Hyderabad News: తెలంగాణలో ప్రైవేటు వృత్తి విద్యా కళాశాలలు బంద్ పాటిస్తున్నాయి. ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ప్రతినిధులతో ప్రభుత్వం ఆదివారం అర్థరాత్రి వరకు చర్చలు జరిపింది. సోమవారం మధ్యాహ్నం మరోమారు డిప్యూటీ సీఎంతో చర్చలు జరగనున్నాయి. దీనిపై సోమవారం సాయంత్రం లోపు ప్రభుత్వపరంగా నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు భట్టి విక్రమార్క.
గడిచిన నాలుగేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ప్రైవేటు కాలేజీలకు ప్రభుత్వం చెల్లించలేదు. దీన్ని నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేటు కాలేజీల నిర్వాహకులు సమ్మెకు దిగారు. దీంతో ఇంజనీరింగ్, ఫార్మా, బీఈడీ, ఇతర వృత్తి విద్యా కళాశాలలు బంద్‌కు దిగాయి. సోమారం నుంచి కొన్ని ఇంజినీరింగ్ కళాశాలలు సెలవులు ప్రకటిస్తూ విద్యార్థులకు మెసేజ్‌లు పంపాయి.
ఈనెల 17 వరకు క్లాసులు ఉండవని కొన్ని కాలేజీలు నిర్ణయం తీసుకున్నాయి. వారం రోజులపాటు తరగతులు ఉండవని మరికొన్ని కాలేజీలు పేర్కొన్నాయి. ఆన్‌లైన్ తరగతులు ఉంటాయని పలు కాలేజీలు పేర్కొన్నాయి. నాలుగైదు ఇంజినీరింగ్ కళాశాలలు సెలవులు ప్రకటించలేదు. కళాశాలల ప్రతినిధులతో తెలంగాణ ప్రభుత్వం ఆదివారం రాత్రి చర్చలు జరిపింది.
ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, సీఎస్ రామకృష్ణారావు పాల్గొన్నారు. ఆదివారం రాత్రి 8.45 గంటలకు ప్రారంభమైన చర్చలు అర్థరాత్రి 12.30 గంటల వరకు జరిగాయి. ప్రభుత్వపరంగా సోమవారం ఓ నిర్ణయం తీసుకుంటామని, అప్పటివరకు సమ్మెను విరమించాలని కోరామని భట్టి తెలిపారు.
ALSO READ: మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు
సోమవారం చర్చలో ప్రభుత్వం తెలిపే అంశాల ఆధారంగా తమ నిర్ణయం చెబుతామని కళాశాలల ప్రతినిధులు అన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు చర్చలు సానుకూలంగా జరిగాయని, ప్రైవేట్ కళాశాలల సమస్యలపై చర్చించామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సోమవారం సాయంత్రం లోపు ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటుందని తెలియజేశారు.
ఇంతకీ కాలేజీల ప్రతినిధులు డిమాండ్లు ఏంటి? ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న రూ.1200 కోట్ల బిల్లులను దసరా లోపు చెల్లించాలన్నది మొదటి పాయింట్. నాలుగేళ్ల బకాయిలు డిసెంబరు 31లోపు చెల్లించాలన్నది మరో పాయింట్. బోధనా రుసుము ఎప్పటికప్పుడు చెల్లించేందుకు ట్రస్ట్ బ్యాంకు ఏర్పాటు, ఫీజిబిలిటీ నివేదికను అక్టోబరు 31లోపు విడుదల చేయాలన్నది మూడో పాయింట్.
ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త ఫీజులకు సంబంధించిన జీఓ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను డిసెంబరు 31లోపు విడుదల చేయాలన్నది నాలుగో పాయింట్. వీటిపై సానుకూల నిర్ణయం ప్రభుత్వం నుంచి వస్తుందని కాలేజీల ప్రతినిధులు ఆశగా ఉన్నాయి.
ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో తెలంగాణ ప్రభుత్వం చర్చలు
ఈ రోజు మధ్యాహ్నం మరోసారి చర్చించనున్న ప్రభుత్వం
నేడు తెలంగాణలో ప్రైవేట్ కాలేజీల బంద్
ఇప్పటివరకు జరిగిన చర్చలు సానుకూలంగా జరిగాయని, ప్రైవేట్ కళాశాలల సమస్యలపై చర్చించామన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఈ రోజు సాయంత్రం… pic.twitter.com/DQVFJyMtJa
— BIG TV Breaking News (@bigtvtelugu) September 15, 2025