Skin Care Tips: చలికాలంలో తేమ లేకపోవడం వల్ల చర్మం పొడిబారడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి. చలికాలంలో అనేక చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. చర్మం నిర్జీవంగా, పొడిగా మారుతుంది. ఈ రోజుల్లో చర్మాన్ని సంరక్షించడం చాలా ముఖ్యం. స్నానం చేసిన తర్వాత చర్మంపై మాయిశ్చరైజర్ అప్లై చేయడం గురించి చాలా మంది పట్టించుకోరు.
స్నానం చేసిన తర్వాత ముఖానికి మాయిశ్చరైజర్ అప్లై చేస్తే చర్మం యొక్క సహజమైన మెరుపును తిరిగి వస్తుంది. అంతే కాకుండా కొన్ని రకాల హోం రెమెడీస్ ముఖ సౌందర్యాన్ని కూడా పెంచుతాయి. మరి ఎలాంటి హోం రెమెడీస్ గ్లోయింగ్ స్కిన్ కోసం ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
క్రీమ్, నిమ్మకాయ ఉపయోగించండి :
క్రీమ్, నిమ్మరసం వాడటం వల్ల ముఖంపై ఉన్న జిడ్డు తొలగిపోతుంది. ఇది మీ స్కిన్ టోన్‌ని సులభంగా తిరిగి పొందేలా చేస్తుంది. దీని కోసం మీరు క్రీమ్-నిమ్మకాయరసంతో తయారు చేసిన పేస్ట్ ఉపయోగించాలి. దీనిని తరుచుగా వాడటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అంతే కాకుండా దీనిని వాడటం వల్ల ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.
కొబ్బరి, రోజ్ వాటర్ :
కొబ్బరి ,రోజ్ వాటర్ ముఖ ఛాయను మెరుగుపరచడానికి ఉపయోగించవచ్చు. దీని కోసం మీరు కొబ్బరి నూనె ,రోజ్ వాటర్ ను సమాన మోతాదుల్లో తీసుకుని కలపాలి. స్నానం చేసిన తర్వాత దీనిని చర్మంపై అప్లై చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే దాని ప్రభావం కొద్ది రోజుల్లోనే కనిపిస్తుంది.
నెయ్యి ఉపయోగించండి :
ముఖంపై సహజమైన కాంతిని తిరిగి తీసుకురావడానికి మీరు స్నానం చేసిన తర్వాత నెయ్యిని ఉపయోగించవచ్చు. మీ చర్మంపై పగుళ్లు ఉంటే ఇది చర్మంపై పగుళ్లు రాకుండా కాపాడుతుంది.
Also Read: ఈ ఆయిల్ వాడితే చాలు.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది
ఆవనూనె :
ఆవాల నూనె చర్మంపై అప్లై చేయడానికి అంతంగా ఇష్టపడరు. కానీ చలికాలంలో స్నానం చేసిన తర్వాత ముఖానికి, శరీరానికి ఆవ నూనె అప్లై చేస్తే మాత్రం చర్మం మెరుస్తుంది.
తేనె, గ్లిజరిన్ :
స్నానం చేసిన తర్వాత తేనె, గ్లిజరిన్ మిశ్రమాన్ని వాడితే చర్మం గరుకుగా మారకుండా ఉంటుంది. అంతే కాకుండా వీటిని వాడటం వల్ల గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది. రంగు మారిన చర్మం తిరిగి తెల్లగా మారాలంటే వీటిని తప్పకుండా వాడాలి.