BigTV English

OTT Movie : పెళ్ళి చేసుకుంటాని చెప్పి కోరికలు తీర్చుకొనే లవర్… క్లైమాక్స్ చూస్తే దిమ్మతిరగాల్సిందే

OTT Movie : పెళ్ళి చేసుకుంటాని చెప్పి కోరికలు తీర్చుకొనే లవర్… క్లైమాక్స్ చూస్తే దిమ్మతిరగాల్సిందే

OTT Movie : రొమాంటిక్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమాలను చూసి మూవీ లవర్స్ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ సినిమాలు మంచి కంటెంట్ తో పాటు, రొమాంటిక్ సీన్స్ కూడా ఉంటాయి. ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఆటవంటి ఒక రొమాంటిక్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ సందడి చేస్తోంది. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియో 

ఇప్పుడు మనం చెప్పుకోబోయే రొమాంటిక్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ పేరు “ట్రిష్ణ” (Trishna). ఈ మూవీలో ఒక పేదింటి  అమ్మాయి, ఒక డబ్బున్న వ్యక్తి మాయలో పడిపోతుంది. పెళ్ళి చేసుకుంటానని చెప్పడంతో అతనితో సన్నిహితంగా ఉంటూ అన్నీ అర్పిస్తుంది. వీరిద్దరి మధ్య మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీ లోకి వెళితే

హీరోయిన్ ఒక పేదింటి అమ్మాయి. తండ్రి ఒక వ్యాన్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. ఒకరోజు వీళ్ళిద్దరూ వ్యాన్లో వెళుతుండగా ప్రమాదం జరుగుతుంది. తండ్రి మంచానికి పరిమితం అవుతాడు. ఇల్లు గడవడం కూడా కష్టం అవుతుంది. వ్యాన్ మీద అప్పు కూడా ఉండటంతో హీరోయిన్ ఏదైనా పనిచేయాలనుకుంటుంది. ఈ క్రమంలోనే జై సింగ్ అనే వ్యక్తి హీరోయిన్ కి పరిచయం అవుతాడు. అతడు బాగా డబ్బున్న వ్యక్తి కావడంతో ఆమెను తన హోటల్లో పనిలో పెట్టుకుంటాడు. ఆమెతో బాగా పరిచయం పెంచుకొని దగ్గర అవ్వాలని చూస్తాడు. ఒక రోజు హీరోయిన్ ఒక ఫంక్షన్ కి వెళ్లి తిరిగి వస్తుండగా, జై సింగ్ ఆమెను ఇంటికి తీసుకెల్తూ ఉంటాడు. మార్గమధ్యంలో ఆమెతో ఏకంతంగా గడుపుతాడు. అయితే తప్పు చేశానని బాధపడిన హీరోయిన్ తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. ప్రెగ్నెంట్ కూడా అవడంతో ఇంట్లో వాళ్ళు అబార్షన్ చేపిస్తారు. ఆమెను వెతుక్కుంటూ జై సింగ్ మళ్లీ ఇంటికి వస్తాడు. తనతో పాటు రావాల్సిందిగా కోరుతాడు. ఆర్థికంగా ఇబ్బందిగా ఉండటంతో మళ్ళీ అతనితో వెళ్తుంది.

ఈ సారి అతను ముంబైకి తీసుకెళ్లి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక పనిలో పెడతాడు. అతను హీరోయిన్ తో అన్ని రకాలుగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు లండన్ వెళ్లాలని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత చాలా రోజుల వరకు తిరిగి రాడు. హీరోయిన్ ఏమైందో కూడా తెలుసుకోకుండా ఉండిపోతాడు. అప్పుడు హీరోయిన్ కి అతను ఎలాంటివాడో అర్థమవుతుంది. తనతో  ఏకంతంగా గడపడం కోసం వాడుకుంటున్నాడని తెలుసుకుంటుంది. ఇండియాకి తిరిగి వచ్చిన జై సింగ్ ను కత్తితో పొడిచిన చంపేస్తుంది. చివరికి హీరోయిన్ జై సింగ్ ను ఎందుకు చంపాల్సి వస్తుంది? ఆ తర్వాత పోలీసులకు హీరోయిన్ దొరికిపోతుందా?  హీరోయిన్ కు తర్వాత ఏమైనా సమస్యలు వస్తాయా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఓటిటి ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ “ట్రిష్ణ” (Trishna) అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీని తప్పకుండా చూడండి.

Related News

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో… ఒకడి తరువాత మరొకడితో ఇదేం పని పాపా?

Big Stories

×