Ferrari Car: దేనికైనా హద్దు పద్దు ఉంటుంది. శృతి మించితే ఇబ్బందులు తప్పవు. ఫెరారీ కారు ఓనర్‌కి అదే జరిగింది. పన్ను కట్టకుండా ఇన్నాళ్లు తప్పించుకుని తిరిగాడు. చివరకు అతగాడు డేటా తీసి చూస్తే దాదాపు కోటిన్నరకు చేరింది. మొత్తం సొమ్మంతా కట్టించాడు ఆర్టీఓ అధికారులు. ఈ వ్యవహారం బెంగుళూరులో వెలుగు చూసింది.
టెక్ యుగంలో ఏ చిన్న తప్పు చేసినా అడ్డంగా దొరికిపోవడం ఖాయం. 1980 కాలం మాదిరిగా ప్రవర్తించాలని భావిస్తే బుక్ అవ్వడం ఖాయం. కొంతమంది బడాబాబులు కొన్నాళ్ల కిందట ఖరీదైన కార్లను వేరే రాష్ట్రాల్లో కొనుగోలు చేసి సొంత రాష్ట్రానికి తెచ్చేశారు. అప్‌కోర్సు ఇప్పుడు ఉన్నారనుకోండి అది వేరే విషయం.
ఖరీదైన కార్లంటే ట్యాక్స్ ఎక్కువగా ఉంటుందని భావించి, దాని నుంచి తప్పించు కునేందుకు ఇలాంటి ఎత్తుగడ వేసేవారు. అసలే టెక్ యుగం.. పన్నుదారులు ఎక్కడున్నా పట్టేస్తున్నారు అధికారులు. చెల్లించాల్సిన బకాయిలను ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. బెంగుళూరులోని ఓ కారు ఓనర్ విషయంలో అదే జరిగింది.
బెంగుళూరు సిటీలోని ఓ వ్యక్తికి ఫెరారీ కారు మహా ఇష్టం. దాన్ని మహరాష్ట్ర నుంచి తెచ్చాడు. దాని ఖరీదు అక్షరాలా 7.5 కోట్ల రూపాయలు. ఫెరారీ ఎస్ఎఫ్90 స్ట్రాడాలే కారు ఎరుపు రంగులో ఉంటుంది. ఆనాటి నుంచి బెంగుళూరు బుల్లి రోడ్లపై ఫెరీరా కారు తెగ చక్కర్లు కొడుతోంది. ఆ కారు అందరి దృష్టి ఆకర్షించింది.
ALSO READ: నటుడు విజయ్ అభిమాని ఆత్మహత్య, సూసైడ్ నోట్‌లో షాకింగ్ విషయాలు
తమకు ఇలాంటి కారు ఉంటే బాగుండేదని చాలామంది భావించారు. అయితే ఈ కారు కొనుగోలు చేసిన నుంచి కర్ణాటకలో రోడ్డు పన్ను చెల్లించలేదని గుర్తించారు అధికారులు. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌తో ఫెరారీ కారు ఉన్నట్లు బెంగుళూరు ఆర్టీఓ అధికారులు గుర్తించారు. దీనికి ఓనర్ పన్ను చెల్లించలేదని నిర్థారించుకున్నారు. తొలుత నోటీసు ఇచ్చారు. బడాబాబు ఏ మాత్రం పట్టించుకోలేదు.
చివరకు వాహనాన్ని సీజ్ చేశారు అధికారులు. గురువారం సాయంత్రంలోగా మొత్తం బకాయి చెల్లించాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సున్నితంగా హెచ్చరించారు. వెంటనే స్పందించిన యజమాని మొత్తం జరిమానా చెల్లించాడు. కోటి 41 లక్షల 59 వేలు చెల్లించి కారును విడిపించుకున్నాడు.
ఈ మధ్యకాలంలో ఒక వాహనం నుంచి భారీగా పన్ను వసూలు చేయడం మొదటిసారని అంటున్నారు అధికారులు. ఇదేకాకుండే సిటీలో పన్ను చెల్లించని లగ్జరీ కార్ల ఓనర్లకు నోటీసులు తప్పవని చెప్పకనే చెప్పేశారు. ఈ వాహనం సెప్టెంబర్ 2023 నుండి పన్ను చెల్లించకుండా నడుపుతున్నట్లు తేలింది. కారు పత్రాల వెరిఫికేషన్ సమయంలో పన్ను చెల్లించకుండానే నడుపుతున్న విషయం గురించారు ట్రాఫిక్ పోలీసులు. బెంగళూరు సౌత్ RTO అధికారులకు సమాచారం ఇచ్చారు. పన్ను కట్టిన తర్వాత చివరకు RTO అధికారులు కారును యజమానికి తిరిగి ఇచ్చారు.
A luxury #Ferrari worth over ₹7.5 crore was intercepted by RTO officials in #Bengaluru for allegedly evading ₹1.45 crore in road tax. The car, registered in Maharashtra, had reportedly paid only ₹20 lakh in tax there but was being driven in #Karnataka without proper… pic.twitter.com/Rr9A95Lt6K
— News9 (@News9Tweets) July 3, 2025