Sreeleela: ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరు అంటే టక్కున గుర్తొచ్చే పేరు శ్రీలీల. 2023 నుండి 2024 వరకు బ్యాక్ టు బ్యాక్ సినిమల్లో నటించి అందరినీ ఆశ్చర్యపరిచిన శ్రీలీల.. ఈ ఏడాది ఏకంగా ఒక పాన్ ఇండియా సినిమాలో ఐటెమ్ సాంగ్ చేయడానికి ఒప్పుకొని అందరికీ షాకిచ్చింది. ప్రస్తుతం శ్రీలీలకు బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు రావడం మాత్రమే కాదు.. విపరీతంగా క్రేజ్ కూడా పెరిగిపోయింది. అదే ఐఎమ్‌డీబీ సైతం గుర్తించింది. పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ లిస్ట్‌లో శ్రీలీలకు చోటుదక్కేలా చేసింది. ఈ లిస్ట్‌లో ఎంతోమంది పాపులర్ సెలబ్రిటీలను వెనక్కి నెట్టి మరీ శ్రీలీల ఈ స్థానాన్ని సంపాదించుకోవడం విశేషం.
రుణపడి ఉంటాను
ఐఎమ్‌డీబీ మోస్ట్ పాపులర్ సెలబ్రిటీస్ లిస్ట్‌లో శ్రీలీలకు మూడో స్థానం దక్కింది. దీంతో తను ఎంతోమంది సౌత్‌తో పాటు నార్త్ సెలబ్రిటీలను కూడా వెనక్కితోసింది. దీంతో ఎమోషనల్ అయిన శ్రీలీల.. దీని గురించి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ‘ఎప్పటికీ కృతజ్ఞతగా రుణపడి ఉంటాను. దీనిని మీ అందరికీ డెడికేట్ చేస్తున్నాను’ అంటూ తను ఇంత పాపులర్ అవ్వడానికి తన ఫ్యాన్సే కారణం అని చెప్పకనే చెప్పింది శ్రీలీల. ప్రస్తుతం ఏ హీరోయిన్ లేనంత బిజీగా శ్రీలీల గడిపేస్తోందని ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతే కాకుండా తెలుగుతో పాటు ఇతర భాషలు కూడా కవర్ చేయాలని ఈ ముద్దుగుమ్మ ఫిక్స్ అయ్యిందట.
Also Read: దయచేసి రూమర్స్ ను నమ్మొద్దు.. రాజా సాబ్ టీమ్ రిక్వెస్ట్
ఏడాదిలో ఒకే సినిమా
2024ను గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పింది శ్రీలీల (Sreeleela). ఏకంగా మహేశ్ బాబులాంటి స్టార్ హీరోతో ‘గుంటూరు కారం’ అనే సినిమాలో కలిసి నటించే ఛాన్స్ కొట్టేసింది. అంతే కాకుండా వీరిద్దరూ కలిసి స్టెప్పులేసిన కుర్చీ మడతపెట్టి అనే పాట చాలాకాలం పాటు యూట్యూబ్‌లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంతకు మించి శ్రీలీలకు ఈ ఏడాది పెద్దగా చెప్పుకోదగిన సినిమాలు ఏమీ లేవు. అదే సమయంలో సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పుష్ఫ 2’లో ఐటెమ్ సాంగ్ చేసే ఛాన్స్ కొట్టేసింది శ్రీలీల. ముందుగా ఈ ఐటెమ్ సాంగ్‌లో స్టెప్పులేయడానికి ఎంతోమంది బాలీవుడ్ భామల పేర్లను పరిగణనలోకి తీసుకున్నా తర్వాత ఆ ఛాన్స్ శ్రీలీలకే దక్కింది.
లోటు తీర్చేసింది
ఏడాది అంతా ఫ్యాన్స్‌ను పలకరించకుండా ‘పుష్ప 2’లో కిసిక్ అంటూ కుర్రకారు ముందుకు వచ్చింది శ్రీలీల. ఈ ఒక్క సినిమాతో తన పాపులారిటీ విపరీతంగా పెరిగిపోయింది. తను ఈ ఏడాది మొత్తం అసలు వెండితెరపై కనిపించకపోయినా.. కిసిక్ పాటతో అంతా కవర్ చేసేసింది. చేసింది ఐటెమ్ సాంగే అయినా కూడా ‘పుష్ప 2’ టీమ్‌తో కలిసి యాక్టివ్‌గా ప్రమోషన్స్‌లో పాల్గొంది శ్రీలీల. దీంతో తన గురించి సోషల్ మీడియాలో ఎన్నోసార్లు వైరల్‌గా మారింది. అందులో భాగంగానే ఇప్పుడు శ్రీలీల చేతిలో దాదాపు అరడజనకు పైగా ఆఫర్లు ఉన్నాయి. తాజాగా అక్కినేని వారసులతో ఒకేసారి నటించే ఛాన్స్ కూడా కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ.