ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా రైల్వేశాఖ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు స్టేషన్లలో రైళ్లకు స్టాపేజీ ఇవ్వాలని నిర్ణయించింది. వీటిలో దూర ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లు ఉన్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే వెల్లడించింది. మొత్తం 57 రైళ్లకు కొత్తగా హాల్టింగ్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలను కూడా వెల్లడించింది. వీటిలో 26 ఎక్స్ ప్రెస్ రైళ్లతో పాటు సూపర్ ఫాస్ట్ రైళ్లు ఉన్నాయి. ఈ రైళ్లన్నీ ఇప్పటి వరకు ఆగని స్టేషన్లలో ఆగనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
ఏ రైళ్లకు ఎక్కడ హాల్టింగ్ ఇచ్చారంటే?
తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం ఎంపిక చేసిన రైల్వేస్టేషన్లలో ప్రయోగాత్మక స్టాపేజీని పొడిగిస్తున్నట్లు రైల్వేశాఖ అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం 6 నెలల పాటు అమల్లో ఉంటుందని వెల్లడించారు. ఈ మేరకు స్టాపేజీ ఇస్తున్న రైళ్ల వివరాలతో కూడిని ప్రకటను అధికారులు విడుదల చేశారు.
⦿ భువనేశ్వర్-సికింద్రాబాద్ (17015) రైలుకు సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్లగొండ స్టేషన్లలో హాల్టింగ్ ఇచ్చారు.
⦿ గుంతకల్-హైదరాబాద్ (17022), జైపుర్-మైసూర్ (12976), యల్హంక-కాచిగూడ, తిరుపతి-సికింద్రాబాద్ (12769), హజ్రత్ నిజాముద్దీన్-తిరుపతి (12708), ఎర్నాకులం-పట్నా (22669), బీదర్-హైదరాబాద్ (17009) రైళ్లకు గద్వాల, షాద్ నగర్, శ్రీరాంనగర్, బెల్లంపల్లి, ఖమ్మం, మంచిర్యాల, మర్పల్లి స్టేషన్లలో స్టాపేజీ ఇచ్చారు. ఈ రైళ్లు ఆయా స్టేషన్లలో ఆగస్టు వరకు ఆగుతాయని అధికారులు వెల్లడించారు.
⦿ డాక్టర్ అంబేద్క నగర్-యశ్వంత్ పుర్ (19301), నాగర్ సోల్-చెన్నై సెంట్రల్ (16004) రైళ్లకు మహబూబ్‌నగర్ స్టేషన్‌లో.. చెన్నై సెంట్రల్-అహ్మదాబాద్ (12656), అహ్మదాబాద్-చెన్నై సెంట్రల్ (12655), సికింద్రాబాద్-హిస్సార్ (22737), హైదరాబాద్-రక్సౌల్ (17005), రక్సౌల్- హైదరాబాద్ (17006) రైళ్లకు పెద్దపల్లిలో.. సికింద్రాబాద్-గుంటూరు (12706), గుంటూరు-సికింద్రాబాద్ (12705) రైళ్లకు నెక్కొండలో హాల్టింగ్ ఇస్తున్నట్లు తెలిపారు.
⦿ చెన్నై సెంట్రల్-హజ్రత్ నిజాముద్దీన్ (12611) రైలు వరంగల్ లో.. చెన్నై సెంట్రల్-హైదరాబాద్ (12603) రైలు సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్లగొండ స్టేషన్లలో 6 నెలల పాటు ఆగుతాయని అధికారులు తెలిపారు.
⦿ తిరుపతి-లింగంపల్లి (12733) ఎక్స్ ప్రెస్ కు పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడలో, నర్సాపూర్-లింగంపల్లి (17255)కి నల్లగొండలో, లింగంపల్లి-నర్సాపూర్ (17256)కు మంగళగిరిలో, విశాఖపట్నం-సికింద్రాబాద్ (20833), సికింద్రాబాద్-విశాఖపట్నం (20834) రైళ్లకు సామర్లకోటలో హాల్టింగ్ ఇచ్చారు. వీటితో పాటు మరికొన్ని రైళ్లకు స్టాపేజీ ఇస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రయాణీకులు వినియోగించుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.
రైల్వే మార్గాల్లో ముమ్మర తనిఖీలు
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అన్ని మార్గాల్లో తనిఖీలు ముమ్మరం చేయాలని జీఎం అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. రైళ్ల భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించకూడదన్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోని ఆరు డివిజన్ల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రమాదాలు జరగకుండా లోకో పైలట్లు, అసిస్టెంట్ లోకో పైలట్లకు రెగ్యులర్ గా కన్సెలింగ్ ఇవ్వాలని ఆదేశించారు. లెవల్ క్రాసింగ్ గేట్లను వెంటనే తొలగించాలని సూచించారు. అన్ని రైళ్లు నిర్ణీత సమయానికి నడిచేలా చర్యలు తీసుకోవాలని డివిజనల్ అధికారులను జైన్ ఆదేశించారు.
Read Also: కుంభమేళాకు వెళ్లే తెలుగు భక్తులకు గుడ్ న్యూస్, ఆ రెండు రైళ్లకు బోగీల పెంపు!
Shri Arun Kumar Jain, General Manager, South Central Railways holds review meeting on safety of train operations today at Rail Nilayam in the presence of Principal Heads of the Departments
👉DRMs of 6 Divisions participated through video link@arunjainir @RailMinIndia pic.twitter.com/UkOCkaSn3I
— South Central Railway (@SCRailwayIndia) February 4, 2025
Read Also:ట్రైన్ టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ చేస్తున్నారా? కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!