BigTV English
Advertisement

OTT Movie : ఒంటిపై నూలు పోగు లేకుండా అమ్మాయిల వీడియోలు… క్రేజీ సైకో కిల్లర్ మూవీ

OTT Movie : ఒంటిపై నూలు పోగు లేకుండా అమ్మాయిల వీడియోలు… క్రేజీ సైకో కిల్లర్ మూవీ

OTT Movie : ఈమధ్య సోషల్ మీడియా వినియోగం ఎంత ఎక్కువగా పెరిగిందో ట్రొలింగ్ కూడా అంతకంటే ఎక్కువగానే జరుగుతుంది. కొంతమంది ఎక్కువగా అమ్మాయిలని టార్గెట్ చేస్తూ అడ్డమైన బూతులు తిడతారు. అసలు వాళ్ళ తప్పేం లేకపోయినా సరే డీప్ ఫేక్ లాంటి వీడియోలతో అమ్మాయిల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలా బిహేవ్ చేసేవారికి నరకం అంటే ఏంటో చూపించే సైకో కిల్లర్ మూవీనే ఇది. మరి ఈ మూవీ ఏ ఓటిటి లో ఉంది? స్టోరీ ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


ఫ్రీగానే చూడవచ్చు 

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఒక బెంగాల్ సైకో కిల్లర్ మూవీ. అమ్మాయిలను టార్గెట్ చేస్తూ హింసించే వారికి ఈ మూవీ ని చూస్తే వణుకు పుట్టాల్సిందే. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ బెంగాలీ మూవీ 2021 లో రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ సినిమా ప్రస్తుతం డైలీ మోషన్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది. పైగా దీన్ని ఫ్రీగానే చూడొచ్చు. ఈ  సినిమా పేరు “ట్రోల్” (Troll).


కథలోకి వెళ్తే….

పోలీసులకు ఒక వ్యక్తి అత్యంత దారుణంగా హత్యకు గురై కనిపిస్తాడు. ఎవరో అతని ముఖాన్ని సుత్తితో పగలగొట్టేస్తారు. అయితే పోలీసులు ఆ సీన్ చూసి ఈ హత్యను ఎవరు చేసారో పట్టుకోవాలని గట్టిగా డిసైడ్ అవుతారు. ఆ తర్వాత ఇన్ ఫార్మర్లు అందరూ  మీటింగ్ పెట్టి వాడిని ఎలాగైనా పట్టుకోవాలని అనుకుంటారు. అందులో కిరణ్ అనే వ్యక్తి కూడా ఉంటాడు. అంతలోనే ఓ అమ్మాయి సూసైడ్ చేసుకుందన్న వార్త బయటకు వస్తుంది. అది కూడా తన గురించి బయటకు వచ్చిన ఫేక్ వీడియో వల్ల. దీంతో కిరణ్ కి తన సోదరీ గుర్తొస్తుంది. చిన్నప్పుడే తల్లి తండ్రి చనిపోవడంతో అన్నా చెల్లెలు ఇద్దరూ ఒకరికొకరు తోడు అన్నట్టుగా బతుకుతారు.

అయితే కిరణ్ సోదరి కూడా ఇలాంటి ఒక ఫేక్ వీడియో వైరల్ కావడం వల్ల చనిపోతుంది. అప్పటినుంచి ఇలా అమ్మాయిల వీడియోలను బయటపెట్టి వాళ్ళ చావులకు కారణం అవుతున్న వారిని ఎలాగైనా పట్టుకోవాలని డిసైడ్ అవుతాడు కిరణ్. అందులో భాగంగానే పోలీస్ ఇన్ఫార్మర్ గా చేరుతాడు. మరోవైపు మీరా అనే అమ్మాయి సినిమాల్లో నటిస్తుంది. ఆమెకు మంచి ఫేం ఉంటుంది. సినిమాలలో మంచి స్టార్ డం ఉన్న ఈ హీరోయిన్ ని ఎవరో అజ్ఞాత వ్యక్తి టార్గెట్ చేస్తాడు. ఫోన్ లో  మెసేజ్ పెడుతూ, నీ వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తానని బెదిరిస్తాడు. హీరోయిన్ కి అలా ఫేస్ బుక్ లో పోస్ట్ అవుతున్న వీడియోల వల్ల ఇబ్బందులు మొదలవుతాయి. ఆమెను పెళ్లి చేసుకోవాల్సిన వ్యక్తి ఇలాంటి వీడియోల వల్ల ఫ్యామిలీలో సమస్యలు మొదలవుతాయి అంటూ సినిమాలను మానేయమంటాడు.

