Rewind 2024 : మరో రెండు రోజుల్లో 2024 ఎండ్ అవుతుంది. 2025 లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాము. ఈ ఏడాది జరిగిన బెస్ట్ మెమొరీస్ ను ఒకసారి గుర్తు చేసుకుంటారు. ఈ ఏడాది జరిగిన కొన్ని విషయాల్లో సినిమాలు, సినిమా హీరో, హీరోయిన్లు హైలెట్ అయ్యారు. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు ఉన్నారు. కానీ సినిమాల పరంగా లేదా మరే ఇతర కారణాల వల్లనో కొందరు హీరోయిన్లు ఈ ఏడాది హైలెట్ అయిన హీరోయిన్లు ఎవరో ఒకసారి తెలుసుకుందాం..
సమంత..
సమంత ఏడాది గ్యాప్ తీసుకొని వరుస సినిమాలకు సిగ్నల్ ఇచ్చింది. బ్యాక్ టు బ్యాక్ రెండు మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ ఒక్క మూవీ కూడా హిట్ టాక్ ను అందుకోలేదు. ఓటీటీలో మాత్రం దుమ్ము దులిపేస్తుంది. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన స్పై యాక్షన్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’తో మెరిసింది. ప్రపంచంలోనే అత్యధికమంది చూసిన వెబ్ సిరీస్‌గా సిటాడెల్ రికార్డు సాధించింది. ఈ సిరీస్ ఏకంగా 200 దేశాల్లో స్ట్రీమింగ్ అయితే, 150 దేశాల్లో ట్రెండింగ్‌లో నిలిచింది. ప్రమోషన్స్‌లో సామ్ తన మాజీ భర్తపై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు హైలెట్ అయ్యింది. అంతేకాదు ఐఫా అవార్డు కూడా సొంతం చేసుకుంది..
అలియా భట్..
టైమ్స్’ మ్యాగజైన్ 2024లో ‘ప్రపంచ అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల’ జాబితాలో చోటు దక్కించుకుంది. వెండితెరపై నటనతో పాటు దాతృత్వ కార్యక్రమాలకు చేసిన కృషికిగాను అలియాకు ఈ గౌరవం దక్కింది. ఇటీవల మెగా గాలా ఈవెంట్ లో తన అద్భుతమైన శారీతో అందరిని ఆకట్టుకుంది.. ఇక ఈ చీరను తాశోక163 మంది చేయి తిరిగిన కళాకారులు, 1,965 గంటలపాటు పని చేయడం విశేషం. ఈ ఏడాది ‘మెట్ గాలా’ థీమ్ ‘గార్డెన్ ఆఫ్ టైమ్’కు అనుగుణంగా అలియా తన చీర లోనే ప్రకృతినే పెట్టుకున్నంది..
రష్మిక మందన్న...
పుష్ప’, ‘యానిమల్’ సినిమాలతో గ్లోబల్ ఫేవరెట్‌గా మారింది రష్మిక మందన్న. ఈ ఏడాది ‘ఫోర్బ్స్’ మ్యాగజైన్ ప్రకటించిన ‘ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30’ జాబితాలో స్థానం సంపాదించింది. అంతేకాదు… ఇన్‌స్టాగ్రామ్‌లో 40 మిలియన్ ఫాలోవర్స్ మైలురాయిని దాటినన మొదటి దక్షిణాది హీరోయిన్ కూడా ఆమే పలు సినిమాలతో బిజీగా ఉంది…
త్రిప్తి డిమ్రీ..
యానిమల్’తో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది త్రిప్తి డిమ్రీ. ఈమె ఈ ఏడాది వరుసగా… ‘బ్యాడ్‌న్యూజ్’, ‘భూల్ భులయ్యా’, ‘విక్కీ విద్యా కా వో వాలా వీడియో’ సినిమాలతో ఆకట్టుకుంది.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈమె గ్లామర్ మెరుపులు పుట్టిస్తుంది. హాట్ అందాలతో పిచ్చేక్కిస్తుంది.
నయనతార..
కొలీవుడ్ ముద్దుగుమ్మ నయనతార ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉండేది. కానీ ఇప్పుడు వివాదాలకు కేరాఫ్ గా మారింది. నయనతార ఈ ఏడాది వార్తల్లో వ్యక్తిగా మారింది. ఆమె జీవితం ఆధారంగా ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యింది. ధనుష్ తో వివాదం.. ఇవన్నీ కూడా ఈ ఏడాది టాప్ లో ఉన్నాయి. సోషల్ మీడియా, మీడియాలో హైలెట్ అవ్వడంతో ఈ హీరోయిన్లు ట్రేండింగ్ లో ఉన్నారు.