OTT Movie : డిజిటల్ మీడియా ఓటిటి ప్లాట్ ఫామ్ లో యూత్ ని ఎంటర్టైన్ చేసే సినిమాలకు ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. ఈ సినిమాలలో కొన్ని సన్నివేశాల కోసం యూత్ మళ్లీ మళ్లీ ఈ సినిమాలను చూస్తూ ఉంటారు. అటువంటి సినిమాలు ఓటిటి ప్లాట్ఫారం లో చాలానే ఉన్నాయి. అందులో ఒక మూవీ ఈరోజు మన మూవీ సజెషన్లో తెలుసుకుందాం. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో
ఈ రొమాంటిక్ సస్పెన్స్ మూవీ పేరు “విక్డ్ మైండ్స్” (Wicked Minds). సవతి తల్లితో రొమాన్స్ చేసి, తండ్రి హత్య కేసులో ఇరుక్కునే ఒక కొడుకు కథ చుట్టూ మూవీ నడుస్తుంది. ఈ రొమాంటిక్ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
మాసన్ తన భార్య చనిపోవడంతో లానా అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఇతనికి పెళ్లీడు వచ్చిన హోల్డెన్ అనే ఒక కొడుకు కూడా ఉంటాడు. చదువు ముగించుకొని ఇంటికి వచ్చిన హోల్డన్ తన గది డోర్ తీసేటప్పుడు లానా బట్టలు మార్చుకుంటూ ఉంటుంది. అది చూసి ఆమెకు సారీ చెప్పి వెళ్ళిపోతాడు హోల్డెన్. ఒకరోజు మాసన్ లానాని ఒక పార్టీకి తీసుకు వెళ్తాడు. అక్కడికి హోల్డెన్ కూడా వస్తాడు. హోల్డెన్ తనకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేదని ఇప్పుడు బ్రేకప్ అయిందని లానాకు చెప్తాడు. ఆ పార్టీలో లానా నికోలన్ అనే అమ్మాయిని హోల్డెన్ కి పరిచయం చేపిస్తుంది. ఆ పార్టీలో మరొకరితో డాన్స్ వేయడం చూసి మాసన్ లానాని కొడతాడు. తన తండ్రి ఇలాగే కొడతాడని, తన తల్లిని కూడా అలాగే హింసించేవాడని లానాతో హోల్డెన్ చెప్తాడు. వీళ్ళిద్దరూ బయటకు వెళ్లి మద్యం సేవిస్తూ ఏకాంతంగా గడుపుతారు. సవతి తల్లితో అలా గడపడం తప్పనిపించినా ఆమెతో మళ్లీ రొమాన్స్ చేస్తూ ఉంటాడు.
ఒకరోజు మాసన్ కి తన భార్యకు ఎవరితోనో అక్రమ సంబంధం ఉందని అనుమానిస్తాడు. మనం జాగ్రత్తగా ఉండాలని ఇద్దరూ ఒకరికొకరు చెప్పుకుంటారు. అలా చెప్పుకుంటూనే ఆ రాత్రి ఇద్దరు ఏకాంతంగా గడుపుతారు. నిద్రలేచి చూసేసరికి పక్కన లానా ఉండదు. హోల్డెన్ ఇంటికి వచ్చినాక తండ్రిని ఎవరో చంపి ఉంటారు. పోలీసుల ఎంక్వయిరీలో వీళ్ళిద్దరూ వేర్వేరు చోట ఉన్నామని అబద్ధాలు చెప్తారు. అయితే తన తండ్రిని లానా చంపి ఉంటుందని హోల్డెన్ అనుమానిస్తాడు. ఈ హత్యను హాల్డెన్ చేశాడని ఆమె ఆరోపిస్తుంది. చివరికి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో దిమ్మతిరిగే విషయాలు బయటకు వస్తాయి. పోలీసులు వెలుగులోకి తెచ్చిన ఆ విషయాలు ఏమిటి? ఆస్తి కోసం ఎవరైనా ఈ పని చేశారా? అక్రమ సంబంధం ఈ హత్యకు దారితీసిందా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న “విక్డ్ మైండ్స్” (Wicked Minds) మూవీని తప్పకుండా చూడండి.