BigTV English
Advertisement

OTT Movie : ఇష్టంలేని భార్యతో కాపురం… ఎఫైర్ కోసం వరుసగా మూడు హత్యలు

OTT Movie : ఇష్టంలేని భార్యతో కాపురం… ఎఫైర్ కోసం వరుసగా మూడు హత్యలు

OTT Movie : క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలను ప్రేక్షకులు సైలెంట్ గా చూస్తూ ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే ఉత్కంఠతో ఎదురు చూస్తారు. ఇటువంటి సినిమాలు ఓటిటి ప్లాట్ ఫామ్ లో చాలానే స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే భార్యను భర్త చంపే ఒక డిఫరెంట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


జి ఫైవ్ (Zee5)

ఇప్పుడు మనం చెప్పుకోబోయే మరాఠీ మూవీ పేరు “వాల్వి” (Vaalvi). భర్త అక్రమ సంబంధానికి భార్య అడ్డుగా ఉందని ఆమెను చంపే ప్రయత్నంతో మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ జి ఫైవ్ (Zee5) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

అంకిత్, దేవిక భార్యాభర్తలుగా ఉంటారు. భార్యపై అంకిత్ కు ఏమాత్రం ఇష్టం ఉండదు. భర్త ఒక డెంటిస్ట్ తో అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. భార్యకి పిల్లలు కూడా పుట్టుకపోవడంతో ఆమెను చంపాలని డిసైడ్ అవుతాడు. ఈ విషయం డెంటిస్ట్ కు చెప్పి పక్కా ప్లాన్ అమలుచేస్తాడు. నాకు అప్పులు ఉన్నాయి విడాకులు తీసుకోమని కోరతాడు. దీనికి దేవిక ఒప్పుకోకపోవడంతో, ఇద్దరం సూసైడ్ చేసుకుందామని చెప్తాడు. ఆమె ఇందుకు ఒప్పుకోవడంతో, ఆమె చేతనే ఒక సూసైడ్ లెటర్ రాయించాలని పథకం వేస్తాడు. మొదట అలాగే లెటర్ కూడా రాయిస్తాడు. ఆఫీస్ కి వెళ్లి వచ్చిన తర్వాత చనిపోదామని నమ్మ పలుకుతాడు. తిరిగి వచ్చినాక ఆమె స్పృహ లేకుండా పడి ఉంటుంది. పరీక్షించి చూడగా చివరికి దేవిక చనిపోయి ఉంటుంది.  ఆమెకు డిప్రెషన్ తగ్గడానికి డాక్టర్ ఎక్కువ మోతాదులో మందు ఇవ్వడం వల్ల అలా జరిగి ఉంటుంది. డాక్టర్ కూడా అక్కడ ఉండటంతో వీళ్లంతా కలిసి శవాన్ని మాయం చేయాలనుకుంటారు.

శవాన్ని కారులో తీసుకు వెళ్తుండగా, వీరిని ఒక అమ్మాయి లిఫ్ట్ అడుగుతుంది. కారులో ఉన్న శవాన్ని చూసి ఆమెకు డౌట్ వస్తుంది. పోలీసులకు ఫోన్ చేసేలోగా ఆమెను కూడా వీళ్ళు చంపేస్తారు. దారి మధ్యలో ఒక పోలీస్ వీళ్లను ఆపుతాడు, అతన్ని కూడా ఇలాగే చంపి శవాలను కారులో వేసుకొని  ఇంటికి తిరిగి వెళ్తారు. ఆ మూడు శవాలను ఎలా మాయం చేయాలని వీళ్ళంతా ఆలోచిస్తుండగా, దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఒకటి జరుగుతుంది. ఆ ఊహించని ట్విస్ట్ ఏమిటి? శవాలను వీళ్లు మాయం చేస్తారా? డెంటిస్ట్ తో అంకిత్ కలసి జీవిస్తాడా?  శవాలను మాయం చేసే క్రమంలో వీళ్ళకి ఏమైనా సమస్యలు వస్తాయా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఓటిటి  ప్లాట్ ఫామ్ జి ఫైవ్ (Zee5) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ “వాల్వి ” (Vaalvi) క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తప్పకుండా చూడండి. ఈ మూవీలో క్లైమాక్స్ ను మిస్ కాకుండా చూడండి.

Tags

Related News

OTT Movie : నలుగురు కుర్రాళ్ళు ఒకే అమ్మాయితో… నెలలోపే ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ కామెడీ చిత్రం

OTT Movie : రాకుమారిని వెంటాడే నాగ బంధనం… ఆత్మను ప్రేమించే నరుడు… ఓటీటీలో సరికొత్త థ్రిల్లర్

OTT Movie : భర్త ఉండగా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో… మన తెలుగు సినిమానే కాపీ కొట్టారు మావా

OTT Movie : అమ్మాయిల డర్టీ స్కామ్… ఆటగాళ్లే వీళ్ళ టార్గెట్… అన్నీ అవే సీన్లు మావా

OTT Movie : పక్షవాతం వచ్చినోడితో ప్రేమాయణం… గుండెను పిండేసే ప్రేమకథ… లవర్స్ డోంట్ మిస్

OTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథOTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథ

OTT Movie : పనోడి కొడుకుతో ఆ పాడు పని… అక్క లైఫ్ లో అగ్గిరాజేసే చెల్లి… క్లైమాక్స్ లో ఫ్యూజులు ఎగిరిపోయే ట్విస్ట్

OTT Movie : 100 డాలర్స్ తో అన్నోన్ సిటీలో వదిలేస్తే… బుర్రబద్దలయ్యే షాక్… రిచ్ అవ్వాలనుకునే ప్రతి ఒక్కరూ చూడాల్సిన సిరీస్

Big Stories

×