BigTV English

OTT Movie : మంత్రగత్తె మాయలో మెజీషియన్… మరో లోకంలోకి తీసుకెళ్లే అడ్వెంచర్ థ్రిల్లర్

OTT Movie : మంత్రగత్తె మాయలో మెజీషియన్… మరో లోకంలోకి తీసుకెళ్లే అడ్వెంచర్ థ్రిల్లర్

OTT Movie : ఫాంటసీ సినిమాలను ఉత్సాహంగా చూస్తుంటారు మన ప్రేక్షకులు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఫాంటసీ అడ్వెంచర్ మూవీ చాలా అద్భుతంగా ఉంటుంది. మంత్రాలు, మ్యాజిక్ లతో మరో లోకంలోకి తీసుకు వెళ్లే ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఫాంటసీ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రిమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే….


డిస్నీ+ హాట్ స్టార్ (Disney+hotstar) లో

ఈ హాలీవుడ్ ఫాంటసీ మూవీ పేరు ‘ఓజ్ ది గ్రేట్ అండ్ పవర్‌ఫుల్‘ (Oz : The Great and Powerful). ఈ ఫాంటసీ అడ్వెంచర్ మూవీకి సామ్ రైమి దర్శకత్వం వహించారు. జేమ్స్ ఫ్రాంకో టైటిల్ రోల్‌లో నటించగా, మిలా కునిస్, రాచెల్ వీజ్, మిచెల్ విలియమ్స్, జాక్ బ్రాఫ్, బిల్ కాబ్స్, జోయ్ కింగ్, మిగతా పాత్రలు పోషించారు. ఒక రాజ్యంలోకి మాంత్రికుడు అవతారంలో చొరబడ్డ ఆస్కార్ డిగ్స్ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ఇందులో ఓజ్ అనే మెజీషియన్, ముగ్గురు మంత్రగత్తెలను ‘థియోడోరా, ది గుడ్ విచ్ ఆఫ్ ది నార్త్, ఎవనోరా, ది వికెడ్ విచ్ ఆఫ్ ది ఈస్ట్, గ్లిండా, ది గుడ్ విచ్ ఆఫ్ సౌత్’  ఎదుర్కొంటాడు. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ డిస్నీ+ హాట్ స్టార్ (Disney+hotstar) లో స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీ లోకి వెళితే

హీరో మెజీషియన్ గా తన లైఫ్ ని స్టార్ట్ చేస్తాడు. అమ్మాయిలను తనదైన స్టైల్ లో ట్రాప్ చేస్తూ ఉంటాడు. అలా ఒక అమ్మాయికి చిన్న మ్యూజిక్ బాక్స్ ఇస్తాడు. ఆ విషయం అమ్మాయి భర్తకు తెలిసి హీరో వెంబడి పడతాడు. హీరో అతని నుంచి తప్పించుకుని, ఒక మిస్టరీ ప్రాంతానికి వెళ్ళిపోతాడు. ఆ ప్రాంతం చూడటానికి చాలా అందంగా ఉంటుంది. అక్కడికి వచ్చిన హీరోయిన్, హీరోను చూసి మా రాజ్యాన్ని కాపాడడానికి వచ్చినవాడే అనుకుంటుంది. అతన్ని పరిచయం చేసుకొని, తమ రాజ్యానికి ఉన్న ఇబ్బందులను చెబుతుంది. ఈ ప్రాంతాన్ని పాలించే రాజును ఒక మంత్రగత్తె చంపిందని, ఆమెని నా సిస్టర్ ఈ రాజ్యం నుంచి వెళ్లగొట్టిందని చెప్తుంది. ఇప్పుడు ఆ మంత్రగత్తే ఈ రాజ్యాన్ని నాశనం చేయాలని చూస్తోందని హీరోతో చెబుతుంది. ఆ మంత్రగత్తె నుంచి మీరే కాపాడాలని చెప్తుంది. అయితే హీరో ఇక్కడ బంగారం ఉందా అని అడుగుతాడు. ఆమె కావలసినంత ఉంది అని చెప్తుంది.

హీరో ఆ బంగారాన్ని తీసుకొని వెళ్ళిపోదాం అనుకుంటాడు. అలా ఆలోచిస్తూ వెళ్తుండగా, ఒక కోతి పొదలో చిక్కుకొని ఉంటుంది. దానిని కాపాడే ప్రయత్నంలో సింహం అక్కడికి వస్తుంది. హీరో దగ్గర మొన్న మ్యాజిక్ పౌడర్ పొరపాటున బయటపడటంతో, సింహం భయపడి వెళ్ళిపోతుంది. అప్పుడు వాళ్ళంతా, ఇతడే శక్తులు ఉన్న మంత్రగాడు అనుకుంటారు. ఆ మంత్రగత్తెను ఇతడు ఓడిస్తాడని నమ్ముతారు. అలా రాజ్యానికి హీరోని తీసుకువెళ్ళి, ఆ మంత్రగత్తెను చంపడానికి వెల్లమంటారు. అలా హీరో తనకు మంత్రాలు రాకపోయినా, మంత్రగత్తె కోసం వెళ్తాడు. చివరికి హీరో మంత్రగత్తెను చంపుతాడా? హీరోకి మంత్రాలు రావని తెలిసిపోతుందా? ఆ మంత్రగత్త చేతిలో హీరో ఏమవుతాడు? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ‘ఓజ్ ది గ్రేట్ అండ్ పవర్‌ఫుల్’ (Oz : The Great and Powerful) అనే ఈ ఫాంటసీ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×