అయినప్పటికీ హీరోయిన్ అన్నిటినీ మేనేజ్ చేసుకుంటూ సినిమాలు చేస్తుంది. ఇక హీరో అలా ఫేస్ బుక్ లో అమ్మాయిల ట్రోల్ చేస్తున్న పేజ్ లో చేరడానికి ఒక పెద్ద సాహసం చేస్తాడు. ఇక మరోవైపు హీరోయిన్ వీడియోలు తరచుగా పోస్ట్ అవుతుండడంతో కిరణ్ ఆమె దగ్గరకు వెళ్లి అసలు ఏం జరిగిందో కనుక్కోవడానికి ట్రై చేస్తాడు. తనను ఒక అన్నలా భావించమంటూ తన చెల్లెలు ఎలా చనిపోయిందో చెప్తాడు. మరి చివరికి హీరో అమ్మాయిల వీడియోలను పోస్ట్ చేస్తున్న ఆ వ్యక్తిని పట్టుకోగలిగాడా? హీరోయిన్ చెల్లి చావుకి కారణం ఎవరు? అలా అమ్మాయిలను ట్రోల్ చేస్తున్న వారిని టార్గెట్ చేసి సుత్తితో కొట్టి మరీ చంపుతున్న ఆ సైకో కిల్లర్ ఎవరు? హీరోయిన్ ను హీరో ఇబ్బందుల నుంచి బయటపడేయగలిగాడా? అనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ఈ ‘ట్రోల్’ అనే సినిమాను చూడాల్సిందే.

Related News

OTT Movie : యాక్సిడెంట్ తరువాత కళ్ళు తెరిచి చూస్తే బంకర్‌లో… కన్నింగ్ గాడి ట్రాప్‌లో… స్పైన్ చిల్లింగ్ సర్వైవల్ థ్రిల్లర్

OTT Movie : పసికూనను తింటేగానీ తీరని ఆకలి… సూపర్ హీరోలను ఈకల్లా పీకి పారేసే మాన్స్టర్… ఫుల్ యాక్షన్ ధమాకా

Baramulla OTT : పట్టపగలే పిల్లలు అదృశ్యం… కుమార్తె రూమ్ లో కుక్క వాసన… ఇంటెన్స్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్

The Bengal Files: ఓటీటీకి వివాదస్పద చిత్రం.. ‘ది బెంగాల్‌ ఫైల్స్‌’, ఎక్కడ చూడాలంటే!

OTT Movie : కళ్ళతో చూస్తే ఆత్మహత్య… ప్రపంచాన్ని తుడిచి పెట్టే మిస్టీరియస్ శక్తి… గ్రిప్పింగ్ థ్రిల్లర్… ఊహించని ట్విస్టులు

OTT Movie : దసరా ఉత్సవాలపై 40 నిమిషాల మూవీ…. ‘ప్రొద్దుటూరు దసరా’ ఏ ఓటీటీలో ఉందో తెలుసా?

OTT Movie : స్నేహితుడిని ఇంటికి ఆహ్వానిస్తే… ఒక్కొక్కరిని మట్టుబెడుతూ పని కానిచ్చే సైకో… గూస్ బంప్స్ తెప్పించే థ్రిల్లర్

Avihitham: పితృస్వామ్య రాజ్యంలో బాధితులుగా కూతుర్లు.. ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం..!

Big Stories

×