OTT Movie : ఫాంటసీ సినిమాలను ఎంటర్టైన్మెంట్ కోసం అందరూ చూస్తారు. ఈ సినిమాలలో ఉండే విజువల్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. మరో లోకంలోకి తీసుకెళ్లే ఈ సినిమాలు ఓటిటి ప్లాట్ ఫామ్ లో చాలానే స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో 2023లో రిలీజ్ అయిన ఒక చైనీస్ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.
యూట్యూబ్ (Youtube)
ఈ చైనీస్ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ పేరు ‘టూంబ్ మేకింగ్ నోట్స్‘ (Tomb Making Notes). ఈ మూవీలో ఒక రాజు సమాధి కోసం హీరో, విలన్ వెతకడంతో స్టోరీ సాగుతూ ఉంటుంది. ఆ సమాధిలో చాలా నిధి ఉందని వీళ్ళు వెతుకుతూ ఉంటారు. చివరివరకూ సస్పెన్స్ గా సాగే ఈ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ యూట్యూబ్ (Youtube) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
హీరో పురాతన సమాధులను వెలికి తీసి అందులో రహస్యాలను కనుక్కుంటూ ఉంటాడు. ఇతని అసిస్టెంట్ ద్వారా ఆ విషయం తెలుసుకున్న విలన్ గ్యాంగ్ ఒక సమాధిని తెరవాలని ఇతన్ని కోరుతారు. హీరో ఆ సమాధిని, తన దగ్గరున్న ఒక పురాతనమైన వస్తువుతో తెరుస్తాడు. అయితే అందులో అస్తిపంజరం తప్ప ఏమీ ఉండదు. అప్పుడే హీరో అసిస్టెంట్ అందులో ఒక వస్తువును దొంగలిస్తాడు. ఆ వస్తువును తీసుకొని హీరోకి చూపిస్తాడు. అందులో ఒక మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్ రాజు సమాధి ఎక్కడ ఉంటుందో చూపిస్తుంది. ఆ మ్యాప్ కోసం హీరోయిన్ కూడా అక్కడికి వస్తుంది. వీళ్ళతో ఫైట్ చేసి ఆ మ్యాప్ ని తీసుకుంటుంది. ఇంతలో అక్కడికి విలన్ గ్యాంగ్ కూడా వస్తారు. విలన్ గ్యాంగ్ దగ్గర గన్స్ ఉండటంతో, హీరోయిన్ వాళ్లతో ఫైట్ చేయలేక ఆ మ్యాప్ ని పాడు చేస్తుంది. విలన్ గ్యాంగ్ హీరోయిన్ ని చంపాలని చూస్తారు. రాజు సమాధి తనకు మాత్రమే తెలుసని, నన్ను చంపితే ఆ రహస్యం నాతోనే పోతుందని ఆమె చెబుతుంది.
విలన్ వీళ్ళందర్నీ ఒక వ్యాన్ లో తీసుకొని ఆ సమాధి ఎక్కడుందో వెతకడానికి వెళ్తారు. వెళ్లే క్రమంలో వీళ్లకు ఎనిమిది అవాంతరాలు ఎదురవుతాయి. గబ్బిలాలు, దయ్యాలు ఇలా అన్నిటిని వీళ్ళంతా అధిగమించుకుంటూ వెళ్తారు. చివరికి రాజు సమాధి దగ్గరికి చేరుకుంటారు. అయితే ఆ సమాధిని తెరవడానికి హీరో నానా తంటాలు పడతాడు. దానిని తెరవడానికి ఒక కీ అవసరం అవుతుంది. చాలా బంధనాలు ఆ సమాధికి వేసిఉంటాయి. చివరికి హీరో ఆ సమాధిని తెరవగలుగుతాడా? అందులో నిజంగానే నిధి ఉంటుందా? ఇంకా ఏమైనా శక్తులతో పోరాడాల్సి వస్తుందా? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్ (Youtube) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘టూంబ్ మేకింగ్ నోట్స్’ (Tomb Making Notes) అనే ఈ ఫాంటసీ థ్రిల్లర్ మూవీని చూడాల్సిందే. ఈ ఫాంటసీ థ్రిల్లర్ మూవీని ఫ్యామిలీతో కలసి చూసి ఎంజాయ్ చేయండి.