BigTV English
Advertisement

OTT Movie : టీచర్ ను ఇష్టపడే పిల్లాడు… గుండెల్ని మెలిపెట్టే ఎమోషనల్ స్టోరీ

OTT Movie : టీచర్ ను ఇష్టపడే పిల్లాడు… గుండెల్ని మెలిపెట్టే ఎమోషనల్ స్టోరీ

OTT Movie : స్టూడెంట్ టీచర్ మధ్య లవ్ కాన్సెప్ట్ మూవీస్ చాలానే వచ్చాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. నిజంగా జరిగిన ఒక యదార్థ కథ నుంచి ఈ మూవీని తెరకెక్కించారు మేకర్స్. ఇది ఒక ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ మూవీ చూస్తున్నంత సేపు పల్లెటూరు వాతావరణం ఆస్వాదిస్తాం. థియేటర్ లలో సందడి చేసిన ఈ మూవీ ప్రస్తుతం డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.


హాట్ స్టార్( Hotstar) లో

ఇది ఒక తమిళ్ మూవీ. స్కూల్ కి వెళ్లే విద్యార్థి టీచర్ ని ఇష్టపడుతూ ఉంటాడు.ఈ మూవీ వీరిద్దరి మధ్య తిరుగుతూ ఉంటుంది. ఈ మూవీ పేరు “వా జై ” (vaazhai). విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీ  ఫ్లాట్ ఫామ్ హాట్ స్టార్ (Hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

శివ అనే ఒక స్కూల్ విద్యార్థి అదే స్కూల్లో పాఠాలు చెప్పే టీచర్ని ఇష్టపడుతూ ఉంటాడు. వీరిది ఒక పేద కుటుంబం. అతని తండ్రి చనిపోవడంతో, తల్లి, అక్క పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు. ఆ ఊరిలో అరటి గెలలు మోసే కూలీలుగా పని చేస్తూ ఉంటారు. శివ కి ఆ పని అంటే చాలా భయం. ఎందుకంటే అతని తండ్రి అవి మోస్తూ ప్రమాదవశాత్తు చనిపోతాడు. అప్పట్నుంచి ఆ పనికి వెళ్లాలంటే అది గుర్తొచ్చి భయపడుతూ ఉండేవాడు. ఇది ఇలా ఉంటే స్కూల్ టీచర్ ని ఎప్పుడూ చూస్తూ ఆనంద పడుతూ ఉంటాడు. ఒకరోజు స్కూల్ టీచర్ కర్చీఫ్ ను తీసుకొని తన దగ్గర దాచి పెట్టుకుంటాడు. ఆ విషయం టీచర్ కి తెలిసి అది అతని దగ్గరే ఉంచుకోమంటుంది. ఆ కర్చీఫ్ ను చూసుకుంటూ శివ ఆనందపడతాడు. ఇది ఇలా ఉంటే వీరి కుటుంబం అప్పు ఎక్కువగా తీసుకొని ఉండటంతో శివని కూడా పనిలోకి తీసుకెళ్తారు.

మొదట భయపడ్డ శివ ఆ తర్వాత పనికి అలవాటు పడతాడు. అలా పని చేస్తూ పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుంటాడు. అది చూసి టీచర్ అతనిని అభినందిస్తుంది. ఒకరోజు లారీలో పనికి వెళ్లిన ఈ కుటుంబానికి ఘోర ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదంలో శివ అక్క తీవ్రంగా గాయపడుతుంది. శివకి కూడా తీవ్ర గాయాలు అవుతాయి. చివరికి వీరి కుటుంబం ప్రాణాలతో బయటపడుతుందా? ఆ ప్రమాదం ఎందుకు జరిగింది? శివ, టీచర్ల ప్రేమ ఎంతవరకు వెళుతుంది. అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే హాట్ స్టార్ (Hotstar) లో స్ట్రీమింగ్ అవుతున్న”వాజై ” (vaazhai) అనే ఈ మూవీని తప్పకుండా చూడండి. ఈ మూవీ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా మంచి మార్కులు కొట్టేసింది. ఒక మంచి మూవీ చూడాలనుకునేవాళ్ళు ఈ మూవీ పై ఓ లుక్ వేయండి.

Related News

OTT Movie : దొంగను దేవుడిగా మార్చే కోహినూర్ డైమండ్… బిచ్చగాళ్లతో కలిసి అరాచకం… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ

OTT Movie : దెయ్యాలను తరిమికొట్టే సిస్టర్స్… కుర్రాడి ఎంట్రీతో కథలో ట్విస్ట్… తెలుగులోనూ హర్రర్ మూవీ స్ట్రీమింగ్

OTT Movie : నలుగురు కుర్రాళ్ళు ఒకే అమ్మాయితో… నెలలోపే ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ కామెడీ చిత్రం

OTT Movie : రాకుమారిని వెంటాడే నాగ బంధనం… ఆత్మను ప్రేమించే నరుడు… ఓటీటీలో సరికొత్త థ్రిల్లర్

OTT Movie : భర్త ఉండగా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో… మన తెలుగు సినిమానే కాపీ కొట్టారు మావా

OTT Movie : అమ్మాయిల డర్టీ స్కామ్… ఆటగాళ్లే వీళ్ళ టార్గెట్… అన్నీ అవే సీన్లు మావా

OTT Movie : పక్షవాతం వచ్చినోడితో ప్రేమాయణం… గుండెను పిండేసే ప్రేమకథ… లవర్స్ డోంట్ మిస్

OTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథ

Big Stories

×