OTT Movie : హర్రర్ థ్రిల్లర్ మూవీస్ చూడాలనే ఉత్సాహం చాలామందికి ఉంటుంది. వీటిలో కొన్ని సినిమాలు అంతగా భయపెట్టే విధంగా ఉండవు. వాటిని ఎవరైనా ఎప్పుడైనా చూసే విధంగా ఉంటాయి. మరికొన్ని సినిమాలు పగలు చూడాలన్నా భయంగానే ఉంటుంది. అటువంటి సినిమాలు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో చాలానే స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలా భయపెట్టే ఒక హర్రర్ థ్రిల్లర్ మూవీ గురించి ఈ రోజు మన మూవీ సజెషన్ లో తెలుసుకుందాం. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో
ఈ హర్రర్ థ్రిల్లర్ మూవీ పేరు “వెన్ ఈవిల్ లర్క్స్” (When Evil Lurks). ఈ మూవీలో మొదటి నుంచి చివరి దాకా వచ్చే సస్పెన్స్ మూవీ లవర్స్ తట్టుకోవడం కష్టమే. వైలెంట్ గా ఉండే ఈ మూవీని ఒంటరిగా చూడడం కూడా అసాధ్యమే. ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
జిమ్మీ తన ఫ్రెండ్ తో కలసి నడుచుకుంటూ వెళుతున్నప్పుడు అతనికి ఒక శవం కనబడుతుంది. ఇతన్ని దొంగ అనుకొని ఊరిలో ఉన్న భూస్వామి చంపి ఉంటాడని అనుకుంటాడు. ఆ శవం దగ్గర ఒక ముసలామె ఫోటోతో పాటు, ఆ ఇంటికి ఎలా వెళ్లాలో అడ్రస్ కూడా ఉంటుంది. అది తీసుకొని మొదటగా భూస్వామి దగ్గరికి వెళ్తాడు. అతన్ని నేను చంపలేదని, నా భూమి మీద ప్రభుత్వానికి కన్ను ఉన్నందువలన ఏమన్నా చేస్తుందేమో అని అనుమానపడతాడు. ఆ తర్వాత జిమ్మీ ఆ ఫోటోలో ఉన్న ముసలమ్మ దగ్గరికి వెళ్తాడు. మీ కోసం వచ్చిన వ్యక్తి ఎవరో మీకు తెలుసా అని అడుగుతాడు. అందుకు ఆమె నా కొడుకును చంపడానికి అతన్ని పిలిపించానని సమాధానం చెబుతుంది.
ఎందుకంటే ఆమె కొడుకులో ఒక దయ్యం ఉంటుంది. అతడు మంచానికే పరిమితమై ఉంటాడు. అతని ద్వారా పునర్జన్మ ఎత్తాలని ఆ దయ్యం చూస్తుంది. అప్పుడు అతను పోలీసులకు కంప్లైంట్ చేశారా అని ఆమెతో చెప్తాడు. ఈ విషయం అందరికీ తెలుసని ఆమె అతనికి సమాధానం చెబుతుంది. చేసేదేం లేక జిమ్మీ దయ్యం ఆవహించి ఉన్న ఆ బాడీని కారులో తీసుకొని ఎక్కడైనా దూరంగా వదలాలని వెళ్తాడు. తిరిగి ఇంటికి వచ్చి చూస్తే ఆ ముసలామె తన భర్తని చంపి, తనూ చచ్చిపోయి ఉంటుంది.
ఆ దయ్యం ఇదంతా చేస్తుందని జిమ్మీ తన మాజీ భార్య సబ్రీన దగ్గరికి వెళ్తాడు. జిమ్మీ, సబ్రినాకు విడాకులు ఇవ్వడంతో ఆమె మరొకరిని పెళ్లి చేసుకుని ఉంటుంది. అయితే పిల్లలు మాత్రం జిమ్మీ సంతానం కావడంతో వారిని కాపాడుకోవాలని ప్రయత్నిస్తాడు. ఇదంతా సబ్రినకి చెబుతున్న సమయంలోనే ఆమె కూతుర్ని ఆ ఇంట్లో ఉన్న కుక్క పీక్కు తింటూ ఉంటుంది. అది చూసి వాళ్లంతా కంగారు పడతారు. చనిపోయిన కూతురు మళ్ళీ వెంటనే బతికి వస్తుంది. వచ్చింది దయ్యమని గ్రహించిన జిమ్మీ మిగతా ఇద్దరు పిల్లల్ని తీసుకొని అక్కడినుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు సబ్రీన భర్త ఆమెను కారుతో గుద్ది చంపేస్తాడు. జిమ్మీ పిల్లలను తీసుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అక్కడ మార్గమధ్యంలో సబ్రిన పిల్లవాడిని తీసుకొని పీక్కుతింటూ కారుకు అడ్డంగా ఉంటుంది. అది చూసి జిమ్మీ ఆ దయ్యాన్ని కారుతో గుద్దుతాడు. అలా కొంత దూరం వెళ్ళాక వాళ్ళ అమ్మ దగ్గరకి చేరుతాడు. ఆమె కొన్ని విషయాలు జిమ్మీకి చెప్తుంది. దయ్యం మన పరిసరాలలోకి రాకుండా ఉండాలంటే కొన్ని సూచనలు పాటించాలని తెలియజేస్తుంది. చివరికి ఆ దయ్యం పునర్జన్మ తీసుకుంటుందా, పిల్లలను ఆ దయ్యం బారి నుంచి జిమ్మీ కాపాడతాడా? ఇంతకీ ఆ దయ్యం పునర్జన్మ ఎత్తడానికి కారణం ఏమిటి? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తప్పకుండా చూడండి.