (SonyLIV)

ఈ హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది టర్నింగ్‘ (The turning) ఈ మూవీలో కేర్ టేకర్ గా ఒక భవంతికి వెళ్లిన హీరోయిన్ కి ఆ భవంతిలో  దయ్యాలతో ఎదురయ్యే సన్నివేశాలతో మూవీ స్టోరీ నడుస్తుంది. వెన్నులో వణుకు పుట్టించే ఈ హారర్ థ్రిల్లర్ మూవీ సోనీ లివ్ (SonyLIV) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

కేట్ అనే అమ్మాయి కేర్ టేకర్ గా పిల్లలను చూసుకోవడానికి ఒక భవంతుకి వెళ్లాలనుకుంటుంది. వెళ్లేముందు తన తల్లిని హాస్పిటల్ లో చూసి వెళ్తుంది. తన తల్లికి మానసిక పరిస్థితి సరిగ్గా ఉండదు. అందుకే ఒకసారి చూసి వెళ్లాలనుకుంటుంది. ఆ తరువాత ఆ భవంతికి వెళ్లిన కేట్ ని  అక్కడే ఉన్న ఒక మహిళ రిసీవ్ చేసుకుంటుంది. ఆ ఇంట్లో ఫ్లోరా, మైల్స్ ఇద్దరు పిల్లలు ఉంటారు. వీరికి తల్లిదండ్రులు చనిపోవడంతో కేర్ టేకర్ ని అపాయింట్ చేస్తారు. అలా వచ్చిన కేట్ ఈ పిల్లలకి బాగోగులు చూసుకుంటుంది. అయితే మైల్స్ బాగా అల్లరి చేస్తూ ఉంటాడు. అతడి అల్లరికి బాగా విసుగు చెందుతుంది కేట్. అదే ఇంట్లో కొన్ని ఆత్మలు కేట్ ని భయపెడుతూ ఉంటాయి. ఆ భవంతిలో ఉన్న మహిళను కొన్ని విషయాలు కేట్ అడిగి తెలుసుకుంటుంది. కేట్ ప్లేసులో ఇదివరకే ఒక కేర్ టేకర్ పనిచేసి చెప్పకుండా వెళ్ళిపోయి ఉంటుంది. ఆమెను గుర్రాలను చూసుకునే పీటర్ ప్రేమిస్తూ ఉండేవాడు. ఆమె వెళ్లిపోయాక పీటర్ మందు తాగుతూ కిందపడి చనిపోతాడు.

ఆ పీటర్ ఆత్మ ఈ భవంతులో తిరుగుతూ ఉంటుంది. ఈ విషయాలు తెలుసుకున్న కేట్ అందులోనుంచి వెంటనే వెళ్లిపోవాలనుకుంటుంది. అయితే ఫ్లోరకి ఒక మాట ఇచ్చి ఉంటుంది కేట్. ఆ మాట ఏమిటంటే తనకి చెప్పకుండా వెళ్లిపోవద్దని మాట తీసుకుంటుంది ఫ్లోరా. కేట్ ని ఆ ఆత్మ బాగా భయపెడుతూ ఉంటుంది. అందులో ఉన్న మహిళలను ఆ పీటర్ దయ్యం చంపేస్తుంది. ఇదిచూసి కేట్ పిల్లల్ని తీసుకొని అక్కడినుంచి వెళ్లిపోవడానికి ట్రై చేస్తనది. ఈ క్రమంలో చివరికి కేట్ ని కూడా ఆ దయ్యం చంపుతుందా? ఆ ఇంట్లో నుంచి కేట్ బయట పడుతుందా? ఇంతకుముందు పనిచేసిన కేర్ టేకర్ ఎలా మిస్సయింది? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ సోనీ లీవ్ (SonyLIV) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ది టర్నింగ్’ (The turning) సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని చూడాల్సిందే.

Tags

Related News

The Great Pre Wedding Show OTT : చిన్న సినిమాగా వచ్చి చితగ్గొడుతున్న ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’… క్రేజీ ఓటీటీ డీల్

OTT Movie : 20 ఏళ్ల అబ్బాయితో 40 ఏళ్ల ఆంటీ… పాటలతో వలపు వల… ఆ సీన్లైతే అరాచకం భయ్యా

OTT Movies : ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ సినిమాలు.. ఆ నాల్గింటిని మిస్ అవ్వకండి..

OTT Movie : పూలమ్మే పిల్ల జీవితంలోకి మాజీ ప్రియుడు… ఖతర్నాక్ క్లైమాక్స్ మావా

OTT Movie : కుర్రాడి నుంచి పండు ముసలిదాకా ఎవ్వర్నీ వదలని అమ్మాయి… ఇదెక్కడి తేడా యవ్వారంరా సామీ ?

OTT Movie : ప్రియుడిని వదిలేసి మరొకడితో… కళ్ళు తెరిచినా మూసినా అవే సీన్లు… క్లైమాక్స్ కెవ్వు కేక

OTT Movie : చేతబడులతో చచ్చి బతికే కుటుంబం… ‘విరూపాక్ష’ను మించిన బ్లాక్ మ్యాజిక్ మరాఠీ మూవీ తెలుగులో

OTT Movie : తాత వల్ల నలిగిపోయే కూతురు, మనవడు… గుండెను పిండేసే రాశి ఫ్యామిలీ ఎంటర్టైనర్

Big Stories

×