Hari Hara Veeramallu : టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం హరిహర వీరమల్లు.. చిత్రం ఎట్టకేలకు షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని గత నెలలోనే విడుదలకు సిద్ధమైంది. ఎప్పుడో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ కొన్ని టెక్నికల్ కారణాలవల్ల సినిమా విడుదలకు కాస్త ఆలస్యమైంది. పవన్ అభిమానుల కోరిక త్వరలోనే నెరవేరిపోతుంది. ఈ మూవీ విడుదలకు సిద్ధం అవుతుంది. ఇక ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెల 24న థియేటర్లలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలని మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మూవీ నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ దక్కింది.. రిలీజ్ అయిన గంటల వ్యవదిలోనే భారీ వ్యూస్ ను సొంతం చేసుకుంది. అటు యూట్యూబ్ లోను, ఇటు సోషల్ మీడియాలోనూ ఇదే ట్రెండ్ అవుతుంది..
‘వీరమల్లు’ ట్రైలర్..
పవన్ కళ్యాణ్ నుంచి సినిమా వస్తుంది అంటే అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. సినీ హీరోగా వరుసగా సినిమాలు చేసినప్పుడు సినిమాకు భారీ క్రేజ్ ఉంటుంది. ఇక ఇప్పుడు ఏపీకి డిప్యూటీ సీఏం అయ్యాక ఆయన నుంచి వస్తున్న మొదటి మూవీ కావడంతో హరిహర వీరమల్లు పై అంచనాలు ఓ రేంజులో ఉన్నాయి. ఇప్పటిదాకా మేకలను తినే పులిని చూసి ఉంటారు, ఇప్పుడు పులిని వేటాడే బెబ్బులిని చూస్తారు..నేను రావాలని చాలా మంది ఆ దేవుడికి దండం పెట్టుకుంటా ఉంటారు. కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు.. వినాలి.. వీరమల్లు చెప్పింది వినాలి వంటి డైలాగులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి కావాల్సిన జోష్ అందిస్తాయి. చివరిలో రక్తంతో తడిసిన ముఖంతో పవన్ కళ్యాణ్ కనిపించడంతో విజిల్స్ పడ్డాయి. థియేటర్ల విజిల్స్ పడటం పక్కా అని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.
Also Read: ‘తమ్ముడు ‘ ట్విట్టర్ రివ్యూ..సినిమా ఎలా ఉందంటే?
38 మిలియన్ వ్యూస్ తో రికార్డ్ బ్రేక్..
పవన్ కళ్యాణ్ వీరమల్లు ట్రైలర్ రిలీజ్ అయిన కేవలం కొన్ని గంటల లోపే 38 మిలియన్స్ వ్యూస్ ను రాబట్టింది. తెలుగు వెర్షన్ లో ఇప్పటి వరకు 11 మిలియన్ వ్యూస్ వచ్చాయి. హిందీ వెర్షన్ 7 మిలియన్ వ్యూస్ దాటాయి. అదే విధంగా తమిళం , కన్నడం మరియు మలయాళం భాషలకు కలిపి మరో 7 మిలియన్ వ్యూస్ వచ్చాయి. తెలుగు ట్రైలర్ కూడా 4 లక్షలకు పైగా లైక్స్ పడినట్లు తెలుస్తుంది.ఈమధ్య కాలం లో ఒక పాన్ ఇండియన్ సినిమాకు ఈ రేంజ్ లైక్స్ రావడం ఎప్పుడూ జరగలేదట. నిజమైన రీచ్ కి ఇదే నిదర్శనం అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.. ఈ మూవీ ట్రైలర్ కు ఈ రేంజ్ లో రెస్పాన్స్ రావడం మామూలు విషయం కాదు. ఐదేళ్లుగా షూటింగ్ లో ఉన్న ఈ మూవి కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ట్రైలర్ తో మంచి రెస్పాన్స్ దక్కింది.. సినిమా కు కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని ట్రైలర్ ను చూస్తే అర్థమవుతుంది.. ఈ సినిమాకు థియేటర్లలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి..
Fastest 38 Million+ Real Time Views for any Telugu Trailer 🔥🔥🔥🔥
We are already in the top 2 for most viewed Telugu trailer in 24 hours.#HHVMTrailer #HariHaraVeeraMallu pic.twitter.com/rByIFfKbI0
— Hari Hara Veera Mallu (@HHVMFilm) July 3, 2025