BigTV English
Advertisement

OTT Movie : లవ్ చేస్తున్న అమ్మాయి ఉండగా ఎక్స్ చేసే పాడు పనికి బుర్ర కరాబ్… వర్త్ వాచింగ్ లవ్ స్టోరీ

OTT Movie : లవ్ చేస్తున్న అమ్మాయి ఉండగా ఎక్స్ చేసే పాడు పనికి బుర్ర కరాబ్… వర్త్ వాచింగ్ లవ్ స్టోరీ

OTT Movie : మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ తో వచ్చే సినిమాలకు ప్రేక్షక ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. ఈ సినిమాలను చూడటానికి యూత్ ముందు వరుసలో ఉంటుంది. ఫ్యామిలీ తో కలసి చూసే విధంగా ఒక హాలీవుడ్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


నెట్ ఫ్లిక్స్ 

ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మూవీ పేరు “ఎనీవన్ బట్ యు” (Anyone but you). ఈ మూవీలో హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ డిఫరెంట్ గా ఉంటుంది. ఒకరంటే ఒకరికి ఇష్టం ఉన్న చివరి వరకు ఆ ప్రేమను వ్యక్తం చేయలేక పోతారు. ఈ మూవీ సరదాగా ఉండటంతో పాటు ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్  (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

హీరోయిన్ ఒక షాపులో షాపింగ్ చేసుకుంటూ వాష్ రూమ్ కి వెళ్లడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఆ షాపులో బిల్లింగ్ చేసిన తర్వాతమాత్రమే వాష్ రూమ్ యూస్ చేసుకోవచ్చని ఆ షాప్ యజమాని చెప్తుంది. ఇంతలో అక్కడ హీరో ఆమె నా భార్య అని చెప్తూ, బిల్ యజమానికి చూపిస్తాడు. అప్పుడు హీరోయిన్ వాష్ రూమ్ కి వెళుతుంది. అలా హీరోతో హీరోయిన్ పరిచయం పెంచుకుంటుంది. పార్టీ చేసుకొని ఏకాంతంగా కూడా గడుపుతారు. మరుసటి రోజు హీరోకి చెప్పకుండానే హీరోయిన్ బయటికి వచ్చేస్తుంది. అప్పుడు హీరోయిన్ తన ఫ్రెండ్ తో నేను ఒక అబ్బాయి తో డేట్ చేస్తున్నానని చెప్తుంది. అతనికి చెప్పకుండా వచ్చేసానని చెప్పగా, అతనికి చెప్పి రావాల్సింది అని ఆమె ఫోన్లో అంటుంది. హీరో కు బాయ్ చెప్పడానికి మళ్లీ ఇంటికి వస్తుంది. ఇంతలో హీరో ఆమె వెళ్ళిపోయింది అన్న కోపంతో, తన ఫ్రెండ్ తో ఆమె ఏమంత అందంగా ఉండదు అని అంటూ ఉంటాడు. అదే టైంలో హీరోయిన్ అక్కడికి వచ్చి, హీరో అన్న మాటలు విని బాధగా వెళ్ళిపోతుంది. విషయం ఏమంటే హీరోయిన్ చెప్పకుండా వెళ్ళిపోయినందుకు, హీరో బాధపడుతూ అలా మాట్లాడతాడు. కొంతకాలం గడిచాక, హీరోయిన్  హీరోయిన్ చెల్లెలు ఒక లెస్బియన్ కావడంతో ఆమె మరొక అమ్మాయిని ఇష్టపడి ఉంటుంది.

ఆమె ప్రేమించిన అమ్మాయి హీరోకి రిలేషన్ అవుతుంది. అలా ఒక పెళ్లిలో కలుసుకున్న హీరోతో, హీరోయిన్ నేనంటే నీకు ఇష్టం లేదని ఆరోజు ఎందుకు అలా అన్నావు అని అడుగుతుంది. హీరోకి ఆ విషయం గుర్తు ఉండకపోవడంతో ఆలోచిస్తూ ఉంటాడు. చెల్లి పెళ్లి అవుతుండడంతో హీరోయిన్ ని కూడా పెళ్లి చేసుకోమని తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తారు. అందుకు ఒక అబ్బాయిని కూడా అక్కడికి పిలిపిస్తారు. అయితే అతను అంటే ఇష్టం లేని హీరోయిన్, హీరోతో ఒక నాటకం ఆడమంటుంది. మనిద్దరం లవ్ చేసుకుంటున్నట్టు నటిస్తే, అతడు నన్ను వదిలి వెళ్ళిపోతాడు అని హీరోతో చెప్తుంది. వీళ్ళిద్దరూ అలాగే నటిస్తూ ఉంటారు. లోపల ఒకరంటే ఒకరికి ఇష్టం ఉన్నా అలాగే నటిస్తూ ఉంటారు. ఒకసారి హీరో మాజీ గర్ల్ ఫ్రెండ్ హీరోకి నువ్వంటే నాకు ఇష్టం అంటూ ఒక ముద్దు ఇస్తుంది. అది చూసి హీరోయిన్ ఆ పెళ్లి నుంచి వెళ్ళిపోతుంది. చివరికి హీరో హీరోయిన్ ని సొంతం చేసుకుంటాడా? హీరో ప్రేమని హీరోయిన్ యాక్సెప్ట్ చేస్తుందా? వీళ్ళిద్దరూ కల్పించుకున్న అపోహలు తొలగిపోతాయా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మూవీని తప్పకుండా చూడండి.

Related News

OTT Movie : అన్న కోసం అరణ్యంలో వేట… కట్ చేస్తే వెన్నులో వణుకు పుట్టించే ట్విస్ట్… కల్లోనూ వెంటాడే హారర్ సీన్స్

OTT Movie : ఒకరిని లవ్ చేసి మరొకరితో రాసలీలలు… క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్… ప్యూర్ గా పెద్దలకు మాత్రమే

OTT Movie : వరుస హత్యలు…మిస్సైన అమ్మాయిని చంపడానికి జైలు నుంచి ఎస్కేపయ్యే సైకో… ఈమె డెడికేషన్ కో దండం సామీ

OTT Movie : అమ్మాయిల మధ్య తేడా యవ్వారం… ట్రిప్పు కోసం వెళ్లి సైకో కిల్లర్ల చేతిలో అడ్డంగా బుక్… బ్రూటల్ బ్లడ్ బాత్

OTT Movie : మిస్సైన కూతురి కోసం వెళ్తే ప్యాంటు తడిచే హర్రర్ సీన్లు… ఇలాంటి హర్రర్ మూవీని ఇప్పటిదాకా చూసుండరు భయ్యా

Biker OTT: శర్వానంద్ బైకర్ ఓటీటీ హక్కులు వారికే.. స్ట్రీమింగ్ వివరాలు ఇవే!

Bad Girl OTT: ఓటీటీలోకి వచ్చేసిన కాంట్రవర్శీ గర్ల్.. ఎందులో చూడొచ్చంటే..?

OTT Movie : కర్ణాటక కదంబ రాజవంశం నిధికి దేవత కాపలా… దాన్ని టచ్ చేయాలన్న ఆలోచనకే పోతారు… ‘కాంతారా’లాంటి క్రేజీ థ్రిల్లర్

Big Stories

×